Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

అభివృద్ధి ఆగిపోవద్దనే ముందస్తుకు..

-ఈ తరుణంలో ప్రజల తీర్పు కీలకంగా ఉండాలి
-టీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపిస్తే కోటి ఎకరాల తెలంగాణ
-ఈ దఫా రూ.24వేల కోట్ల రైతు రుణాలు మాఫీ
-తెలంగాణలో కరంటు లేదంటవా మోదీ..
-కంటివెలుగులో పరీక్ష చేయించుకో.. అద్దాలిస్త
-మనకన్నా 14 రాష్ర్టాలకు ఎక్కువ అప్పులున్నయి
-మోదీ ఆయుష్మాన్ భారత్.. దిక్కుమాలిన పథకం
-ఈ ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్‌కోసం బయల్దేరుత
-ఫెడరల్ ఫ్రంట్ అంటున్నందుకే కాంగ్రెస్, బీజేపీకి వణుకు
-ఎన్నికల ప్రచారసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్

చంద్రబాబు తెలంగాణ దుష్మన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డంపడుతున్న చంద్రబాబుతో దుర్మార్గంగా పొత్తుపెట్టుకున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ దద్దమ్మ అని విమర్శించారు. మనం తాగునీళ్లు తీసుకున్నా కేసు.. వ్యవసాయానికి నీళ్లు తీసుకున్నా కేసే.. మనకు వచ్చే కరంటు ఎగబెడుతడు. మన ఏడు మండలాలను గుంజుకుపోయిండు. సీలేరు పవర్‌ప్లాంట్‌ను గుంజుకుపోయిండు. చంద్రబాబు మనకు దుష్మన్ అన్నారు. మన ప్రయోజనాలను అడ్డుకునే ఆంధ్రబాబు అవసరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబును చేయితో కొట్టొద్దని, ఓటుతో కొట్టి ఇదిరా.. తెలంగాణ అని రుజువుచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

బక్కపలచని కేసీఆర్‌ను కొట్టడానికి గింతమందా? నరేంద్రమోదీ, అమిత్‌షా.. వాడెవ్వడో మన్నుషా, మట్టిషా,సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ఆంధ్రనుంచి చంద్రబాబు, సీపీఐ, సీపీఎం.. వాళ్ల దుంపతెగ! రాకాసులు బయలుదేరినట్టే బయలుదేరిండ్రు! అని ఎద్దేవాచేశారు. ఇంతకాలం దేశంమీద కాంగ్రెస్, బీజేపీ ఫ్యూడల్ పెత్తనం చేశాయన్న సీఎం.. తాను ఫెడరల్ ఫ్రంట్ రావాలని, కాంగ్రెస్, బీజేపీ లేని కేంద్ర ప్రభుత్వం రావాలని చెప్తుండటంతో వారు గజ్జున వణికి చస్తున్నారని చురకలు చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్సువాడ, జుక్కల్, నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, ఆందోల్, నర్సాపూర్ ఆశీర్వాద సభల్లో సీఎం ప్రసంగించారు.

తెలంగాణలో తమ పాలనాకాలంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే విపక్షాలపై ధ్వజమెత్తారు. జరుగుతున్న అభివృద్ధి ఆగిపోవద్దని మళ్లీ మీ తీర్పుకోరాలని ముందస్తు ఎన్నికలకు వచ్చామని, అనేక ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సర్దుకుంటున్న తరుణంలో ప్రజలు ఇచ్చే తీర్పు కీలకంగా ఉండాలని అన్నారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమేనని నమ్మే ప్రమాదం ఉందన్న సీఎం.. ఎవరి పాలనలో ఏమి అభివృద్ధి జరిగిందో ఆలోచించి.. టీఆర్‌ఎస్‌కు మరోసారి అధికారం ఇస్తే కోటి ఎకరాలను పచ్చగా చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన సాగునీటి ప్రాజెక్టులు వేగంగా నిర్మిస్తున్నామని, ఏడాదిన్నరలోపు పూర్తవుతాయని చెప్పారు. అప్పుడు కోటిఎకరాల్లో పంటలు అద్భుతంగా పండుతాయన్నారు.

