Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గబ్బిలాల గాంధర్వగీతాలాపాన

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు.. అన్న నానుడిని కాంగ్రెస్ నేతలు మరిచిపోయి ఉంటారు, కాదు కాదు ప్రజలు మరిచిపోయి ఉంటారని కాంగ్రెస్ నాయకులు భ్రమపడి ఉంటారు. కానీ ప్రజలు ఏ విషయాన్ని అంత తొందరగా మరిచిపోరు. సందర్భానుసారంగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తూనే ఉంటరు. 1971 లో తెలంగాణ కావాలనే బలమైన కాంక్షతో ఏర్పడ్డ టీపీఎస్ పార్టీకి చెందిన 11 మంది ఎంపీలను నాడు కాంగ్రెస్ పార్టీయే నిర్వీర్యం చేసి, తద్వారా ప్రజల ఆకాంక్షలపై నీళ్లు చల్లిందనే విషయం మసకమసకగా కదలాడుతుందనే విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి. ఒక్క తెలంగా ణ ఉద్యమ సందర్భమే కాదు.. 70 ఏండ్ల స్వాతంత్య్ర రాజకీయ చరిత్రలో లెక్కలేని చీకటి అధ్యాయాలకు నిలువెత్తు ఆకారం కాంగ్రెస్. ప్రజాస్వామి క విలువలకు తిలోదకాలిచ్చే వికృత చేష్టలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ అన్న సంగతిని ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదని నా భావన. అమ్మడం, కొనడం, బెదిరించడం, తొక్కేయడం, నొక్కేయడమే కాంగ్రెస్ భావజాలం.. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇయ్యాల ఇం దిరా పార్క్ దగ్గర ప్రజలకు ఈస్ట్‌మన్ కలర్ సినీమా చూపించే ప్రయత్నం చేస్తున్నరు. రెండు రోజులు కాంగ్రెస్ పార్టీ నాయకుల హడావుడిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారనే విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అర్థం కాకపోవచ్చు. కానీ ప్రజలకు మాత్రం స్పష్టంగా అర్థమైంది. అందుకే వారి చేష్టలను చూసి ఛీత్కరించుకుంటున్నారు. అయితే ఆ విషయం ఆ పార్టీ నాయకులకు అర్థం కాక కాదు, అర్థమైనా అర్థం కానట్టు నటించి అమాయకులను నమ్మించాలనే కుట్రలో భాగం.

టీఆర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ప్రతి సందర్భంలో తెలంగాణవాదాన్ని బొందపెట్టాలని చూసింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో పాత్రదారులైంది ఈ సోకాల్డ్ నాయకులు కాదా..? 2004 లో ప్రజల ఆశీర్వాదంతో 26 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంటే.. 10 మందిని అమెజాన్‌లో ఆర్డర్ పెట్టి కొన్నట్టు కొనేసినప్పుడు క్రియాశీల పాత్ర పోషించిన జైపాల్‌రెడ్డి, ఉత్త మ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్‌బాబులకు అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదనుకోవాలా..? ఇప్పుడే ప్రజాస్వామ్యం, రాజ్యంగం, విలువలు గుర్తుకురావడంలో ఆంతర్యం ఏంటీ.?

అరువడం, పెడబొబ్బలు పెట్టి చివరికి అభాసుపాలు కావడం వారికి అలవాటున్నదే కదా. విచిత్రమేమంటే ఇందిరాగాంధీ పేరుపై ఏర్పాటుచేసిన ఇందిరా పార్కు దగ్గర హడావుడి చేస్తున్న వీరు 1971లో తెలంగాణ ప్రజా సమితి ఎంపీలను కొన్న ఇందిరాగాంధీ ప్రభుత్వ నీచ రాజకీయ స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటే బాగుండేది. నాడు ఇందిరాగాంధీ తెరలేపిన పార్టీ ఫిరాయింపుల నుంచి మొన్నటికి మొన్న టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్యేలను అడ్డంగా కొనేదాక అప్రతిహాతంగా సాగిన విషయం నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజల ఆకాంక్షలు అవసరం లేదు. ప్రజల బలమైన కోరికలు గౌరవించడం ఆ పార్టీ భావజాలంలోనే లేదు. వారెన్నడూ దానికి అనుగుణంగా పనిచేసి న పాపానపోలేదు. అందుకే ఇయ్యాల ఆ పార్టీ శంకరగిరి మాన్యాల గడపలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పడం అంటే మోసం గురించి గ్రంథావిష్కరణ చేయడం లాంటిదే. వారు ఉనికి కోసం, అధికార పీఠం ఎక్కడం కోసం దేశంలో వారి వెన్నుపోటు పొడిచిన పార్టీలను లెక్కిస్తే.. వారి నుంచి బయటపడిన పార్టీలను వేళ్లమీద లెక్కించవచ్చునంటే అతిశయోక్తి కాదు. అసలు విలువల వలువలూడదీసే దుశ్చర్యలకు, పార్టీలను కూలదోసే కుట్రలకు ఈ దేశంలో ఉన్న ఏకైక శిక్షణాలయం 10 జన్‌పథ్ అన్నది కొత్త గా చెప్పాల్సిన అవసరం లేదు. తమకు ఎదరుచెప్పిన, తమ అదుపాజ్ఞలో లేని అనేకమంది సొంత పార్టీ నేతలను వదిలిపెట్టని కుసంస్కారం, తమ చెప్పుచేతుల్లోకి తీసుకురావడానికి వారు చేసిన దుర్మార్గ రాజకీయ దౌర్భాగ్యం గురించి చెప్పడం అంటే కొత్తతరాన్ని చెడగొట్టడమే అవుతుం ది.

