-అభివృద్ధికి బంగారు తెలంగాణ మాడల్
-ఏడున్నరేండ్లలో కేసీఆర్‌ది సాఫల్యం.. ప్రధానమంత్రి మోదీది ఘోర వైఫల్యం
-కేసీఆర్‌తోనే ‘మేరా భారత్ మహాన్’
-ప్లీనరీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వంటి విజనరీ కావాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ మాడల్ కావాలని, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా అమలు కావాలని అన్నారు. గోల్‌మాల్ గుజరాత్ మాడల్, బుల్డోజర్, డబుల్ ఇంజిన్లు అవసరం లేదని తెలిపారు. ఏడున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ విజయాలు సాధిస్తే, ప్రధానిగా మోదీ వైఫల్యాలు మూటగట్టుకొన్నారని విమర్శించారు.

‘మేరా భారత్ మహాన్’ను నిజం చేయగలిగేది సీఎం కేసీఆరేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో బుధవారం జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీలో.. ‘దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ కీలక భూమిక పోషించాలి’ అన్న తీర్మానాన్ని మంత్రి కేటీఆర్ ప్రతిపాదించారు. దీన్ని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బలపరిచారు. తీర్మానం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం తెలుగువారి చరిత్రను పరిశీలిస్తే ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినా ఇద్దరు మహానుభావులు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమే పార్టీలను దశాబ్దాల పాటు నడపగలిగారని చెప్పారు. ‘రాజకీయాల్లో ఎన్టీఆర్ హిస్టరీ క్రియేట్ చేస్తే.. సీఎం కేసీఆర్ హిస్టరీతోపాటు జాగ్రఫీని క్రియేట్ చేశారు. అన్ని రాష్ర్టాలకు సీఎంలు ఉంటే, తెలంగాణకు మాత్రం రాష్ర్టాన్ని తెచ్చిన సీఎం ఉన్నారు’ అని కొనియాడారు.
సీఎం కేసీఆర్ తన దక్షత, డైనమిజం, పరి పాలనతో రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలిపారని శ్లాఘించారు. తెలంగాణ ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ నేతలమంతా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశామని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. ‘చాలా మంది జీవితంలో చాలా ప్రయత్నాలు చేస్తారు. లక్ష్యాలు నిర్ణయించుకొంటారు. వాటిని చేరడం మాత్రం చాలా కష్టం. కానీ సీఎం కేసీఆర్ ధన్యులు. తెలంగాణ రాష్ట్రం కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని, ప్రజల మద్దతుతో సాధించుకొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయ్యారు’ అని ప్రణబ్ ముఖర్జీ అన్నారని తెలిపారు. ఓసారి అరుణ్ జైట్లీ దగ్గరికి వెళ్తే ‘దేశంలో మంచి ఆందోళనకారులను చూశాం, మంచి పరిపాలకులను చూశాం. కానీ, కేసీఆర్ అరుదైన వ్యక్తి. ఆయన గొప్ప ఆందోళనకారుడే కాదు.. మంచి పాలకుడు కూడా’ అని ఆశీర్వదించారని వెల్లడించారు.
గోల్డెన్ తెలంగాణ అంటే..