అన్ని రకాల కులవృత్తులను సమైక్యపాలనలో నాశనం పట్టిస్తే.. తాము అధికారంలోకి వచ్చి న తర్వాత వారిని ఆదుకున్నామని కేసీఆర్ వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 43వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో రైతులకు లక్ష చొప్పున రుణమాఫీ చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఈ మొత్తం 24వేల కోట్లు ఉంటుందని తెలిపారు. అప్పులు కట్టి, ప్రతి రైతు దగ్గర ఐదు పది లక్షలు బ్యాం కుల సిలక్ ఉండాలె.. అదీ బం గారు తెలంగాణ అని చెప్పారు. మొత్తం ప్రపంచానికే తెలంగాణ ఒక మార్గదర్శనం కావాలని అభిలషించారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..

మోదీ కంటివెలుగులో చూపించుకో.. రెండు అద్దాలిస్తా
మోదీ పచ్చి అబద్ధాలు చెప్పిండు. నిజామాబాద్‌ల కరంట్ లేదన్నడు. ఝూటా మాట్లాడిండు. మోదీకి ఏమైనా బీమారీ వచ్చెనా? గట్లెందుకు చెప్పే! పెద్ద పదవిలో ఉన్నోళ్లు.. జాగ్రత్తగా మాట్లాడాలి. నేను గర్వంగా చెప్తున్న.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ అని భారత విద్యుత్ఛక్తి ప్రాధికార సంస్థ చెప్పింది. మోదీకి కనపడుతలేదట. కంటివెలుగులో చూపించుకో.. రెండద్దాలు ఇస్త. లోకంలో ఎవ్వర్ని అడిగిన చెప్తరు తెలంగాణలోని కరంటు గురించి. ఆయన ఇంతింత పొడు గు మాటలు మాట్లాడిండు. బాధ కలిగింది. మోదీ.. దమ్ముంటే అక్కడే ఉండు.. నేను హెలికాప్టర్ వేసుకొని వస్త.. అక్కడనే సభపెట్టి మాట్లాడుదం అని చాలెంజ్ చేసిన. లేడు.. ఎల్లిపోయిండు. ఇయ్యాల 19 రా ష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క రాష్ట్రంలోనైనా వేయి రూపాయ ల పింఛన్ ఇస్తున్నదా? రైతుబంధు అమలుచేస్తున్నరా? కల్యాణలక్ష్మి, రైతుబీమా ఉన్నయా? ఈడికివచ్చి అడ్డంపొడుగు మాట్లాడితే మేము ఏమైనా గొర్రెలమా? పిచ్చోల్లం ఉన్నమా? అగ్గవకు దొరికినమా?

గూండాలు లేరు.. పేకాట క్లబ్బులు లేవు..
పొరపాటుగా కాంగ్రెస్ గెలిస్తే కరంట్ ఆగమైద్ది. ఇయ్యాల టీఆర్‌ఎస్ 24 గంటల కరంట్ ఇస్తంది. చరిత్రలో కనీవినీ ఎరుగని సంక్షేమం మీ కండ్ల ముందున్నది. కుంభకోణాలు లేవు. భూకబ్జాలు లేవు. గూండాలు లేరు. పేకాట క్లబ్బులు లేవు. శాంతిభద్రతలు మంచిగున్నయి. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నయి. వీటన్నింటినీ గమనించాలి. ప్రజాస్వామ్యంలో వ్యక్తులు, పార్టీలు గెలుచుడు కాదు.. నిజంగా పరిణతి ఉన్న ప్రజాస్వామ్యం అయితే ప్రజలు గెలువాలి. గాలిగాలి.. గత్తరబిత్తర ఓట్లేస్తే ఐదేండ్లు గదే గాలిగాలి ఉంటది.

రోహిణిలోనే నార్లు పోయాలె
నేనూ రైతునే.. నాకూ వ్యవసాయం ఉంది. ఏం లాభం వట్టిగనే ఉన్నది. నీళ్లు లేవు. నీళ్లు ఎట్ల వస్తయి! కాళేశ్వరం పూర్తయితే వస్త యి. కా ళేశ్వరం అయిపోయాక, వానాకాలం పంటకు మేలోనే, రోహిణికార్తెలో నార్లుపోయాలి. అలా పండాలి పంటలు. అప్పుడే బంగారు తెలంగాణ.

