Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ధరణి.. మరింత సులభంగా

-వారంలోగా పెండింగ్‌ మ్యుటేషన్లను పూర్తిచేయాలి
-ఎన్నారైలకు పాస్‌పోర్ట్‌ నంబర్‌ ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్‌
-కంపెనీలు, సొసైటీల భూములకు పాస్‌ పుస్తకాలు ఇవ్వాలి
-మెగా సమీక్షలో సీఎం కేసీఆర్‌ ఆదేశం

అవినీతి రహిత, పారదర్శక, వేగవంతమైన భూ లావాదేవీలే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ వందకు వందశాతం విజయవంతమైందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పోర్టల్‌ను మరింత సులభతరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించా రు. ఎన్నారైలు, కంపెనీలు, సొసైటీల భూములు, పెండింగ్‌ మ్యుటేషన్లను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నా రు. ప్రగతిభవన్‌లో సోమవారం సీఎం కేసీఆర్‌ మంత్రులు, వివిధశాఖల ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో మెగా సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సమస్యలు, ధరణి పోర్టల్‌పై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడకముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేదని పేర్కొన్నారు. దీంతో వివాదాలు, ఘర్షణలు తలెత్తేవని చెప్పారు. ఈ అనర్థాలను క్రమంగా రూపుమాపుతున్నామని అన్నారు. ప్రతి గుంట భూమికి యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందని వెల్లడించారు. భూరికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా స్పష్టత వస్తున్నదని చెప్పారు.

పోర్టల్‌ వంద శాతం విజయవంతం
భూ రికార్డుల నిర్వహణ, క్రయవిక్రయాలు వంటి ప్రక్రియలన్నీ సులభంగా, వేగంగా, అవినీతిరహితంగా, పారదర్శకంగా జరిపేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వంద శాతం విజయవంతమైందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలిగించాలని సూచించారు. వారం రోజుల్లో పోర్టల్‌లో అవసరమైన మార్పులను చేయాలని అధికారులను ఆదేశించారు. ‘ధరణిని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి. పాస్‌పోర్ట్‌ నంబర్‌ ఆధారంగా ఎన్నారైలకు రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం ఇవ్వాలి. కంపెనీలు, సొసైటీలు కొనుగోలుచేసిన భూములకు కూడా పాస్‌పుస్తకాలు పొందేలా వెసులుబాటు కల్పించాలి. గతంలో ఆధార్‌ నంబర్‌ ఇవ్వనివారి వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయలేదు.

వారికి మరో అవకాశం ఇచ్చి పాస్‌బుక్‌లు మంజూరు చేయాలి. పెండింగ్‌ మ్యుటేషన్లను వారం రోజుల్లోగా పూర్తిచేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ల్యాండ్‌ ట్రాన్స్‌ఫర్‌ రెగ్యులేషన్స్‌ వివాదాలన్నింటినీ జిల్లా కలెక్టర్లు నెల రోజుల్లో పరిష్కరించాలి. స్లాట్‌ బుకింగ్‌ తర్వాత క్యాన్సిల్‌, రీషెడ్యూల్‌కు ధరణిలోనే అవకాశం కల్పించాలి. నిషేధిత భూముల జాబితాను ఎప్పటికప్పుడు మార్పులతో సవరించాలి. కోర్టు తీర్పులకు అనుగుణంగా తగిన మార్పులు చేయాలి. ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన భూమిని వెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలి. జీపీఏ, ఎస్పీఏ, ఏజీపీఏ చేసుకోవడానికి ధరణిలో అవకాశం కల్పించాలి’ అని సీఎం కేసీఆర్‌ సూచించారు. కోర్టు కేసులు మినహా పార్ట్‌- బీలోని అంశాలను, సాదాబైనామా దరఖాస్తులను కలెక్టర్లు పరిశీలించి, పరిష్కరించాలని అన్నారు. రెవెన్యూ కోర్టుల్లోని కేసులను కలెక్టర్‌ నేతృత్వంలో ఏర్పడే జిల్లాస్థాయి ట్రిబ్యునల్‌ త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. రెవెన్యూపరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే స్వయంగా పూనుకొని సత్వరం పరిష్కరించాలని సూచించారు. కిందిస్థాయి అధికారులకు అప్పగించి, చేతులు దులుపుకొంటే ఆశించిన ఫలితం రాదని చెప్పారు.

‘ధరణిని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి. పాస్‌పోర్ట్‌ నంబర్‌ ఆధారంగా ఎన్నారైలకు రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం ఇవ్వాలి.

మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా
ధరణిని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి. పాస్‌పోర్ట్‌ నంబర్‌ ఆధారంగా ఎన్నారైల రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇవ్వాలి. కంపెనీలు, సొసైటీలు కొన్న భూములకూ పాస్‌బుక్‌ పొందేలా వెసులుబాటు కల్పించాలి. గతంలో ఆధార్‌ నంబర్‌ ఇవ్వనివారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదు. వారికి మరో అవకాశం ఇచ్చి పాస్‌బుక్‌లు మంజూరు చేయాలి. పెండింగ్‌ మ్యుటేషన్లను వారంలోగా పూర్తిచేయాలి.
-ముఖ్యమంత్రి కేసీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.