Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇంటింటా గులాబీ..

-నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విస్తృత ప్రచారం
-ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ
-ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ముందుకు

ఇంటింటా గులాబీ ప్ర చారం జోరుగా సాగుతున్నది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు గా ఖరారైనవారు వారివారి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ప్రభు త్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇం టింటా వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆదరించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి మరోసారి తనను ఆశీర్వదించాలని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజలను కోరారు. కోటగిరి మండలంలో ప్రచారం చేసిన మంత్రి గడిచిన నాలుగేండ్లలో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలన్నారు. నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా నగరంలో ఇంటిం టా ప్రచారం నిర్వహించారు. బాల్కొండ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డికి అంక్సాపూర్ వాసులు అండ గా ఉంటామని మద్దతు ప్రకటించారు.

ప్రజా సంక్షేమమే టీఆర్‌ఎస్ లక్ష్యం.. సీఎం కేసీఆర్ సర్కార్ కులవృత్తులకు పెద్దపీట వేసిందని మంత్రి లకా్ష్మరెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ము దిరెడ్డిపల్లిలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ఠామహోత్సవానికి హాజరయ్యా రు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీ బండ ప్రకాశ్, తాజామాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్‌కు అండగా ఉండి, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో ప్రచారం చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ అభ్యర్థి హన్మంత్‌షిండే జుక్కల్ మండలం కెమ్రాజ్‌కల్లాలి, మమ్దాబాద్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షాలు ప్రజలను ఆగం చేస్తున్నాయని, వాటి మాయలో పడొద్దని మంత్రి జోగు రామన్న సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిక్షా కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ సర్కార్ కృషిచేస్తున్నదని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ అభ్యర్థి బాల్క సుమన్ కోటపల్లి మండలం వెంచపల్లిలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ కూటమి కుట్రలను పటాపంచలు చేసి సీఎం కేసీఆర్ చేతిలో మరోసారి రాష్ర్టాన్ని పెట్టాలని కోరారు. దండేపల్లి మండలం ముత్యంపేట, కొర్మిచెల్మ గ్రామాల్లో మంచిర్యాల అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అభ్యర్థి, మంత్రి ఈటల రాజేందర్ జమ్మికుంటలో ప్రచారం నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య సంఘం, భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ మండలం నేదునూర్, మక్తపల్లిలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మక్తపల్లి గ్రామస్థులు టీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామని మద్దతు తెలిపారు.

ముడుపుతో పాదయాత్ర.. ధర్మపురి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామం నుంచి ధర్మారం మండల కేంద్రం వరకు 13 కిలోమీటర్లమేర టీఆర్‌ఎస్‌వై, టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు పాదయాత్ర చేశారు. మార్గమధ్యంలో ఖిలావనపర్తి శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఆలయం, ధర్మారంలోని అయ్యప్పస్వామి ఆలయంలో కేసీఆర్ సీఎం కావాలని ముడుపులు కట్టారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి మారెడుగొమ్మ పంచాయతీలో ప్రచారం చేపట్టారు. రామగుండం అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ జనగామలో ఎన్నికల ప్రచా రం చేశారు. ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ రఘునాథపాలెం మండలంలో, మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఇల్లూరులో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య టేకులపల్లి మండలంలో, అశ్వారావుపేట అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు ములకలపల్లి మండలంలో ప్రచారం చేశారు. కొత్తగూడెం జి ల్లా చుంచుపల్లి మండలం హౌసింగ్‌బోర్డు కాలనీ, రాంనగర్‌లో కొత్తగూడెం టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇం టింటికీ వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యాపేట అభ్యర్థి, మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఆత్మకూర్(ఎస్) మండలం దాచారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. మునుగోడు అభ్యర్థి కూ సుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి చౌటుప్పల్, జైకేసారంలో ప్రచారం చేశారు. నకిరేకల్ అభ్యర్థి వేముల వీరేశం కేతేపల్లి మండలం కాసనగోడు, బొప్పారం గ్రామా ల్లో ప్రచారం చేశారు.మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావు వెంకటాద్రి పాలెంలో ప్రచారం నిర్వహించారు. నాగార్జున సాగర్ అభ్యర్థి నోముల నర్సింహయ్య నిడమనూరు మండలం ఎర్రగూడెం, మాడ్గులపల్లి మండలం గార్లకుంటపాలెంలో పార్టీ జెండాలు ఆవిష్కరించి ప్రచారం చేశారు. తుంగతుర్తి అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్ సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో టీఆర్‌ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్‌తండాలో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ఎన్నికల ప్రచా రం చేపట్టారు. భూపాలపల్లి అభ్యర్థి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మండలంలోని కొత్తపల్లి (ఎస్‌ఎం), దూద్‌పల్లి గ్రామాల్లో ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక పార్టీలన్నీ మహాకూటమిగా ఒక్కటయ్యాయన్నారు. జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పట్టణంలోని పలువార్డుల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చే శారు. చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు స్టేషన్‌ఘన్‌పూ ర్ అభ్యర్థి రాజయ్యకు మద్దతు తెలిపారు. హన్మకొండలోని ఆయన నివాసానికి వెళ్లి అండగా ఉంటామ ని తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలో హుస్నాబాద్ అభ్యర్థి వొడితల సతీశ్‌కుమార్ ప్రచారం చేశారు. పరకాలలో టీఆర్‌ఎస్ అ భ్యర్థి గెలుపు ఖాయమని మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి అన్నారు.

పాదయాత్రగా కుత్బుల్లాపూర్ అభ్యర్థి.. మేడ్చల్ జిల్లా ఉప్పల్ అభ్యర్థి బేతి సుభాశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి కోరారు. కాప్రా డివిజన్‌లో టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి విస్తృత ప్ర చారం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకం గా కొనసాగాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు సూచించారు. కుత్బుల్లాపూర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ ప్రచారం నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరా గా కేఎంజీ గార్డెన్స్ నుంచి చింతల్, శ్రీనివాస్‌నగర్, సంజీవయ్యనగర్, వాజ్‌పాయినగర్, పద్మానగర్ రిం గురోడ్డు, పాపయ్యయాదవ్‌నగర్, రాంరెడ్డినగర్, గ ణేశ్‌నగర్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భం గా 12 టీఆర్‌ఎస్ జెండాలను ఆవిష్కరించారు. చే వెళ్ల అభ్యర్థి కాలె యాదయ్య శంకర్‌పల్లి మండలం మహాలింగాపురం, గాజులగూడ, లకా్ష్మరెడ్డిగూడ గ్రామాల్లో జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రతిపక్షాల మాటలు విని మోసపోకుండా, టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని ఓటర్లకు సూచించారు.

కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మొద్దు: -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌పై కాంగ్రెసోళ్లు అవాకులూ చెవాకులూ పేలుతున్నారని, వారి మాటలన్నీ ఉత్తవేనని, ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి మం త్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గడిచిన నాలుగేండ్లలో సీఎం కేసీఆర్ సుపరిపాలన అందించారని కొనియాడారు. తెలంగాణలో ప్రజలంతా గర్వంగా తలెత్తుకుని బతుకుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని, కేసీఆర్ సీఎం కావ డం తథ్యమన్నారు. పినపాక నియోజకవర్గం భవిష్యత్‌లో పారిశ్రామిక కేంద్రంగా మారనున్నదని తెలిపారు. పాయం వెంకటేశ్వర్లు గెలుపు ఖాయమైందని, భారీ మెజార్టీకి కృషిచేయాలని శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, భద్రాచలం అభ్యర్థి తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.