బంగారు తెలంగాణ మాడల్‌కు మంత్రి కేటీఆర్ అర్థం వివరించారు. ‘2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు, ఏడున్నరేండ్లలో 130 శాతం పెరిగి రూ.2.78 లక్షలకు చేరింది. దేశ సగటు మాత్రం రూ.1.43 లక్షల వద్దే ఉన్నది. రాష్ట్ర జీఎస్డీపీ అప్పుడు రూ.5 లక్షల కోట్లు ఉంటే.. ఏడున్నరేండ్లలో 128 శాతం పెరిగి రూ.11.5 లక్షల కోట్లకు చేరింది. ఆర్బీఐ ప్రకారం తెలంగాణ భౌగోళికంగా 11వ స్థానంలో, జనాభాపరంగా 12వ స్థానంలో ఉన్నా.. కానీ దేశానికి అన్నం పెడుతున్న నాలుగు రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైసలతో బీజేపీ రాష్ర్టాల్లో పనులు అవుతున్నాయి. దేశ జనాభాలో మనం 2.5 శాతమే, కానీ ఆర్థికంగా 5 శాతం. రాష్ట్రంలో మత పిచ్చి లేదు, కుల పిచ్చి లేదు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఇదే బంగారు తెలంగాణ మాడల్’ అని వివరించారు. సోచో ఇండియా అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణది సాఫల్యం.. మోదీది వైఫల్యం
గోల్‌మాల్ గుజరాత్ మాడల్‌ను 2011-14 వరకు సోషల్ మీడియాలో ఊదరగొట్టి, దేశ ప్రజలను ఆగమాగం చేసి బీజేపీ కేంద్రంలో కూర్చున్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మోదీ ప్రధానిగా, కేసీఆర్ సీఎంగా దాదాపు ఒకేసారి అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. ఏడున్నరేండ్లలో దేశం ఎన్నడూ చూడని సమ్మిళిత అభివృద్ధి, అరుదైన ‘బ్యాలెన్స్‌డ్ గ్రోత్ మాడల్’ను తెలంగాణ ప్రభుత్వం దేశం ముందు ఆవిష్కరిస్తే, కేంద్రానికి అంతులేని వైఫల్యాల చరిత్ర ఉన్నదని పేర్కొన్నారు. హర్ ఘర్ మే జహర్ అంటూ మోదీ ప్రతి మనసులో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. వోకల్ ఫర్ లోకల్ అని గొప్పలు చెప్తాడని, దేశంలో అంతర్భాగమైన తెలంగాణ.. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్‌ను కడితే.. ప్రధానిగా ఎందుకు ప్రశంసించడం లేదు? అని ప్రశ్నించారు.
‘మేరా భారత్ మహాన్’ను నిజం చేసే నేత కావాలి
స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా భారత్ ఇంకా ఎదుగుతున్న దేశంగానే ఉన్నదని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 1987లో చైనా, ఇండియా జీడీపీ 470 బిలియన్ డాలర్లుగా ఉంటే.. ప్రస్తుతం మన జీడీపీ 3 ట్రిలియన్లు, చైనాది 16 ట్రిలియన్లుగా ఉన్నదని తెలిపారు. మన తలసరి 1800 డాలర్ల దగ్గర ఉంటే, చైనా 9 వేల డాలర్లు పెరిగిందని వివరించారు. ‘మేరా భారత్ మహాన్’ అనే నినాదాన్ని నిజం చేసే నాయకుడు కావాలని దేశం కోరుకొంటున్నదని, దాన్ని తెలంగాణ అందిస్తుందని నమ్ముతున్నానని అన్నారు. వసుధైక కుటుంబంగా, అందమైన పూలబొకేలా ఉన్న దేశాన్ని కాపాడాలంటే సీఎం కేసీఆర్ వంటి టార్చ్‌బేరర్ కావాలని అన్నారు.
దేశం బంధ విముక్తి కోరుతున్నది: జగదీశ్‌రెడ్డి
దేశం ఇప్పుడు మంచి నాయకుడి కోసం ఎదురుచూస్తున్నదని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచే సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనను భరించలేక ఎన్డీయేను తీసుకొస్తే.. దేశం పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైందని అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని, ఈ నేపథ్యంలో దేశం తనను బంధవిముక్తి చేసే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నదని, ఆ సత్తా సీఎం కేసీఆర్‌కే ఉన్నదని స్పష్టం చేశారు.
మోదీ.. ఇదిగో నీ మాయమాటల చిట్టా
-మోదీ 2014 ఎన్నికల్లో ఎన్నో మాయమాటలు చెప్పిండని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
-2022 నాటికి పేదలందరికీ ఇండ్లు ఇస్తానన్నారు. కానీ, నోట్ల రద్దు వంటి అపసవ్య ఆలోచనలు, దివాళాకోరు ఆర్థిక విధానాల వల్ల ఉన్న ఇల్లు అమ్ముకొనే స్థితికి తెచ్చిండు.
