Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇంటింటికీ సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో రానున్న ఐదేండ్లలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని, ఇందులో భాగంగా కాకతీయులు, రెడ్డిరాజుల నాటి 45 వేల గొలుసుకట్టు చెరువులను రూ.10వేల కోట్లతో పునరుద్ధరిస్తున్నామని డిప్యూటీ సీఎం డాక్టర్ టీ రాజయ్య పేర్కొన్నారు. ఆదివారం వరంగల్‌లోని హరిత హోటల్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్‌ను రూ.లక్ష కోట్లతో ప్రవేశపెట్టామని తెలిపారు. గ్రామీణ, ఆర్ అండ్‌బీ రోడ్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. వచ్చే నాలుగేండ్లలో ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటిని అందించే బృహత్తరమైన ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదన్నారు.

-ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు -పది జిల్లాలకు రూ.లక్ష కోట్ల బడ్జెట్: డిప్యూటీ సీఎం రాజయ్య

Deputy-CM-Rajaiahటీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ టూ పీజీ విద్యను అమలు చేయనున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అర్హులందరికీ పింఛన్లు అందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో 29.61లక్షల పింఛన్లు ఉండగా ప్రస్తుతం వాటితోపాటు అదనంగా మరో రెండు లక్షల పింఛన్లు అందిస్తామన్నారు. 50 ఏండ్లు నిండిన చేనేత, గీత కార్మికులతోపాటు గిరిజనులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చానని స్పష్టంచేశారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించామన్నారు. ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ 14 ఏండ్ల తర్వాత బీటీ రోడ్లకు రూ.1,767 కోట్లతో బీటీ రెన్యువల్ చేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆర్‌అండ్‌బీకి రూ.500 కోట్లు విడుదల చేశారన్నారు. జిల్లా కేంద్రం నుంచి ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమోస్తదన్నారు.. కానీ విడిపోతే బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.

జిల్లాలో 40 శాతంపైగా పట్టభద్రులు ఉన్నందున ఎమ్మెల్సీ టికెట్ జిల్లాకే ముఖ్యమంత్రి కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ టీడీపీ, బీజేపీలు ఏపీతోపాటు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నా తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకరాకపోగా అవాంతరాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ఎమ్మె ల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ టికెట్ వరంగల్‌కే కేటాయించాలన్నారు.

2001 నుంచి ఉద్యమంలో ముందుండి పోరాడిన టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డికి జిల్లా నుంచి టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.