Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గ్రేటర్ దెబ్బకూ బుద్ధిరాలేదా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు ఓటు దెబ్బతో గుణపాఠం చెప్పినా కాంగ్రెస్, టీడీపీ నేతలు గుణపాఠం నేర్వలేదు. మీరూ వద్దు.. మీ పార్టీలూ వద్దని ప్రజలు తీర్పునిచ్చినా ఏదో ఒరుగబెడుతామని నారాయణఖేడ్ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తున్నారు. గతంలో ఖేడ్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ రెండు పార్టీలు ప్రజలను పస్తులుంచాయి. కానీ నేత లు మాత్రం కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారు. అరవై ఏండ్లలో ఖేడ్ సాధించిన అభివృద్ధి ఇదే అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. -టీడీపీ, కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్‌రావు ఫైర్ -కాంగ్రెస్ ఫ్యాక్షనిజాన్ని చూస్తూ ఊరుకోం..ఖబడ్దార్ -పోలింగ్ తర్వాత చంద్రబాబు చెంచాలు దారివెతుక్కోవాలి -ఒక్క ఓటుతో రెండు పార్టీలను తరిమికొట్టాలి -ఖేడ్ ఉపఎన్నికల ప్రచారం రోడ్‌షోల్లో మంత్రి హరీశ్‌రావు

Harish-Rao-election-campaign-in-Narayankhed

సోమవారం మెదక్ జిల్లా ఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలం నాగూర్ బీ, చాప్టా కే, చాప్టా బీ, జంమ్గి కే, జంమ్గి బీ, గాంధీనగర్, కల్హేర్ మండలం కాజాపూర్, కడ్పల్, బీబీపేట్, మార్డి, కల్హేర్‌లో ఎన్నికల ప్రచారసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని పదిజిల్లాల్లో ఎక్కడా లేనివిధంగా ఖేడ్ అభివృద్ధిలో వెనుకబాటుకు గురికావడానికి కారణమెవరని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. ఇంతకాలం ఖేడ్‌లో కాంగ్రెస్ నేతలు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపారని, బెదిరింపులతో అమాయక ప్రజలను అణచివేతకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారం ఇలా ఉంటుందా? అని టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారన్నారు.

రాక్షసానందం పొందిన కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ హయాంలో అర్ధరాత్రిళ్లు ఎవరి ఇంట్లోనో కూర్చు ని ఓట్ల కోసం ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపారని మంత్రి హరీశ్‌రావు మంపడ్డారు. అనుకూలంగా లేనివారిపై కేసులు పెట్టించారని, అన్నదమ్ముళ్లు, భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి పదవులు కాపాడుకుంటూ రాక్షసానందం పొందారని నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ వచ్చింది.. ఖేడ్‌లో ఫ్యాక్షన్ రాజకీయాలు, బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం.. ఖబడ్దార్ అని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. టీఆర్‌ఎస్ రాకతో స్వాతంత్య్రం వచ్చిందని ఖేడ్ ప్రజలు ము రిసిపోతున్నారని చెప్పారు. ఇంకా మీ మోసాలు, అక్రమాలు జరుగుతాయనుకోవడం భ్రమ.. ప్రజలు అన్నీ తెలుసుకున్నా రని, ఉప ఎన్నికలో తగినగుణపాఠం చెప్పనున్నారని ధీమా వ్యక్తంచేశారు.

పదవులు పంచుకుంటూ 60 ఏండ్లుగా ఆస్తు లు కూడగట్టుకున్న వారే మొసలికన్నీళ్లు కార్చుతూ మీ వద్దకు వస్తున్నారు.. మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. గ్రామాలకు రోడ్లు లేవు. పాఠశాలలు, దవాఖానలు, కనీసం తాగేందుకు నీళ్లు కూడా ఇవ్వని కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని ఆ పార్టీ నేతలు ఎలా అడుగుతున్నారని నిలదీశారు. ఓటెయ్యాలని అడిగేందుకు చెప్పుకోవడానికి ఒక్క మంచి పనైనా చేశా రా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు అణచివేత రాజకీయ అం తానికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్నవని అభివర్ణించారు.

టీడీపీ గురించి మాట్లాడితే టైంవేస్ట్ టీడీపీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆ పార్టీ గురించి మాట్లాడి సమయం వృథానేనని హరీశ్‌రావు విమర్శించారు. మొన్నటి గ్రేటర్ ఎన్నికల దెబ్బకు ఆ పార్టీ ఆంధ్రా కు వెళ్లిపోయిందని ఎద్దేవాచేశారు. అక్కడక్కడ కొందరు చంద్రబాబు చెంచాలు ఉన్నారని, ఏదో సాధించినట్లు విర్రవీగుతున్నారన్నారు. ఖేడ్‌లో 13న ఉప ఎన్నిక పోలింగ్ తర్వా త ఆ చెంచాలు ఎక్కడికి వెళ్లాలో దారివెతుక్కోవాలని టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. ఇక్కడ ప్రచారం చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు రెండురోజులైతే ఒకరు నల్లగొండకు, మరొకరు కొడంగల్‌కు పత్తాలేకుండా పోతారని, తాను జిల్లా మంత్రిగా ఇక్కడే ఉండి ఖేడ్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. ఓటు దెబ్బతో కాంగ్రెస్, టీడీపీలను ఖేడ్ పొలిమేరల వరకు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