దొంగలెక్కలు రాసి దొబ్బితిన్నరు..
డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏమాయే కేసీఆర్ అంటరు! మీ లెక్క మేం లంగతనం చేయం.. దొబ్బితినం. ఇండ్లు కడుతం అని బిల్లు పెట్టుకోం. మీరు పెట్టుకున్నరు.

ఆ చరిత్ర మీకున్నది. ఎన్టీరామారావు నుంచి మొదలు పెడితే ఎన్నికట్టినం అని చెప్పారు? ఒకవేళ మొత్తం కట్టే ఉంటే, ఇప్పుడు ఇండ్లు ఎందుకు కట్టాల్సిన అవసరం పడుతది? గరీబోడు ఎట్ల ఉంటడు? అంటే.. కట్టలేదు. మింగారు. మంథని నియోజకవర్గంలో వందకుటుంబాలకు 140 ఇండ్లు కట్టినట్లు రికార్డు రాశారు. బిల్లు పెట్టుకున్నరు. మళ్లీ మంథని పోతే ఇండ్ల కోసం దరఖాస్తులు ఇస్తున్నరు. అంటే ఇండ్లు కట్టలేదు. మీరు చేసిన కుంభకోణాలు మేం చేయడం లేదు. రెండు తరాల బాధ పోయేలా ఇండ్లు ఇస్తున్నం. కొద్దిగా ఆలస్యం అయితది కానీ మంచి ఇండ్లు కడుతం.

వాళ్లు అవినీతిపరులు కాబట్టి.. కుంభకోణాలు చేసి, అన్నింట్లో దొబ్బి తిన్నరు కాబట్టి.. మేం కూడా అట్నే ఉన్నరనుకుంటున్నరు దరిద్రులు! మేం కడుపు కట్టుకుని పనిచేస్తా ఉన్నం. ఇయాల హైదరాబాద్ సెక్రటేరియట్‌లో పైరవీకారుల మందల్లేవు. కాంట్రాక్టర్ల పెత్తనం లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇయ్యలె.. నీకు తీట ఉంటే చెయ్.. లేకుంటే పో.. అని చెప్పినం. మీ కండ్ల ముందర జరుగుతా ఉంది మిషన్ భగీరథ. పది ఏండ్లు గుత్తేదారికి, జిమ్మేదారికి కట్టినం మెయింటెన్స్‌కు! బిడ్డా.. ఎక్కడ ఏం జరిగినా బాధ్యత నీదే అని చెప్పినం. ఇష్టమున్నోడే పనిచేయండి.. లేనోళ్లు వెళ్లిపొమ్మని చెప్పినం. కొన్ని కంపెనీలు రాలే. అయినా మేం కేర్ చేయలె. ఎందుకంటే నిజాయితీగా, నిఖార్సుగా పని జరుగాలె. ఆదాయం పెం చినం.. అన్ని పథకాలకు ఇస్తున్నం. ఈ దద్దమ్మగాండ్లు కేసీఆర్ అప్పులు చేసిండని మాట్లాడుతరు! మనకన్నా 14 రాష్ర్టాలకు ఎక్కువ అప్పులున్నయి ఇండియాల. మనం పర్మిషన్‌లోనే ఉన్నం. వీళ్లకు చేసిన మొఖం ఉంటేనా.. తెలివుంటేనా!

రూ.63 కోట్ల మిగులతో పాలు కారినట్టుండే తెలంగాణ
నేను చెప్పేది చరిత్ర.. నేను బాధతోని చెప్తున్నా.. సంతోషంతోని కాదు. బ్రహ్మాండంగా పాలు కారినట్టుండే తెలంగాణ. రూ.63 కోట్ల మిగులు బడ్జెట్‌తోని ఉండే. 1956లో ఇది బడ్జెట్ లెక్క. అటువంటి బంగారు పిచ్చుకను తీసుకెళ్లి ఆంధ్రలో కలిపిండ్రు ఇదే కాంగ్రెస్ జవహర్‌లాల్ నెహ్రూ. తర్వాత దరిద్రం. ఏ ప్రాజెక్టు కట్టినా ఆంధ్రకు అనుకూలం. ఉద్యమం వచ్చింది చెన్నారెడ్డి నాయకత్వంలో. మా తెలంగాణ మాకు కావాల్నంటే 1969లో అదే కాంగ్రెస్ ప్రభుత్వం 400 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చింది. నేను మొదలుపెట్టినపుడు 14 ఏండ్లు ఆలస్యం చేసినారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు ఎందుకు ఓడించిండ్లండీ? టీఆర్‌ఎస్‌ను ఎందుకు గెలిపించిండ్లు? ప్రజలు తమకు ఏం కావాల్నో నిర్ణయం తీసుకున్నరు. వాస్తవం కాదా.. చరిత్రకాదా?

