-వడ్డెర మహాసభలో ఈటెల రాజేందర్
తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన తాము ఇకనుంచి తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం కొట్లాడుతానని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో జరిగిన వడ్డెర మహాసభలో ఆయన మాట్లాడుతూ వడ్డెరులు తమ హక్కుల సాధనతో పాటు రాజ్యాధికారం కోసం పోరాడాలని సూచించారు. తెలంగాణలో 85 శాతం అణగారిన కూలాల ప్రజలే వున్నారని, వారు అభివృద్ది కోసం కృషీ చేస్తామని చెప్పారు. తెలంగాణ వడ్డెర సంఘం అధ్యక్షుడు పల్లపు సాంబరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంఘం నాయకులు దుర్గయ్య, మనోహర్, రవీందర్, ముత్యాల, గుంజ సాంబరావు, ఆంధ్రపదేశ్ వడ్డెర సంఘం నేత తన్నీరు ధర్మరాజు పాల్గొన్నారు.