Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

డెంగ్యూ మరణాలపై దుష్ప్రచారం

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క డెంగ్యూ మరణం కూడా నమోదు కాలేదు. ప్రతిపక్షాలు మాత్రం పనిగట్టుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 465 డెంగ్యూ కేసులు నమోదైతే ఆదిలాబాద్‌లో 131, ఖమ్మంలో 145, నిజామాబాద్‌లో 98, వరంగల్‌లో 54, మిగతాచోట్ల అక్కడక్కడా కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ జ్వరం వచ్చినా ప్రాణాలు పోయేంత ప్రమాదం లేదు. ప్లేట్‌లెట్ కౌంట్ లక్షా 50 వేల నుంచి నాలుగు లక్షల వరకు ఉండాలి. పదివేలకు పడిపోయినా.. తిరిగి పెంచుకునే వీలుంది. -సర్కారును బద్నాం చేసేందుకే ప్రతిపక్షాల కుట్ర -ఇప్పటికీ ఒక్క డెంగ్యూ మృతి నమోదు కాలేదు -ప్రైవేట్ దవాఖానల్లో దోపిడీపై కఠిన చర్యలు -డిప్యూటీ సీఎం తాటికొకండ రాజయ్య హెచ్చరిక

DR Rajaiah visist Nizamabad Govt Hospital

కొన్ని ప్రైవేట్ దవాఖానలు డెంగ్యూ జ్వరం వస్తే రోగులను భయబ్రాంతుకు గురిచేసి లక్షలు దోచుకుంటున్నాయి. ఖర్చులకు మించి వసూలు చేసే దవాఖానలను మూసివేసేందుకు వెనుకాడం అని డిప్యూటీ సీఎం టీ రాజయ్య హెచ్చరించారు. బుధవారం నిజామాబాద్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జిల్లా కేంద్ర దవాఖానను సందర్శించారు. బ్లడ్‌బ్యాంక్, ప్లేట్‌లెట్ సెపరేషన్ మిషన్‌ను ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్‌లో తనిఖీలు చేపట్టారు.

అధికారులతో సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రక్తనిధి కలిగిన 25 దవాఖానల్లో రూ.7.5 కోట్లతో ప్లెట్‌లెట్లను వేరుచేసే యంత్రాల ను ఏర్పాటు చేశామని చెప్పారు. పీహెచ్‌సీలు, సిమాంగ్ సెంటర్లు, సీహెచ్‌సీలతోపాటు ఏరియా దవాఖానలను బలోపేతం చేస్తున్నామని, సీరియస్ కేసులు మాత్రమే హైదరాబాద్‌కు వెళ్లేలా చికిత్సలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాల్సిందేనని చెప్పారు.

బడ్జెట్‌లో వైద్యరంగానికి భారీ కేటాయింపులు ఉంటాయని తెలిపారు. జెడ్పీ చైర్మన్ పదిహేను రోజులకొకసారి జిల్లా కేంద్ర దవాఖానను సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తారని పేర్కొన్నారు. జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి సంబంధించిన ఫైలు సీఎం వద్ద ఉందన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా నర్సింగ్ స్కూల్, బాయ్స్ హాస్టల్ ఏర్పాటుకోసం ప్రభుత్వ స్థలాన్ని అన్వేషించాలని ఆర్డీవోను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 150 కోట్లతో ఆదిలాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నట్లు వెల్లడించారు.

-జూడాలపై కఠిన చర్యలకు వెనుకాడం జూనియర్ డాక్టర్లు కోరిన నాలుగు డిమాండ్లను సీఎం కేసీఆర్ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారని రాజయ్య తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది సర్వీసు చేయాలనే నిబంధన చట్టంలోనే ఉం దని, దీన్ని మార్చాలనడం ఎంత వరకు సబబో ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా జూడాలు విధుల్లో చేరాలని, లేకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

జూనియర్ డాక్టర్లు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామనడం వెనుక అదృశ్యశక్తుల ప్రమేయం ఉం దని అభిప్రాయపడ్డారు. కార్యక్రమాల్లో మంత్రలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న ఎంపీలు కల్వకుంట్ల కవిత, నగేశ్, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, ఇంద్రకరణ్‌రెడ్డి, కోనేరు కోనప్ప, చిన్నయ్య, కోవ లక్ష్మి, రేఖా శ్యాంనాయక్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.