Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇందూరు టీఆర్‌ఎస్‌లో జోష్

-ప్రజాప్రతినిధులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చిన ఎంపీ కవిత
-ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటుతామని ప్రకటించిన నేతలు
-బంపర్ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని వెల్లడి
-కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపిన మంత్రి వేముల సన్మాన సభ

ఇందూరు టీఆర్‌ఎస్‌లో నయా జోష్ కనిపిస్తున్నది. ఎంపీ కల్వకుంట్ల కవిత కృషి ఫలితంగా జిల్లాలోని ముఖ్యనేతలంతా ఒకే వేదిక మీదికి వచ్చారు. ఇది నాయకులు, కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం నింపింది. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సన్మాన సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారీగా టీఆర్‌ఎస్ శ్రేణులు హాజరయ్యారు. ఈ వేదికగా జిల్లా నేతలంతా తమ ఐక్యతను చాటారు. నిజామాబాద్ పార్లమెం టు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నీ తానై వ్యహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లా నేతలందరినీ మరోమారు ఒక్కతాటిపైకి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీ కవిత తన కు అక్కగా అన్నీతానై దగ్గరుండి ఈ కార్యక్రమాలను చూసుకున్నారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కండ్లు చెమర్చాయి. గొంతు జీరబోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం గంభీరంగా మారింది. ఊపిరున్నంత వరకు సీఎం కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి వెన్నంటి ఉంటానన్నారు. నాలుగు లక్షల మెజార్టీతో ఎంపీ కవితను గెలిపించుకుకోవడమే ధ్యేయంగా సమిష్టిగా కృషి చేస్తామని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సభలో హర్షద్వానాలు మిన్నంటాయి.

జిల్లాపై ప్రేమకు అద్దంపట్టిన ప్రసంగం
ఈ సభలో ఎంపీ కవిత ప్రసంగం జిల్లా ప్రజలపై ఉన్న ప్రేమ, ఆప్యాయతలకు అద్దం పట్టిం ది. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఏమిచ్చినా రుణం తీరదని ఆమె పేర్కొన్నారు. జిల్లాలోని పలు సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. ఎర్రజొన్న రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎర్రజొన్న రైతులు ఆందోళన చెందవద్దని, రెచ్చగొట్టేవారి మాటలను పట్టించుకోవద్దని కోరారు. ప్రభు త్వం, ప్రజాప్రతినిధులంతా రైతుల వెంట న డుస్తామని స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం రైతులను ఎలా ఆదుకున్నదో.. రైతులను ఎవరు రెచ్చగొడుతున్నారో వివరించారు. 20 08 నాటి ఎర్రజొన్నల బకాయిలు రూ.11 కోట్లు చెల్లించింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, రైతులు అడుగకున్నా మద్దతు ధర ప్రకటించి రూ.150 కోట్లు ఖర్చుచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇదే తరహాలో రైతులకు అండగా ఉంటామని చెప్తూనే.. కాంగ్రెస్ నాయకులు ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కోసం రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులను ఎలా ఆదుకుంటున్నామో వివరించారు. బిడ్డకన్నా రైతుల గురించే ఎక్కుగా ఆలోచించే నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పడం ద్వారా అన్నదాతలపై ప్రేమను కండ్లముందుంచారు. రైతులకు నష్టం కలిగే పరిస్థితులు ఉంటే వెంటనే స్పందిస్తారని చెప్పడం ద్వారా.. ఎర్రజొన్న రైతులకు స్పష్టమైన భరో సా ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన రైతులం తా హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి సైతం ఎలాంటి నష్టం వాటిల్లకుండా సీఎం కేసీఆర్ సరైన సమయంలో పరిష్కారం చూపుతారని హామీ ఇవ్వడంతో వారికి వెయ్యేనుగుల బలం వచ్చినట్టయింది. ఇలా నేతలంతా ఒకేవేదిక మీదికి వచ్చి చేసిన ప్రసంగాలు జిల్లా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతిన
వేదికపై ప్రసంగించిన నేతలందరూ తా ము ఐక్యంగా ఉన్నామని చాటుతూనే.. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలనే ప్రత్యక్ష సంకేతాలను కార్యకర్తలకు, నాయకులకు అందించారు. ఎంపీ కవిత వల్లే ఇందూరులో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసిందని, కంచుకోటగా మారిందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ ఎన్నికల సమయంలో తమ నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి న మెజార్టీకి మూడొంతులు ఎక్కువగా వచ్చేలా కష్టపడుతామన్నారు. ఎంపీ కవితను బంపర్ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుక ఇస్తామని ప్రకటించారు. మా జీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపీ కవిత ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని చెప్పారు. జిల్లాకు పెద్దదిక్కుగా నిలిచి అ న్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారని మిగ తా వక్తలు కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. ఇలా నేతల ప్రసంగాలు కార్యకర్తల్లో కొత్త ఊపును తీసుకొచ్చింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.