Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దారులన్నీ ఓరుగల్లువైపే

-ప్రగతి నివేదన సభకు తరలుతున్న ప్రజలు -ఇంటిపార్టీ పిలుపుతో కదులుతున్న తెలంగాణ -జిల్లాల నుంచి క్యూ కట్టిన కచ్చురం ట్రాక్టర్లు -అన్ని జిల్లాల్లో ప్రారంభమైన సైకిల్ యాత్రలు -అంచనాలకు మించి తరలిరానున్న జనం -మూడేండ్ల పాలనపై నివేదన.. -రాబోయే రెండేండ్ల పాలనపై ప్రణాళిక -హైదరాబాద్ నుంచి నాలుగువేల బస్సుల్లో.. -15లక్షల మందికి తాగునీరు, మజ్జిగ ఏర్పాట్లు -వెయ్యికిపైగా ఎకరాల్లో పార్కింగ్

దారులన్నీ అటే.. ఊరూరూ ఓరుగల్లుకే.. ప్రగతి నివేదన సభాప్రాంగణానికి చేరుకోవడానికి మండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వందలు… వేలు… లక్షలుగా జనం తరలివెళ్తున్నారు. వరంగల్ నగరంలోని ప్రకాశ్‌రెడ్డిపేటలో టీఆర్‌ఎస్ 16వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదిన సభకు యావత్తు తెలంగాణ సిద్ధమైంది.చేసింది చెప్పుకోవడం… చేయాల్సింది నివేదించడమే ముఖ్యోద్దేశంగా గులాబీ పార్టీ ఈ సభను నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 15లక్షల మంది ఈ సభకు వస్తారని ముందుగా అంచనా వేసినా.. అంతకుమించి ప్రజలు తరలివస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ నుంచే రెండులక్షల మందికి పైగా హాజరువుతారని నేతలు చెబుతున్నారు. నాలుగువేల బస్సుల్లో నగరవాసులు సభకు తరలివెళ్లనున్నారు. అన్ని వర్గాల్లో ప్రభుత్వపాలనపై కనిపిస్తున్న సంతృప్తే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రతిపక్షాలు సభలు పెడితే భారీ ఎత్తున ప్రజలను తరలిస్తారు.అయితే ప్రభుత్వంలో ఉన్న పార్టీ నిర్వహించే సభకు జనం నుంచి అంచనాలకు మించి స్పందన లభిస్తుండడం గమనార్హం. ఉద్యమకాలంలో సింహగర్జన సభతో చరిత్ర సృష్టించిన టీఆర్‌ఎస్ అదే ప్రాంగణంలోనే నిర్వహిస్తున్న ఈ సభకూ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

ప్రారంభమైన సైకిల్, బైక్ ర్యాలీలు టీఆర్‌ఎస్ సభలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలనుంచి సైకిల్, బైక్ ర్యాలీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణభవన్ నుంచి ర్యాలీ మంగళవారం ఉదయమే ప్రారంభం కావడం గమనార్హం. ఇక బైక్ ర్యాలీలు బుధవారం ఉదయం అన్ని జిల్లాల్లో ముఖ్య నాయకులు జెండాలు ఊపి ప్రారంభించారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి 200 ట్రాక్టర్లు మంగళవారం సాయంత్రమే మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. అదిలాబాద్ జిల్లా నుంచి మంగళవారం రాత్రికే ట్రాక్టర్లు, డీసీఎంలు బయలుదేరాయి. పలుజిల్లాల నుంచి ఎడ్లబండ్లు బారులుగా బహిరంగసభకు తరలాయి. టీఆర్‌ఎస్ సభ వల్ల తెలంగాణవ్యాప్తంగా మరోసారి ఉద్యమకాలంనాటి ఉద్వేగ వాతావరణం ఆవిష్కృతమవుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా టీఆర్‌ఎస్ ఎప్పుడు బహిరంగ సభ నిర్వహించినా లక్షలాది జనం వారం, పదిరోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకునేవారు. అప్పుడు తెలంగాణ సాధించడం లక్ష్యంకాగా, ఇప్పుడు సాధించిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవడం కోసం యావత్తు రాష్ట్రం సన్నద్ధమైంది.

ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సంతృప్తి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ పడ్డ కష్టాలను, మూడేళ్ల తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మాయం చేసింది. కంటినిండా కరెంటు… చెరువుల కింద సాగు, ఇంటింటికీ తాగునీరు, గురుకులాల ఏర్పాటు, ప్రాజెక్టులు, పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతులకు 17వేల కోట్ల రుణమాఫీ, తాజాగా ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు ఎరువుల పంపిణీ పథకం వంటి ఎన్నో వినూత్న పథకాలను ప్రభుత్వం చేపట్టింది. గడిచిన మూడేళ్లలో 150 కొత్త సంక్షేమ కార్యక్రమాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుంది. అన్ని వర్గాల సమస్యలను ప్రభుత్వం తన బాధ్యతగా భుజస్కంధాలపై వేసుకుంది. కష్టమొచ్చిన ప్రతిచోటా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నిలబడిన తీరు ప్రజలను ఆకర్షించింది. ప్రభుత్వం అంటే తమకు అందనంత దూరంలో ఉండేదన్నట్లుగా భావించిన ప్రజలు.. ప్రభుత్వం అంటే మేమే అనుకునే పరిస్థితి రావడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలే నిదర్శనంగా నిలిచాయి. ఉద్యమం సమయంలో ఇంటిపార్టీగా మారిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా అలాగే ఉండడంపై సబ్బండ వర్ణాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

