Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ద్రోహులకు బుద్ధి చెప్పండి

-ఎమ్మెల్సీగా దేవీప్రసాద్‌నే గెలిపిద్దాం: మంత్రి ఈటల -అభివృద్ధిని అడ్డుకునేవారిని ఓడించండి: మంత్రి కేటీఆర్ -దేవీ గెలుపును ఎవరూ ఆపలేరు: మంత్రి మహేందర్‌రెడ్డి

KTR addressing in Deviprasad election campaign

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గ్రేటర్‌లో జోరందుకుంది. గురువారం నగరంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, గ్రేటర్ కన్వీనర్ మైనంపల్లి హన్మంత్‌రావు, టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ, పార్లమెంటరీ కార్యదర్శి కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్‌రావులు ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లి నియోజకవర్గం శేషాద్రినగర్ కమ్యునిటిహాల్‌లో బాలానగర మండల ప్రవేటు స్కూల్స్ కరెస్పాండెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీప్రసాద్‌కు మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఈటల మాట్లాడారు. విద్యావంతులంతా టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్‌కు మద్దతు తెలపడం అభినందనీయమన్నారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించి తెలంగాణ ద్రోహులకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, చెన్నయ్య, కూకట్‌పలి ఇన్‌చార్జి గొట్టిముక్కల పద్మారావు, ప్రవేటు స్కూల్స్ కరస్పాండేంట్ అసోసియేషన్ చైర్మన్ డీ మల్లేశ్‌యాదవ్, అధ్యక్షుడు ఎల్‌ఎన్ సురభి రవిందర్‌రావు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ జమీల్, కోశాధికారి అశోక్, పంచశీల విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్, జనార్దన్‌రావు, దామోదర్‌రావు, చల్లా రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. సికిందరాబాద్‌లోని పెరల్ గార్డెన్స్‌లో కంటోన్మెంట్ ఇన్‌చార్జి గజ్జెల నాగేశ్ ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐటీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నాలుగు లక్షల మంది ఉద్యోగులను ఏకతాటిపై నడిపి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోశించిన దేవీప్రసాద్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని పట్టభద్రులను కోరారు. మంత్రి పద్మారావు మాట్లాడుతూ దేవీప్రసాద్‌ను గెలిపించి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.

మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేవీప్రసాద్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సంజీవరావు, సుధీర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డిలు జిల్లావ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో మంత్రి జోగు రామన్న, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి మాట్లాడుతూ ఉద్యమ నేత దేవీప్రసాద్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈసీఐఎల్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ తెలంగాణ వ్యతిరేక శక్తులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగడం సిగ్గు చేటన్నారు. బడంగ్‌పేటలో ఎమ్మెల్సీ అభ్యర్థి దేవీప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రులను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.

దేవీకి వివిధ సంఘాల మద్దతు దేవీప్రసాద్, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తామని ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్, రిటైర్డ్ ఇంజినీర్ ఇన్‌చీఫ్ మహ్మద్ ఖమ్రుద్దీన్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బాబా ఫసీయుద్దీన్, తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రహ్మణ సంఘం నేతలు రాచమల్ల బాలకృష్ణ, పెంబర్తి శ్రీనివాస్, గడల రాజు, అల్లంరాజు చంద్రశేఖర్, రాష్ట్ర కిరోసిన్ డీలర్ల సంఘం నేతలు మైదంశెట్టి లక్ష్మీరాజం, మనోహర్ (కరీంనగర్), గొల్ల భాస్కర్ (ఖమ్మం), శ్రీనివాస్ (నిజామాబాద్), జ్ఞానేశ్వర్ (మెదక్), మధుసూదన్‌రెడ్డి (ఆదిలాబాద్), దామోదర్ (కరీంనగర్), జూపూడి హన్మంత్ ప్రసాద్ (ఖమ్మం), జితేందర్‌రెడ్డి (నల్లగొండ), బుగ్గేశ్వర్ (రంగారెడ్డి), టీఎస్‌టీయూ నేత సీహెచ్ బాలచందర్‌గౌడ్ తెలిపారు. కిరోసిస్ డీలర్ల సంఘం నేతలు గురువారం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను మర్యాదపూర్వయంగా కలుసుకున్నారు.

దేవీప్రసాద్‌కు ఆర్టీసీ సంఘాల మద్దతు ఎమెల్సీ ఎన్నికల్లో దేవీప్రసాద్‌ను భారీ మోజార్టీతో గెలిపించాలని ఆర్టీసీ తెలంగాణ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణ ఆర్టీసీ మజ్ధూర్ యూనియన్ తరపున అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వీ తిరుపతి, అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్‌రెడ్డి, తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎస్ బాబు, కే రాజిరెడ్డి, తెలంగాణ ఎన్‌ఎంయూ నాయకులు మహమూద్ వేర్వేరు ప్రకటనల్లో గురువారం మద్దతు ప్రకటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.