ఆర్నెళ్లలో 60 ఏండ్ల అభివృద్ధి చేశాం కాంగ్రెస్ హయాంలోనే ఖేడ్ అభివృద్ధి చెందిందంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. కంగ్టి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలు కేవలం మూడే ఉన్నాయని, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట మండలంలో 21 పాఠశాలలున్నాయన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పాఠశాలల సంఖ్య ఇలాగే ఉన్నదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. మనూరు మండలంలో జూనియర్ కళాశాల లేదని, ఒక్కో నియోజకవర్గంలో మూడు నాలుగు మార్కెట్ యార్డులుంటే ఖేడ్‌లో ఒక్కటి కూడా లేదన్నారు. ఖేడ్‌లో 30 పడకల దవాఖాన ఉన్నా అందులో పది పడకలే ఉన్నాయన్నారు. జిల్లాలోనే అన్ని నియోజకవర్గాల్లో 30కి పైగా విద్యుత్ సబ్‌స్టేషన్లుంటే ఖేడ్‌లో 20 ఉన్నాయన్నా రు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఇదేనా అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ చొరవతో ఆర్నెళ్లలో ఖేడ్‌లో రూ.19 కోట్లతో 150 పడకల దవాఖాన, పెద్దశంకరంపేటలో 100 పడకల దవాఖానలు మంజూరు చేశామన్నారు. కొత్తగా 11 విద్యుత్ సబ్‌స్టేషన్ల మంజూరు చేయగా అన్ని నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు. రెండు సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా అవుతున్నదన్నారు. మనూరుకు జూనియర్ కళాశాల మంజూరు చేశామన్నారు. కౌలాస్‌నాలాను బాగుచేయించి కంగ్టి మండ ల ప్రజలకు తాగునీరందిస్తున్నామన్నారు. అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేయిస్తున్నామని, ఆర్నెళ్లలో రూ.500 కోట్ల పను లు మంజూరు చేశామన్నారు. 60 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ల హయాంలో విడుదలకాని నిధులు ఆర్నెళ్లలో ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుకు ఖేడ్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులే అద్దం పడతాయన్నా రు. నోరున్నదని విమర్శలు చేసేముందు ఆలోచించుకోవాలని ప్రతిపక్ష నేతలకు హితవుపలికారు.

టీఆర్‌ఎస్‌కు న్యాయవాదుల మద్దతు చాంద్రాయణగుట్ట: ఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డికి మద్దతుగా హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీ లాయర్లు సోమవారం ప్రచారంలో పాల్గొన్నారు. న్యాయవాది మాణిక్‌ప్రభు, తిరుమలరావుల బృందం ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు, బంగా రు తెలంగాణ నిర్మాణంలో సైతం భాగ్యస్వాములమవుతామన్నారు. ఉద్యమంలో ముందుండి పోరాడిన భూపాల్‌రెడ్డిని సీఎం కేసీఆర్ కోరిక మేరకు అత్యధిక మోజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

బాబూ.. పెద్దమాదిగనన్న మాటలేమయ్యాయి? మాదిగ జాతి అభివృద్ధి కి పెద్దమాదిగనవుతానని ప్రకటించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎస్సీ వర్గీకరణపై ఎందుకు నోరుమెదపడం లేదని మంత్రి హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఖేడ్‌లోని సాయిబాబా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీఎమ్మార్పీఎస్ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేశామని, ఏపీ అసెంబ్లీలో ఎందుకు చేయలే దని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని హామీఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపోరాటంలో అసువులుబాసిన అమరుల కుటుంబాలకు రూ. 1.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించామని, మాదిగల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని భరోసాఇచ్చారు.

కల్యాణలక్ష్మి ద్వారా దళిత ఆడబిడ్డల పెండ్లిళ్లకు రూ.51 వేలు, నిరుపేద దళిత కుటుంబాలకు మూడెకరాల చొప్పున సాగుకు యోగ్యమైన భూమి అందిస్తున్నామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ అందించే రుణాల్లో 80 శాతం సర్కారు మాఫీ చేస్తున్నదని, గతంలో ఏ ప్రభుత్వాలు దళితుల కోసం ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో స్వయంగా అప్పటి ప్రధా ని పంపిణీ చేసిన భూమికే హద్దులు నిర్ణయించలేదని ఎద్దేవాచేశారు. ఎస్సీ అసైన్డ్ భూములను వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందన్నారు. రూ.5.30 లక్షలు వెచ్చించి పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మిం చి ఇస్తున్నదని, ఇందులో దళితులే ఎక్కువ శాతం లబ్ధిపొందనున్నారని చెప్పారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి నారాయణఖేడ్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని, కాంగ్రెస్ టీడీపీ అడ్రస్సులు గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ పాతూరి సుధార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, గణేశ్ గుప్తా, హన్మంత్ షిండే పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.