సుప్రీంకోర్టు తప్పుడు నిర్ణయం..
సుప్రీంకోర్టు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లు 50% మించరాదని తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కాంగ్రెస్, బీజేపీలు మైనార్టీలకు హక్కు కల్పించడంలో విఫలమయ్యా యి. ఎవరి హక్కు వారికి ఇవ్వకపోతే సమాజంలో అలజడి రేగుతుంది. ఆందోళనలతో దేశం మండిపోతుంది. ఈ విషయాన్ని గుర్తించాలి. ఎవరి హక్కు వారికి ఇవ్వాలి. అదేదిశలో టీఆర్‌ఎస్ కృషి చేస్తున్నది.

మానవ సముద్రాల్లా సభలు
నేను వెళ్లిన ప్రతి సభ మానవసముద్రాన్ని తలపిస్తున్నది. మోదీ నిజా మాబాద్ సభకు 25 వేలమంది వచ్చిండ్రు.. మహబూబ్‌నగర్ కాడ 15 వేలమందిగూడ రాలే.. దానికే ఆయన ఎగిరెగిరి అబద్ధాలు మాట్లాడిండు. అమిత్‌షానో ఏంషానో కానీ.. పెద్ద ఆలిండియా ప్రెసిడెంట్‌నని ఇక్కడకొచ్చిండు. ఈ మీటింగ్‌ల గా హెలికాప్టర్ దగ్గర నిలబడ్డంతమంది కూడా రాలే.

ఆయుష్మాన్ భారత్ ఒక బోగస్..
నరేంద్రమోదీ పెట్టిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ పెద్ద బోగస్ ముచ్చట. ఆయినిచ్చే ఆ మహత్తర ఆరోగ్య పథకానికి మెంబర్ కావాలంటే ఎక్కడేమీ ఉండొద్దట! నీకో బైక్ ఉన్నా ఇయ్యరు! అట్ల 50 కండీషన్లున్నయి. అంటే 20% మందికి కూడా రాదు. మోదీ పెట్టినదానికన్న చానా మంచి స్కీమ్‌లు మనం సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ అమలుచేసుకుంటున్నం. ప్రజలను కాపాడుకోవడానికి ఎన్ని లక్షలైనా ఖర్చుపెడుతున్నం. ఇది చాలా అద్భుత స్కీమ్. మోదీ నిన్న వచ్చి.. ఆయుష్మాన్ స్కీమ్‌లో తెలంగాణ చేరలేదంటడు. ఉన్న సదుపాయం పోవాల్నా మోదీగారూ? ఆయుష్మాన్‌భారత్ దిక్కుమాలిన స్కీమ్. మీది మంచిగున్నదా? మాది మంచిగున్నదా? మాది మంచిగా ఉండగా మీదాంట్లో మేమెందుకు చేరుతం! రైతుబీమా గురించి మోదీకి మంచిగా చాయ్ పోసి చెప్పిన. ఏమేం చేస్తే బాగుంటది అని అడిగిండు. రైతులకు ఇది చేయి అన్న. ధైర్యం లేదు ఆయనకు. పంటల బీమా కూడా చక్కగా లేదాయే! ఫసల్ బీమా అని పెట్టిండు.. దానికి తొంభైయ్యారు కానూండ్లు పెట్టిండ్రు.

