Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

దీక్షాదక్షుడు కేసీఆర్

కేసీఆర్ దీక్ష దేశాన్నే కుదిపివేసింది. ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల మాయాజాలం కేసీఆర్ ముందు పారలేదు. గత్యంతరం లేక ఢిల్లీ పీఠం దిగివచ్చి డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన చేసింది. సరే ఆ తర్వాత సీమాంధ్రుల కుట్రలు, కాంగ్రెస్ రాక్షసనీతి కలిసి తెలంగాణ ప్రకటన నుంచి కేంద్రం వెనక్కి తగ్గిన సమయంలో కేసీఆర్ మరో నాలుగేండ్లు వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించారు.

అవమానాల గాయాలు నొప్పి పెడుతు న్నా, ప్రతికూల పరిస్థితులు భయపెడుతున్నా మడమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షను భుజానికెత్తుకున్న ఉద్యమకారుడి నుంచి కొత్త రాష్ర్టానికి ప్రభుత్వ సారథిగా మూడున్నరేండ్ల పాలన వరకూ కేసీఆర్‌లో అనితరసాధ్యమైన పోరాటపటిమ కనిపిస్తుంది. ఉమ్మడి పాల కుల దాష్టీకానికి బలైన తెలంగాణ సమాజాన్ని కాపాడాలంటే తెగబడి పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడమే మార్గమని కేసీఆర్ ఉద్యమబాట పట్టినప్పుడు ఆయనను హేళన చేసిన వారే ఎక్కువ.అయినా మొండిగా ముందుకుసాగి ఉద్యమాన్ని నిలబెట్టారు. ఫ్రీ జోన్ అంశాన్ని ఉమ్మడి పాలకులు తెరపైకి తెచ్చి మరింత రెచ్చగొట్టినప్పుడు ఇక కేసీఆర్ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని సింహనాదం చేసి ఆమరణ నిరహారదీక్షకు దిగారు. తద్వారా తెలంగాణ సమాజం ఏకమైంది. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి పోరాడుతున్న కేసీఆర్‌ను కాపాడుకునేందుకు ప్రజలంతా ఆయన వెంట నడువడానికి 2009 నవంబరు 29న చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కారణమైంది. కేసీఆర్ దీక్షకు దిగి వచ్చిన ఢిల్లీ ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన తెలంగాణ ప్రకటనతో కొంచెం పోరాడితే తెలంగాణ వస్తుందన్న ఆశ కలిగింది. దీక్ష నుంచి ఇప్పటివరకూ ఆవిష్కృతమైన ప్రతి సన్నివేశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే తన ప్రజల మేలు కోసం ఎంత మొండిగా వ్యవహరిస్తారో అర్థమవుతుంది. దీక్షకు రెండు రోజుల ముం దు అనగా 2009 నవంబరు 27న కేసీఆర్ నాతో పాటు మరికొందరు పార్టీ ముఖ్య నాయకులకు కొన్ని బాధ్యతలు అప్పగించి కరీంనగర్‌కు వెళ్తూ మళ్లీ కలుస్తామో,లేదోనని ఆయన అన్న మాటలు మమ్మల్ని కలచివేశాయి. నిజానికి కేసీఆర్ పట్టుదల గురించి తెలంగాణ సమాజానికి ఎవరో చెబితే తెలువాల్సిన అవసరం లేదు.

కేసీఆర్‌ను నాలుగు దశాబ్దాలుగా దగ్గరి నుంచి చూసిన సిద్దిపేట ప్రజలకు, 17 ఏండ్ల పాటు ఉద్యమంలో, పాలనలో ఆయనతో అనుబంధం పెంచుకొని నడుస్తున్న టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు, గత మూడున్నరేండ్లుగా కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్న ఆయన సుపరిపాలనను ప్రత్యక్షంగా చూస్తు న్న యావత్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఇవ్వకుండా మొండికేసిన ఢిల్లీ పెద్దల వరకూ కేసీఆర్ పట్టుదల గురించి తెలుసు. కేసీఆర్ దీక్ష చేసి ఎనిమిదేండ్లు పూర్తయిన సందర్భంగా అసలు ఆయన ఎందుకు దీక్ష చేయాల్సి వచ్చింది, ఇంతటి కఠిన నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న విషయాలపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్న సమయంలో హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఒకవైపు మా కొలువులు, మా నిధులు, మా వనరులు మాకేనని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో పుండు మీద కారం చల్లినట్లు అప్పటి ప్రభుత్వం స్థానికులకు అన్యాయం చేసేలా కుట్ర చేసింది. దీన్ని సహించలేకపోయిన కేసీఆర్ ఉద్యోగులతో కలిసి సిద్దిపేట లో ఉద్యోగ గర్జన సభ నిర్వహించి ఉమ్మడి పాలకులకు హెచ్చరిక చేశా రు. ఆ సందర్భం నాలాంటి పార్టీ నాయకులతో కేసీఆర్ మాట్లాడుతూ నేను బతికుండగా తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే నేను బతికేం లాభం అని అన్న మాటలే ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి దారితీశాయి. దీక్ష విషయంలో కేసీఆర్ తెగింపును చాటే మరికొన్ని అంశాలు గుర్తుకొస్తాయి. కేసీఆర్ ఆమరణ దీక్ష నిర్ణయం తీసుకోగానే జయశంకర్ సార్, విద్యాసాగర్‌రావులు జోక్యం చేసుకొని దీక్షకు కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోవచ్చన్న ఆందోళనతో వద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. టీఆర్‌ఎస్ నాయకులతో పాటు, ఉద్యమంలో పాలుపంచుకుంటున్న టీఎన్‌జీవో నాయకులు కూడా దీక్ష చేయడం కేసీఆర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని వారించారు. అయినా వినకుండా ఆయన దీక్ష చేయడానికే ఉపక్రమించారు.

