Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇన్‌టేక్‌వెల్స్‌కు త్వరలో టెండర్లు

వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల వద్ద చేపట్టాలని నిర్ణయించిన ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని, ఈ వేసవి ముగిసేనాటికి నిర్మాణాలు పూర్తిచేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేశామని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం వేమునూరు వద్ద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటుచేసే ఇన్‌టేక్‌వెల్‌ను ఆదివారం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్ తదుపరి కుక్కల గూడూరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు.

KTR-addressing-in-Karimnagar-district

-వాటర్‌గ్రిడ్ కింద నిర్మాణాలు -సీఎం వాగ్దానాన్ని అమలు చేసి తీరుతాం -కరీంనగర్ జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ రాబోయే మూడు మూడున్నరేండ్లలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాటను నేరవేర్చే దిశగా గ్రామీణ నీటిసరఫరా విభాగం కేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రాజెక్టు సైట్ వద్ద నిర్మించనున్న ఇన్‌టేక్‌వెల్స్‌కు ఎటువంటి అంతరాలు లేకుండా చూస్తున్నట్లు, ప్రాజెక్టులు నిండినా, నీరు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని పూర్తిచేసుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మొత్తంగా వాటర్‌గ్రిడ్‌కు దాదాపు రూ.30వేల కోట్ల వ్యవయం అవుతుందని, కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం నియోజకవర్గాలకు సంబంధించి వాటర్‌గ్రిడ్ కింద ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణ అంచనాలు ఒకటి రెండు రోజుల్లో వస్తాయని అన్నారు. వాటర్‌గ్రిడ్ కింద తెలంగాణలో హైదరాబాద్ కార్పొరేషన్ మినహాయిస్తే అన్ని కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు, పంచాయతీలకు నీరు అందిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.

కేసీఆర్ దమ్మున్న సీఎం.. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తారని, కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలు పూర్తయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా.. వచ్చే నాలుగేళ్లలో ఇంటింటికి తాగునీరు అందించకపోతే రాబోయే ఎన్నికల్లో ఓట్లు కూడ అడగబోమని చెప్పిన దమ్మున్న నాయకుడని మంత్రి కేటీఆర్ అన్నారు. అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించి చూపించిన కేసీఆర్.. అదేవిధంగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును కూడా పూర్తిచేసి తీరుతారని చెప్పారు. ఆడబిడ్డలెవ్వరూ మంచినీటికోసం కిలోమీటర్లు దూరం నడిచిపోయే పరిస్థితి ఉండవదన్న ఉద్దెశంతోనే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తున్నదని, గతంలో రూ.200, రూ.500గా ఉన్న పింఛన్లను భారీగా పెంచిందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, వారి కోసమే టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలను కూడా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రతిపక్షాల మోసపు మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

కేసీఆర్‌కు తెలంగాణ సాధనలో అండగా నిలిచినట్లే బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో మంత్రులతోపాటు ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సత్యనారాయణ, మనోహర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈదశంకర్‌రెడ్డి, గంగుల అశోక్, కట్ల సతీశ్, జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్, జాయింట్ కలెక్టర్ పౌసుమీబసు ఇతర అధికారులు పాల్గొన్నారు.

కొమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగుతాం నమస్తే తెలంగాణ ప్రతినిధి, మంచిర్యాల: ప్రభుత్వం కొమురం భీం స్ఫూర్తితో ముందుకు సాగుతున్నదని, జల్.. జంగల్.. జమీన్ నినాదాన్ని అమలు చేస్తున్నదని పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతిపక్షాలు అవాకులు, చెవాకులు పేలుతున్నాయని కాంగ్రెస్, టీడీపీ నాయకులు బంగారు తెలంగాణను అడ్డుకునేందుకే ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. 60 ఏండ్లుగా వదిలిపెట్టిన గబ్బును తాము కడిగేస్తామని స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాలకు నిధులకు కొరత లేదని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మొదట చెన్నూర్ మండలంలోని సోమనపల్లికి చేరుకున్న కేటీఆర్.. వాటర్ గ్రిడ్ కోసం ఎంపిక చేసిన ఎల్‌మడుగును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈటెలతో కలిసి బోట్‌లో విహరించారు. అక్కడ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి అక్కడ పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆయన కొమురం భీం ప్రాజెక్టును, ఎల్లంపల్లి ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.

ఈ పర్యటనలో ఆయనతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, ఎంపీలు గడెం నగేశ్, బాల్క సుమన్, పార్లమెంటరీ కార్యదర్శి కోవ లక్ష్మి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్, తూర్పు జిల్లా మహిళా అధ్యక్షురాలు అత్తె సరోజ, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, మంచిర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ పసుల సునితారాణి, టీఆర్‌ఎస్ జిల్లా మహిళా కార్యదర్శి కుందారపు శంకరమ్మ, నాయకులు బుజ్జన్న, తదితరులుపాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.