అంత కుసంస్కృతి కలిగిన పార్టీని ప్రపంచంలో మరే దేశంలోనూ చూడటం సాధ్యమైతదా అనిపిస్తది ఒక్కోసారి. ఇదంతా సరే, అసలు విషయానికి వద్దాం. ప్రజాస్వామ్యం, నీతి, నిజాయితీ అంటూ పెద్దపెద్ద పదాలతో మీడియా ముందుకువస్తున్న పెద్దమనుషులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డిలకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నీతీనియమాలు అనే పదా లు ఉచ్చరించే కనీస అర్హత ఉందా? అనే విషయాన్ని ఆలోచించుకొని మాట్లాడితే కొంతలో కొంతైన ప్రజల ముందు నిజాయితీపరులుగా ఉండేవారు. కానీ, అధికారం కోసం ఉద్యమకారులను, ఉద్యమ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు తెలంగాణ జెండాపై గెలిచిన ప్రజాప్రతినిధులను సం తలో సరుకుల కంటే అధ్వాన్నంగా కొనేసిన ఈ నాయకులు.. ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ మాట్లాడుతుంటే గబ్బిలాలు గాంధర్వగీతాలాపాన చేసినట్టున్నదని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను ఆ నాయకులు ఆత్మావలోకనం చేసుకుంటే.. వారి మోసాలు, కుట్ర రాజకీయాలు 1971 నుంచి మొన్నటి ఎమ్మెల్సీలు, ఎంపీలను కొనేదాక కండ్ల ముందట స్పష్టంగా కనిపిస్తయి. 1971లో తెలంగాణ ప్రజల గుండెల్లో గునపం గుచ్చి టీపీఎస్‌ను తమ పార్టీలో విలీనం చేసుకొని తెలంగాణ బలమైన కోరికను శాశ్వతంగా దూరం చేయాలని చూసింది ఈ కాం గ్రెస్ పార్టీ కాదా..? అదే తెలంగాణ ఆకాంక్ష 2001లో తిరిగి కేసీ ఆర్ నాయకత్వంలో పురుడు పోసుకున్నది నిజం కాదా? అప్పటినుంచి టీఆ ర్‌ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ప్రతి సందర్భంలో తెలంగాణవాదాన్ని బొందపెట్టాలని చూసింది కాంగ్రెస్ పార్టీ.

దాంట్లో పాత్రదారులైంది ఈ సోకాల్డ్ నాయకులు కాదా..? 2004లో ప్రజల ఆశీర్వాదంతో 26 మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంటే.. 10 మందిని అమెజాన్‌లో ఆర్డర్ పెట్టి కొన్న ట్టు కొనేసినప్పుడు క్రియాశీల పాత్ర పోషించిన జైపాల్‌రెడ్డి, ఉత్త మ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీ ర్ అలీ, శ్రీధర్‌బాబులకు అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదనుకోవాలా..? ఇప్పుడే ప్రజాస్వామ్యం, రాజ్యంగం, విలువలు గుర్తుకురావడం లో ఆంతర్యం ఏంటీ.? అయితే ఇక్కడ ఒక పోలికను ప్రజలు స్పష్టంగా గమనించాలి.. 2004లో కాంగ్రెస్ పార్టీ తెరలేపిన పార్టీ ఫిరాయింపుల చర్య ఒక పార్టీని నష్టం చేయడానికో.. లేక మరొక పార్టీ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకోవడానికి జరిగిన చర్యగా భావించవద్దు. అది తెలంగా ణ ప్రజల అయిదు దశాబ్దాల ఆకాంక్షను చంపి బూడిద చేయడానికి జరిగిన దుర్మార్గమైన ప్రయత్నంగా భావించాలి. తెలంగాణ గడ్డపైన పుట్టి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు సైతం లెక్కపెట్టకుండా, ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపమైన టీఆర్‌ఎస్ పార్టీని నిర్వీర్యం చేసినప్పుడు ఈ సోకాల్డ్ పెద్ద మనుషులు ప్రశ్నించి ఉంటే.. వారి ప్రశ్నల కు కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉండి ఉంటే.. 2014 వరకు తెలంగాణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు. వందలాది మం ది బిడ్డల తల్లిదండ్రులు తమ బిడ్డలను కోల్పోవలసిన అవసరం వచ్చి ఉం డేది కాదు. నాడు తమ పదవుల కోసం పెదాలను మూసుకున్నవారు.. తమ పదవులను కాపాడుకోవడం కోసం ఎంత తెగింపైన చేసి, ప్రజల ఆకాంక్షలను తాకట్టు పెట్టినవారు, ఈరోజు విచిత్ర విన్యాసం చేస్తుంటే ఉపమానం కోసం కాదుకానీ.. నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. (వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు) శ్రీ కర్నె ప్రభాకర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.