ప్రగతి నివేదన సభకు భారీ ఏర్పాట్లు

వరంగల్ జిల్లా ప్రకాశ్‌రెడ్డిపేటలో ఉన్న 1250ఎకరాల్లో నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభాప్రాంగణాన్ని 275 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుండగా, మరో వెయ్యి ఎకరాలకు పైగా పార్కింగ్‌కే కేటాయిస్తున్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు 20లక్షల వాటర్ ప్యాకెట్లు, 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 20 బోర్లు, వాటికి అనుబంధంగా నల్లాలు, 200 వాటర్ ట్యాంకర్లు, ఆరు హెల్త్ క్యాంపులు, ప్రత్యేక ఐసీయూ, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. సభ నిర్వహణ కోసం మొత్తం 13 కమిటీలు వేసుకున్నారు. ఈ కమిటీలు ఇప్పటికే తమకు కేటాయించిన పనులన్నీ పూర్తిచేశాయి.

అసాధారణ ఏర్పాట్లు.. అత్యాధునిక హంగులు టీఆర్‌ఎస్ 16వ వార్షికోత్సవ సభకు వరంగల్ సర్వం సిద్ధమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు, రైతులు, సబ్బండ వర్ణాలు వరంగల్‌కు రావడానికి సన్నద్ధమవుతున్నారు. తండోపతండాలుగా తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా టీఆర్‌ఎస్ శ్రేణులు సకల ఏర్పాట్లు చేస్తున్నాయి. వరంగల్‌లోని ప్రకాశ్‌రెడ్డిపేట(జయశంకర్ ప్రాంగణం)లో జరిగే సభకు కనీవిని ఎరుగనిరీతిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరంగల్ మహానగరం గులాబీమయమైంది. ఓరుగల్లు అంతా పెండ్లింటిని తలపించేలా ముస్తాబైంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఖమ్మం నుంచి ట్రాక్టర్లపై తరలివచ్చేవారికి వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసున్నాయి. వివిధ జిల్లాల పార్కింగ్ ప్రదేశాలను ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి చూసుకుని వెళ్లారు. మంత్రి హరీశ్‌రావు నాలుగైదు రోజులుగా ఇక్కడే మకాం వేసి సభాఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర టీఆర్‌ఎస్‌కు ఉన్నది. గత రికార్డులన్నీ బద్ధలయ్యేలా ప్రస్తుత బహిరంగసభను చారిత్రాత్మకంగా నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు. 500 మంది ప్రతినిధులు కూర్చునేలా వేదికను 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 1,643 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 పార్కింగ్ జోన్లను ఏర్పాటుచేసి మైక్ అనౌన్స్‌మెంట్‌తో సహా లైటింగ్‌ను ఏర్పాటు చేశారు. 275 ఎకరాల సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలో అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు సభా నిర్వహణ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ బుధవారం పరిశీలించారు. ప్రజలకు అటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పార్కింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ సుధీర్‌బాబును ఆదేశించారు. రాష్ట్ర రైతాంగం భారీఎత్తున సభకు తరలివచ్చేందుకు చాలా ప్రాంతాల నుంచి ఇప్పటికే బయలుదేరారని, మిగిలిన ప్రాంతాల నుంచి కూడా బయలుదేరుతుందని సమాచారం ఉన్నదని మంత్రులు చెప్పారు. సీఎం కేసీఆర్‌ను నిండు మనుస్సుతో దీవించడానికి రైతులు, కార్మికులు, అన్నివర్గాల ప్రజలు అంచనాలకు మించి 20 లక్షలకుపైగా జనం వచ్చే అవకాశం ఉందన్నారు.

భారీ బందోబస్తు అన్ని జిల్లాల నుంచి పోలీస్ అధికారులు బుధవారం ఉదయాన్నే సభాస్థలికి చేరుకున్నారు. పోలీస్ అధికారులతో కలిసి మంత్రి హరీశ్‌రావు సభాప్రాంగణంలో కలియతిరిగారు. భద్రతా ఏర్పాట్లపై నగర పోలీస్‌కమిషనర్ సుధీర్‌బాబును అడిగి తెలుసుకున్నారు. సభాస్థలికి చేరుకున్న పోలీసు సిబ్బంది మొత్తం రెండురోజులపాటు చేయాల్సిన విధులపై సమావేశమయ్యారు. సెక్టార్లవారీగా సిబ్బందిని విభజించి అధికారులు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆరు వేల మంది పోలీసులు సభ కోసం భారీ బందోబస్తు లో పాల్గొంటున్నారు.

ప్రగతి నివేదన సభకు 4వేల ఆర్టీసీ బస్సులు ప్రగతి నివేదన బహిరంగ సభకు టీఎస్‌ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి నాలుగు వేలకుపైగా బస్సులను నడిపిస్తున్నది. నిర్వాహకులు ఇప్పటికే అద్దె చెల్లించి బస్సులను బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్, కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులు ప్రగతి నివేదన సభకు వెళ్లనున్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.