Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

తెలంగాణ బడ్జెట్ 2016 – 17 ముఖ్యాంశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ -2016ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రం పై  దశాబ్దాల పాటు వివక్ష కొనసాగిందని తెలిపారు. ప్రజల అనేక ఆశలు, ఆకాంక్షాలకు అనుగుణంగా బడ్జెట్ ను రూపకల్పన చేశామన్నారు. వాస్తవాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బడ్జెట్ ఇదే అని పేర్కొన్నారు.

-రాష్ట్ర బడ్జెట్ రూ. 1,30,415.87 కోట్లు -ప్రణాళిక వ్యయం రూ. 67,630.73 కోట్లు -ప్రణాళికేతర వ్యయం రూ. 62,785.14 కోట్లు -రెవెన్యూ మిగులు రూ. 3,318 కోట్లు -ద్రవ్యలోటు రూ. 23,467.29 కోట్లు -మిషన్ భగీరథ సృష్టికర్త సీఎం కేసీఆర్ -తెలంగాణ ఏర్పడిన 21 నెలల్లోనే బంగారు తెలంగాణకు బాటలు వేశాం -కేంద్రం నుంచి అందిన సాయం రూ. 450 కోట్లు మాత్రమే

Eatala Rajendar introducing Telangana Budget 2016-17 in Asseembly

-బీసీ సంక్షేమానికి రూ. 2,538 కోట్లు -మైనార్టీ సంక్షేమానికి రూ. 1,204 కోట్లు -ఎస్సీ సంక్షేమానికి రూ. 7,122 కోట్లు -ఎస్టీ సంక్షేమానికి రూ. 3,752 కోట్లు

-ఆసరా పింఛన్ల కోసం రూ. 4,693 కోట్లు -కళ్యాణలక్ష్మీ కోసం రూ. 738 కోట్లు -ప్రత్యేకాభివృద్ధికి రూ. 4,675 కోట్లు -పట్టణాభివృద్ధికి రూ. 4,815 కోట్లు

-పారిశ్రామికాభివృద్ధికి రూ. 967 కోట్లు -ఐటీ, సమాచార శాఖకు రూ. 254 కోట్లు -పర్యాటక, సంస్కృతి రంగానికి రూ. 50 కోట్లు -మిషన్ భగీరథకు రూ. 36,976 కోట్లు

-విద్యాశాఖలో ప్రణాళికేతర వ్యయానికి రూ. 9,044 కోట్లు -విద్యాశాఖలో ప్రణాళిక వ్యయానికి రూ. 1,164 కోట్లు -అగ్నిమాపక శాఖకు రూ. 223 కోట్లు -ఆరోగ్య శాఖకు రూ. 5,967 కోట్లు -వ్యవసాయంకు రూ. 6,759 కోట్లు

-రాబోయే మూడేళ్లలో 23,912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం -వచ్చే ఖరీఫ్ నుంచి 9 గంటల విద్యుత్ -రాష్ర్టాన్ని విత్తన భాండాగారంగా ఏర్పాటుకు శ్రీకారం

-మహిళా శిశు సంక్షేమానికి రూ. 1,553 కోట్లు -బ్రహ్మణ సంక్షేమానికి రూ. 100 కోట్లు -రహదారులు, భవనాల అభివృద్ధికి రూ. 3,333 కోట్లు -పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 10,731 కోట్లు -గోదావరి, కృష్ణా నదిలో రాష్ర్ట వాటా 1250 టీఎంసీలు -వంద శాతం రుణమాఫీ చేస్తాం

-గత రెండేళ్లుగా సరైన వర్షపాతం లేదు. -అభివృద్ధి, సంక్షేమం కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టబోతున్నాం. -పాలమూరు ఎత్తిపోతలకు రూ. 7,861 కోట్లు. -నీటి పారుదల రంగానికి రూ. 25 వేల కోట్లు -సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 1,150 కోట్లు -కాలేశ్వరం ఎత్తిపోతలకు రూ. 6,286 కోట్లు -రుణమాఫీ కేటాయింపులు రూ. 3,718 కోట్లు -స్థూల ఉత్పత్తి 11.47 శాతంగా నమోదు

-స్థూల ఉత్పత్తి పెరుగుదలే అభివృద్ది కాదు -ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి -రాష్ర్టంలోని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తాం -పండ్లు, కూరగాయాల సాగుకు హార్డికల్చర్ డెవలప్ మెంట్ కు ప్రత్యేక కార్పొరేషన్ -మత్స్య పరిశ్రమకు ప్రోత్సాహం కల్పిస్తాం

-ఎఫ్ఆర్బీఎం పెంచినా ఇంకా అమలు కాలేదు -రెండు విడతల రుణమాఫీ సొమ్ము బ్యాంకుల్లో జమ చేశాం -నీళ్లు, నిధులు, నియామకాలు మన ఆధీనంలోకి వచ్చాయి. -ఆసరా ఫించన్లు గణనీయంగా పెంపు

-హైదరాబాద్ లో మరో 4 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు -ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు -40 చోట్ల డయాలసిస్, 40 చోట్ల డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు -గ్రామాల్లోని పీహెచ్ సీ నుంచి నిమ్స్ వరకు అన్ని ఆస్పత్రుల్లో సమూల మార్పులు

-రాష్ర్టంలో కొత్తగా 63 ఫైర్ స్టేషన్లు నిర్మిస్తాం -గృహ, పరిశ్రమలకు నిరాంతరాయంగా విద్యుత్ -ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో కోటి ఎకరాలకు సాగునీరు -గోదావరి, కృష్ణా నదులపై కర్ణాటక, మహారాష్ర్ట 450 బ్యారేజీలు నిర్మించాయి -గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ర్ట సహకారం -ప్రాణహిత, ఇంద్రావతి నీళ్లు ఒడిసిపట్టి పంట పొలాలు నీళ్లిస్తాం

-గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు రూ. 300 కోట్లు -మున్సిపాలిటీలకు రూ. 500 కోట్లు -రూ. 33,100 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం -ఖమ్మంలో మెగాఫుడ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి

-కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి రూ. 140 కోట్లు -పోలీసు సిబ్బంది కోసం క్వార్టర్ల నిర్మాణానికి రూ. 70 కోట్లు -జిల్లాల్లో పోలీస్ స్టేషన్ల నిర్వహణకు రూ. 10 కోట్లు -నాణ్యమైన విద్య అందించేందుకు విద్యా వ్యవస్థ ప్రకాళన

-సంక్షేమానికి పెద్ద పీట -మైనార్టీల కోసం 70 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు -గ్రామాల్లో పని చేసే వైద్యులు, సిబ్బందికి ప్రోత్సాహం -మన వనరులను మనం వినియోగించుకునే అవకాశం వచ్చింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.