Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దేశంలోనే నంబర్1 కావాలి

హైదరాబాద్ నగరంలో నడిచే ఆర్టీసీ బస్సులను జీహెచ్‌ఎంసీకి అనుసంధానం చేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్‌ ద్వారా వచ్చే నష్టాన్ని నగరపాలక సంస్థ భరిస్తుందని ఆర్టీసీ విస్తృతస్థాయి సమీక్షలో తెలిపారు. ఈ ఏడాది క్రాస్ సబ్సిడీలో భాగంగా రూ.198 కోట్ల చెక్కును జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి ఈ సందర్భంగా సీఎం సమక్షంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణకు అందజేశారు. ఉదయం 11.20కి మొదలుపెట్టిన సమీక్షను సీఎం కేసీఆర్ సాయంత్రం 6.20వరకు.. ఏడు గంటల పాటు నిర్వహించారు. -సిటీ బస్సులు జీహెచ్‌ఎంసీకి అనుసంధానం -నాలుగేండ్లకోసారి గుర్తింపు సంఘం ఎన్నికలు -ఏడు గంటల పాటు ఆర్టీసీ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

CM-KCR-review-meet-with-TSTRC-Officials

ఈ సందర్భంగా సీఎం ప్రతి డిపో మేనేజర్‌తో మాట్లాడించారు.నష్టాలను తగ్గించుకుని లాభాలార్జించేందుకు అనుసరించిన పద్ధతులను జగిత్యాల డిపో మేనేజరు పీ హన్మంతరావు వివరించగా సీఎం కేసీఆర్ ఆయనను అభినందించారు. అందరూ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం చెప్పారు. ఆర్టీసీపై సీఎం ఇన్ని గంటలు సమీక్ష నిర్వహించడం చరిత్రలో ఇదే తొలిసారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. సమావేశంలో సీఎం చేసిన సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే..

-డిపోల పరిస్థితి మెరుగుపర్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలి. జిల్లాల ఆర్‌ఎంలు, డిపో మేనేజర్లతో చర్చించి డిపోల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలి. -గ్రామాల్లో పల్లె వెలుగు బస్సులు పూర్తిగా నిండడం లేదు. పెద్ద బస్సులుకాకుండా చిన్న బస్సులు ఆ రూట్లలో నడిపితే మేలు. బస్టాండ్లలో మినీ థియేటర్లు పెట్టడానికి కొందరు ముందుకు వస్తున్నారు. అవకాశం ఉన్న డిపోల్లో వాటిని ఏర్పాటు చేయాలి. ఆర్టీసీలో కూడా భార్యభర్తలు ఒకే చోట పనిచేసేలా బదిలీలు చేయాలి. మహిళా ఉద్యోగులు రాత్రుళ్లు విధులు నిర్వహించే అవసరం లేకుండా షెడ్యూల్ తయారు చేయాలి.

-స్వీపర్ నుంచి డిపో మేనేజర్ వరకు అంతా సమానమే అనుకుని కుటుంబ సభ్యుల్లా పనిచేసుకుపోవాలి. కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వం సానుభూతితో వ్యవహరిస్తుంది. -యూనియన్ నాయకులు దృష్టికి తెచ్చిన అంశాలను అధికారులు తప్పక పరిగణలోకి తీసుకోవాలి. అంతిమంగా ఆర్టీసీని బతికించుకోవాలి. ఆర్టీసీకి ప్రభుత్వపరంగా చేయాల్సినంత చేస్తాం. బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తాం. అందరం కలిసి పనిచేద్దాం. -గుర్తింపు యూనియన్ ఎన్నికలు రెండేండ్లకు ఒకసారి కాకుండా నాలుగైదేండ్లకు ఒకసారి జరిగేలా విధాన నిర్ణయం తీసుకోవాలి. -పల్లె వెలుగు ఓఆర్ పెంచడానికి ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. -వివాహాలు, ఇతర కార్యక్రమాలకు బస్సులను పంపేటప్పుడు అధిక డిపాజిట్లు తీసుకోవద్దు. కఠిన నిబంధనలు తొలగించాలి.

-ఆర్టీసీలో అధికారుల వికేంద్రీకరణ జరుగాలి. హైదరాబాద్ నగరంలో అదనపు బస్టాండ్ల ఏర్పాటుకు కృషి చేయాలి. హైవేల వెంట డిపోల్లో ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు ఉపయోగించాలి. -డిపో మేనేజర్లు సొంత వాహనం కొనుగోలు చేసుకోవడానికి వడ్డీ లేని రుణం ఇచ్చి, నెలవారీ నిర్వహణ ఖర్చులు ఇస్తాం. -బస్‌స్టాండ్ల క్యాంటీన్లలో మాంసాహారం కూడా అందుబాటులో ఉంచాలి. అధికారులు సొంత జిల్లాల్లో పనిచేయవద్దనే నిబంధనను తొలగించాలి. విధులు నిర్వహించే శారీరక ధారుఢ్యం లేని వారికి మినహాయింపులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేస్తాం. -టీఎస్‌ఆర్టీసీ దేశంలోనే నంబర్ వన్ అనే పేరు రావాలి. కార్మికుల పట్ల ప్రభుత్వం అత్యంత మానవత్వంతో ఉంటుంది. కొత్త బస్సులు కొంటాం. ఆర్టీసీ రూపురేఖలు మారుస్తాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.