-నల్లధనం తెస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తానన్నాడు. ఇప్పుడు బిక్కముఖం ఏస్తున్నడు.
-ఏటా రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నడు. గట్టిగా అడిగితే పకోడీలు, బజ్జీలు వేసుకోవడం, ఇడ్లీ బండి పెట్టుకోవడం ఉద్యోగం కాదా? అని దబాయిస్తున్నడు.
-కాంగ్రెస్ వైఫల్యం వల్లే సిలిండర్ ధరలు పెరిగాయన్నడు. ఇప్పుడు రూ.వెయ్యి చేసి కట్టెల పొయ్యే గతి అయ్యేలా చేశాడు.
-పెట్రో ధరల పెరుగుదలకు కాంగ్రెస్సే కారణమన్నడు. అప్పుడు లీటర్ రూ.70 ఉంటే, ఇప్పుడు రూ.120 చేసిండు.
-2022 నాటికి బుల్లెట్ రైళ్లు పరుగులు పెడుతాయని చెప్పిండు. -ఇప్పుడు ఉన్న రైళ్లు, రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరిస్తున్నడు.
-గంగానదిని ప్రక్షాళన చేస్తానని చెప్పిండు. కరోనా సమయంలో గంగానదిలో శవాలు తేలేలా చేశాడు.
థ్యాంక్స్ టు కేసీఆర్
-75 ఏండ్లలో ఎంతో మంది పీఎంలు, సీఎంలు మారారు. కేసీఆర్ -రైతుబంధు తెచ్చేవరకు ఈ పాలకులకు సోయి రాలేదు. మన రైతుబంధును కేంద్రం కాపీ కొట్టింది. దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులకు లాభం కలుగుతున్నదంటే దానికి కారణం కేసీఆర్.. థ్యాంక్స్ టు కేసీఆర్.
-మిషన్‌భగీరథ తెలంగాణ ఆడబిడ్డల కన్నీరు తు డుస్తున్నది. కేంద్రం కాపీ కొట్టి హర్ ఘర్ జల్ అ ని అమలు చేస్తున్నందుకు.. థ్యాంక్స్ టు కేసీఆర్.
-టీఎస్‌ఐపాస్‌తో పారదర్శక అనుమతులిస్తుంటే.. కేంద్రం దాన్ని కాపీ కొట్టి సింగిల్ విండో సిస్టమ్‌ను తీసుకొస్తున్నది. అందుకే పారిశ్రామికవేత్తలు చెప్తున్నారు.. థ్యాంక్స్ టు కేసీఆర్.
-ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల విద్యుత్తు సమస్యను తీర్చిన దక్షత.. -దేశంలోనే ఎక్కడాలేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపినందుకు.. థ్యాంక్స్ టు కేసీఆర్.
-చైనాలో ప్రాజెక్టులు వాయువేగంతో పూర్తవుతాయంటూ గొప్పగా చెప్పుకొనేవారు. కానీ, ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు టైంలో పూర్తి చేసినందుకు.. థ్యాంక్స్ టు కేసీఆర్.
-పాలమూరును పచ్చగా మార్చి వలసలను వాపస్ తెచ్చినందుకు.. ఎండిపోయిన శ్రీరాంసాగర్‌కు రివర్స్ పంపింగ్ ద్వారా జీవకళ తెచ్చినందుకు.. నాలుగు దశాబ్దాల ఫ్లోరోసిస్ సమస్యను నాలుగేండ్లలో తీర్చినందుకు.. థ్యాంక్స్ టు కేసీఆర్.
-జనహితమే మన మతం ధ్యేయంగా తెలంగాణను ముందుకు తీసుకుపోతున్నందుకు.. థ్యాంక్స్ టు కేసీఆర్.
దేశానికి కేసీఆర్ విజనరీ