ఉత్తమ్.. ఓ దద్దమ్మ
ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడైతే పనికిమాలిన దద్దమ్మ. ఏం తెలివి లేదు. ఎత్తు, పొడుగున్నరు కానీ బుర్ర లేదు. నేను జిమ్మేదారితో చెప్తా ఉన్నా. ప్రాజెక్టుల గురించి అసెంబ్లీల పెద్ద స్క్రీన్‌పెట్టి ఐదారు గంటలసేపు సమ్జాయిస్తా.. అర్థంచేసుకుని, మార్పులుంటే చెప్పండి.. అని కోరిన. కానీ కాంగ్రెస్ పారిపోయింది. ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ దద్దమ్మ.. తెలివితక్కువోడని ఎందుకన్నా? నిండు అసెంబ్లీలో నీళ్ల మీద చర్చ జరుగుతున్నది.. మంత్రి హరీశ్ చెప్తున్నడు.. నేను కూడా ఉన్న. మాట్లాడదమంటే ప్రిపేరయ్యి రాలె అంటడు! మరెందుకు వచ్చినవ్? పీకెతందుకు వచ్చినవా? అని అడిగిన. చర్చ ఉండే.. విషయమేందో ఉండే.. ఎజెండా పేపర్లు ముందే సర్క్యులేట్ అయిపాయే! అంటే.. తెలివిలేదు.. అదీ అసలుసంగతి! కడుపులో తెలంగాణ లేదు. నేను వ్యక్తులగురించి మాట్లాడ.. కానీ తప్పుతలేదు.

ఇంతకాలం దేశంమీద కాంగ్రెస్, బీజేపీ పెత్తనంచేసినయి. నేను ఫెడరల్ ఫ్రంట్ రావాలంటున్న. కాంగ్రెస్, బీజేపీలేని కేంద్ర ప్రభు త్వం రావాలి. అందుకే గజ్జున వణికిచస్తున్నరు. ఆమధ్య తమిళనాడు, బెంగాల్‌పోయి మాట్లాడినం. ఆ భయం వీరిద్దరికీ! కేసీఆర్ వస్తున్నడంటే వణుకుతున్నరు. నాకన్ని భాషలు వస్తయి. అం దుకే.. వీడు గట్టోడు.. తెలంగాణల్నే ఆగబట్టాలె.. బయటకు రానీయవద్దని ప్రయత్నం చేస్తున్నరు. ధర్మం ఆగదు. తెలంగాణ కోసం పోరాడినప్పుడు ఎవరికీ నమ్మకం లేదు. ఇయ్యాల మీ దయతో మనమే గెలుస్తున్నం. ఇట్లనే రాష్ట్రంలో గెలిచిన తర్వాత దేశానికి పోవాలే. దేశం మొత్తం తిరుగుత.. చంద్రబాబు తిరిగినట్టు తిరుగను. నేను ఏమైనాచేసిన అంటే గట్టిగచేస్త. ప్రాంతీయపార్టీల నాయకులు తయారుగున్నరు. దేశంలో చాలామంది ఎంపీలతో మాట్లాడిన.. కలిసిరావడానికి సిద్ధంగా ఉన్నరు. అందరం కలువాలి. ఢిల్లీ మీద కాంగ్రెస్, బీజేపీ వాసనలేని జెండా పాతాలె.

నీళ్ల్లు తేవడానికి ఏడాదిపాటు మెదడు కరుగబెట్టిన..
తెలంగాణ తెచ్చుకున్నం. తెచ్చుకున్న రాష్ర్టాన్ని బాగుచేసుకోవాలె. అన్నింటికంటే ఎక్కువ మనం మోసపోయిందీ.. గోసపడ్డదీ సాగునీళ్ల విషయంలో. ఆ నీళ్లు ఎట్లా తెచ్చుకోవాలె? సమైక్యపాలనలో ఆంధ్ర సీఎంలు కాయితాల, ఫైళ్ల మీద ప్రాజెక్టులు చూపెట్టినారు. కానీ పనులు కాలె! మనకు ఎన్ని నీైళ్లెతే అలాట్‌మెంట్ ఉన్నదో.. అవన్నీ వాడుకోవాలని దాదాపు ఒక యాడాది నా మెదడు కరుగబెట్టిన. మన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు, మేధావులను నాలుగు హెలికాప్టర్లు పెట్టి తిప్పిన. కృష్ణా, గోదావరి బేసిన్లలో పదిహేనురోజులు తిరిగినారు. హైదరాబాద్‌లో నక్షలో చూడటం కాదు.. ఫీల్డ్‌మీద కూడా తిరిగి, ప్రాజెక్టులకు రూపకల్పన చేసినం. మీ కండ్లముందుకు తెచ్చినం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.