కేసీఆర్ కుటుంబసభ్యుల్లో కూడా తీవ్ర ఆందోళన గూడుకట్టుకొని ఉన్నప్పటికీ కేసీఆర్ పట్టుదల, వీరోచిత పోరాట పటిమను చూసి దీక్ష వద్దని చెప్పలేక మిన్నకుండిపోయారు. తెలంగాణ ఉద్యమాన్ని తొమ్మిదేం డ్లుగా అప్రతిహతంగా సాగి స్తూ తెలంగాణ అంటే నిషేధిత పదం కాదని, అది ప్రజల ప్రజాస్వామిక హక్కు అని చాటి ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేసిన కేసీఆర్ ఇంతటి కఠోర నిర్ణయం తీసుకోవడం మాకెవ్వరికీ ఇష్టం లేకుండె. మే ఎంత చెప్పినా వినలేదు. ఆమరణ దీక్ష అనంతరం నిర్వహించాల్సిన ఉద్యమ కార్యక్రమాల మీద తప్ప దీక్ష చేయవద్దని చెప్పడంపై చర్చలు పెట్టకండి అని కొన్నిసార్లు సుతిమెత్తగా, మరికొన్ని సార్లు కోపంగా అన్న మాటలు ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తున్నాయి. దీక్ష జరుగుతున్న సమయంలో మేం చేయాల్సిన పనులను కేసీఆర్ మాకు అప్పగించారు. నాతో పాటు కొంతమంది మిత్రులం కలిసి దాదాపు 11 రోజుల పాటు అనగా డిసెంబరు 9 ప్రకటన వరకూ అజ్ఞాతంలో గడిపిన అనుభవం ఉన్నది. చివరికి మా ఇండ్లకూ వెళ్లలేని పరిస్థితి. ఎక్కడున్నామో, ఎటుపోతున్నామో తెలియని పరిస్థితిలో ఉన్న మేం ఫోన్ ద్వారా మా కుటుంబ సభ్యులతో మాట్లాడిన సందర్భంగా దీక్షలో ఉన్న కేసీఆర్ చనిపోయారని ప్రచారం జరుగుతున్నది, మీరు ఇండ్లు వదిలి ఇంకేమి ఉద్యమాలు చేస్తారని వార న్న మాటలూ గుర్తుకొస్తున్నాయి. కేసీఆర్ లక్ష్యాన్ని అర్థం చేసుకొని తమ కుటుంబ క్షేమం కాకుండా తెలంగాణ ఆత్మగౌరవమే ప్రధానమని కడుపులో ఎంత ఆందోళన ఉన్నా నిబ్బరంతో వ్యవహరించి కేసీఆర్ దీక్షకు మౌనంతో సహకరించిన ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణ సమా జం కృతజ్ఞతలు తెలుపాలె.

కేసీఆర్ దీక్ష దేశాన్నే కుదిపివేసింది. ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీల మాయాజాలం కేసీఆర్ ముందు పారలేదు. గత్యంతరం లేక ఢిల్లీ పీఠం దిగివచ్చి డిసెంబరు 9న తెలంగాణ ప్రకటన చేసింది. సరే ఆ తర్వాత సీమాంధ్రుల కుట్రలు, కాంగ్రెస్ రాక్షసనీతి కలి సి తెలంగాణ ప్రకటన నుంచి కేంద్రం వెనక్కి తగ్గిన సమయంలో కేసీఆ ర్ మరో నాలుగేండ్లు వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించారు. ఆయ నే పాలకుడయ్యారు. ఉద్యమకాలంలో ఊరూరా తిరిగిన సమయంలో అన్నివర్గాల ప్రజల బాధలు ఆయనకు తెలుసు. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత మొండిగా పోరాడుతున్నామో రాష్ట్రం వచ్చిన తర్వా త అంతే మొండితనంలో ప్రజల కష్టాలపై పోరాడాలని అప్పట్లోనే ఆయ న నిర్ణయించుకున్నారు. అందుకే పాలకుడిగా కూడా అన్నివర్గాల ప్రజ ల కష్టాలను పారదోలడానికి ప్రణాళికాబద్ధంగా కసితో కృషిచేస్తున్నా రు. దీని ఫలితమే మూడున్నరేండ్ల పాలనలోనే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నది.

కేసీఆర్ సీఎం అయిన కొద్దిరోజులకే రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేకుండా రూపుమాపడం మొదలుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌తో పాటు 150 దేశాల పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ సమిట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించడం వరకూ ప్రతి కార్యక్రమంలో కేసీఆర్ ముద్ర, ఆయన పట్టుదల, కఠోర శ్రమ, పోరాటపటిమలు కనిపిస్తాయి. కేసీఆర్ ప్రజలను నమ్ముతారు. ప్రజలకు కేసీఆర్‌పై అచంచల విశ్వాసం ఉన్నది. అందుకే నాడు తెలంగాణ రాకుండా అడ్డుపడిన వారే నేడు ప్రతిపక్ష నాయకులుగా ఉండి తెలంగాణ ప్రగతిని కాం క్షించకుండా అభివృద్ధిని అడ్డుకునే చర్యలకు దిగుతున్నా ప్రజల ఆశీస్సులతో వాటిని అధిగమిస్తూ కేసీఆర్ ముందుకుపోతున్నారు. గొప్ప దార్శనికత గల నేతగా వెలుగొందుతున్నారు. (వ్యాసకర్త:  కర్నె ప్రభాకర్,శాసనమండలి సభ్యులు)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.