Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఎగ్జిట్‌పోల్స్ కారు జోరు

-తెలంగాణ ఎంపీ సీట్లలో అత్యధికం 8-10 స్థానాలు టీఆర్‌ఎస్‌కే – సీమాంధ్రలో వైఎస్సార్సీపీ,టీడీపీ పోటాపోటీ -దేశంలో మోడీ పవనాలు నిజమేనంటున్న ఎగ్జిట్‌పోల్స్ -పదేళ్ల యూపీఏ పాలనకు తెరదించనున్న ఓటర్లు?న్యూఢిల్లీ, మే 12: సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవా నడుస్తున్నదని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం నిజమేనని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు తేల్చాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి దాదాపు సంపూర్ణమె జారిటీ సాధించే అవకాశముందని వెల్లడించాయి. బీజేపీ సొంతంగానే 230-240 ఎంపీ స్థానాలు సాధించి మొదటిసారి 200 మార్కును అధిగమించనుందని పేర్కొన్నాయి.

KCR 0005

పదేళ్ల యూపీఏ పాలనకు ఓటర్లు తెరదించనున్నారని, కాంగ్రెస్ పార్టీ కేవలం 100-110 స్థానాలకే పరిమితం కానుందని తెలిపాయి. దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలూ నరేంద్రమోడీయే దేశానికి కాబోయే ప్రధాని అని చెప్పకనే చెప్పాయి. సుదీర్ఘంగా కొనసాగిన 2014 సార్వత్రిక ఎన్నికలు సోమవారం సాయంత్రం ముగిసిన వెంటనే న్యూస్ ఎక్స్-సీఓటర్, ఇండియాటుడే-సీసెరో, ఏబీపీ-నీల్సన్, సీఎన్‌ఎన్-ఐబీఎన్- సీఎస్‌డీఎస్, టైమ్స్‌నౌ-ఓఆర్‌జీ తదితర సంస్థలు తమ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను వెల్లడించాయి. ఉత్తరభారత దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆ పార్టీకి ఏకపక్ష ఫలితాలు రాబోతున్నట్లు ఎగ్జిట్ ఫోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తున్నది. కాగా, తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తిరుగులేని శక్తిగా అవతరించనుందని, దాదాపు 37శాతం ఓట్లతో 10 నుంచి 12 లోక్‌సభ స్థానాలు గెలువనుందని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది.

పోలింగ్‌కు ముందు నిర్వహించిన సర్వేల్లోకంటే పోలింగ్ తర్వాత అభిప్రాయ సేకరణలో టీఆర్‌ఎస్‌కు మరింత బలం పెరగటం విశేషం. 3 నుంచి 5 స్థానాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్ తర్వాతి స్థానంలో నిలుస్తుందని, బీజేపీ-టీడీపీ కూటమి రెండు స్థానాలు మాత్రమే సాధించే అవకాశముందని సర్వేలు తెలిపాయి. సీమాంధ్రలో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ, బీజేపీ కూటమి గట్టి పోటీనిచ్చినట్లు తెలుస్తున్నది. జగన్‌పార్టీకి, టీడీపీ కూటమికి గెలుపు అవకాశాలు సరిసమానంగా ఉన్నాయని, ఇవి రెండూ 11 నుంచి 15 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశముందని కొన్ని సర్వేలు తెలిపాయి. అయితే టీడీపీ-బీజేపీ కూటమికే సీమాంధ్ర ప్రజలు పట్టం కట్టనున్నారని, మొత్తం 25 స్థానాల్లో ఆ కూటమికి 15 నుంచి 20 సీట్లు వస్తాయని మరికొన్ని సర్వేలు వెల్లడించాయి.

సౌత్‌లో కాంగ్రెస్.. నార్త్‌లో బీజేపీ సోమవారంతో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఉత్తర భారతదేశంలో, యూపీఏ దక్షిణాది రాష్ర్టాల్లో ఆధిక్యం కనబర్చాయని ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను బట్టి తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కేరళ, కర్ణాటక రాష్ర్టాల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాలను సాధించనుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గెలుస్తుందని భావిస్తున్న మొత్తం స్థానాల్లో కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి సింహభాగం ఉండనున్నాయి.

ఇక బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ర్టాల్లో కమలం పార్టీకి ఓటర్లు ఏకపక్షంగా ఓట్లు వేశారని, ఈ రాష్ర్టాల్లో బీజేపీ క్లీస్‌స్వీప్ చేయనున్నదని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. అత్యధికంగా 80లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 46-50 స్థానాలు గెలుస్తుందని ఏబీపీ న్యూస్ తెలిపింది.

ప్రాంతీయ పార్టీల జోరు ఎన్డీయే, యూపీఏ కూటముల వెలుపల ఉన్న పలు ప్రాంతీయ పార్టీలు 2014 ఎన్నికల్లో ఘనవిజయం సాధించనున్నాయని ఎగ్జిట్‌పోల్ ఫలితాలు తెలిపాయి. తమిళనాడులో అధికార అన్నాడీఎంకే దాదాపు క్లీన్‌స్వీప్ చేయనుందని, రాష్ట్రంలోని 39 ఎంపీ స్థానాల్లో ఆ పార్టీ 31 సీట్లు కైవసం చేసుకోనుందని పలు సర్వేలు పేర్కొన్నాయి. ప్రతిపక్ష డీఎంకేకు 7-11 సీట్లు మాత్రమే రావొచ్చని సర్వేలు వెల్లడించాయి. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కే ఓటర్లు పట్టం కట్టారని, రాష్ట్రంలో 42న సీట్లకుగాను 31 స్థానాలు టీఎంసీ ఖాతాలోకి వెళ్లనున్నాయని ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయి.

ఈ ఎన్నికలపై గంపెడన్ని ఆశలు పెట్టుకొన్న వామపక్షాలకు నిరాశే ఎదురుకానుందని, లెఫ్ట్‌ఫ్రంట్ అన్ని రాష్ర్టాల్లో కలుపుకొని 14-20 స్థానాలు మాత్రమే సాధించే అవకాశముందని పేర్కొన్నాయి. బీహార్‌లో అధికార జేడీయూ దారుణంగా దెబ్బతిని కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకోనుందని, బీజేపీ కూటమికి దాదాపు 28 స్థానాలు దక్కనున్నాయని వెల్లడించాయి. మహారాష్ట్రలోని 48 స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి దాదాపు 30 సీట్లు గెలుచుకోనుంది. ఈ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్-ఎన్సీపీ కూటమితోపాటు మహారాష్ట్ర నవనిర్మాణసేనకు కూడా ఓటర్లు గట్టి షాకివ్వనున్నట్లు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి కేవలం 13 నుంచి 17 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చే అవకాశముందని సర్వేలు తెలిపాయి. ఈ రాష్ట్రంలో బహుజన్ సమాజ్‌పార్టీ కూడా 10-14 స్థానాలకంటే ఎక్కువ సాధించలేదని వెల్లడించాయి. ఒడిశాలో అధికార బిజూజనతాదళ్ తన ఆధిపత్యాన్ని నిలుపుకోనుందని, ఆ పార్టీకి 12 నుంచి 16 ఎంపీ స్థానాలొచ్చే అవకాశముందని తెలిపాయి. ఆమ్‌ఆద్మీ పార్టీకి దేశవ్యాప్తంగా 5 స్థానాలు దక్కవచ్చని సర్వేలు పేర్కొన్నాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.