Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఇంటిపార్టీ టీఆర్‌ఎస్..

తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా టీఆర్‌ఎస్‌ను ఇంటిపార్టీగా భావిస్తున్నారని నూతనంగా ప్రమాణం చేసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభివృద్ధి ప్రదాతగా, రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్దిదిద్దే గొప్ప నేతగా ఆరాధిస్తున్నారని వారన్నారు. నిన్నటి వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో అఖండ విజయం నుంచి నేటి శాసనమండలి ఎన్నికల వరకు టీఆర్‌ఎస్ సాధించిన అప్రతిహత విజయాలు కేసీఆర్ ప్రభుత్వ అద్భుత పనితీరుకు నిదర్శనమని అభివర్ణించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోకూడా ఘన విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తంచేశారు. రాష్ట్ర శాసనమండలికి స్థానికసంస్థల కోటాలో ఎన్నికైన 10మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు గురువారం మండలి సభ్యులుగా ప్రమాణం స్వీకరించారు. జూబ్లీహాల్‌భవనంలోని దర్బార్‌హాల్‌లో ఉదయం 10.30గంటలకు మండలి చైర్మన్ కే స్వామిగౌడ్ వీరితో ప్రమాణం చేయించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. -ప్రజారంజక పాలన వల్లే అఖండ విజయం -కేసీఆర్ నాయకత్వం కొత్త శకానికి నాంది -నూతన టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల స్పష్టీకరణ -జూబ్లీహాలులో ఘనంగా ప్రమాణం -మండలి స్థానాల భర్తీ పరిపూర్ణం: స్వామిగౌడ్ -మండలిలో 29కి చేరిన టీఆర్‌ఎస్ బలం

TRS-MLC's

అమరవీరులకు నివాళులర్పించి.. ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. తర్వాత పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్‌కు చేరుకోగా మండలి చైర్మన్ కొత్త సభ్యులతో విడివిడిగా ప్రమాణం చేయించారు. వీరిలో పురాణం సతీష్(ఆదిలాబాద్), భూపతిరెడ్డి(నిజామాబాద్), భానుప్రసాద్ (కరీంనగర్), నారదాసు లక్ష్మణ్‌రావు (కరీంనగర్), భూపాల్‌రెడ్డి (మెదక్), పట్నం నరేందర్‌రెడ్డి (రంగారెడ్డి), సుంకరి రాజు అలియాస్ శంభీపూర్‌రాజు (రంగారెడ్డి), కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్), కొండా మురళి (వరంగల్), బాలసాని లక్ష్మీనారాయణ (ఖమ్మం) ఉన్నారు. నూతన సభ్యులను అభినందించిన చైర్మన్ స్వామిగౌడ్ వారికి శాసనసభ, శాసనమండలి నియమావళి పుస్తకాల కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమానికి మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు కే తారకరామారావు, ఈటల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ధర్మపురి శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్కసుమన్, కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ రాజా సదారాం, డిప్యూటీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, సహాయ కార్యదర్శి దుర్గ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కేసీఆర్ విధానాలే గెలిపించాయి ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన నేతలు అనంతరం టీఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ విధానాలు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల వల్లే తాము గెలిచామని ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. ప్రభుత్వ పనితీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పట్టం కడుతున్నారని చెప్పారు. శాసనమండలిలో ఎన్నికల్లో ఆరు స్థానాలు ఏకగ్రీవం కావటం, 12 స్థానాల్లో 10 స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకోవటం ప్రజలకు కేసీఆర్‌పై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. నూతన ఎమ్మెల్సీలమంతా కేసీఆర్‌ను సంప్రదించి ఎంపీల సహకారంతో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిని కలుస్తామని, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రావాల్సిన స్థానిక సంస్థల నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర ప్రగతి తప్ప మరో అజెండా లేదని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. కేసీఆర్ సమాజ స్వార్థపరుడు, తెలంగాణ పక్షపాతి. ఆయన వేసే ప్రతి అడుగు అదే దిశలో ఉంటుంది అని ప్రశంసించారు.

ఆయన రాజనీతిజ్ఞుడే కాదు, రాజ పరిశోధకుడిలా పనిచేస్తున్నారని అభివర్ణించారు. ప్రభుత్వానికి, ప్రజలకు, స్థానిక సంస్థలకు మధ్య వారథిగా పనిచేస్తామని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఒకసారి, తెలంగాణ వచ్చిన తర్వాత మరోసారి తనకు ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమాజం మొత్తం టీఆర్‌ఎస్‌ను తమ పార్టీగా భావిస్తున్నదని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులనుసైతం నిలపలేని దుస్థితిలో ప్రతిపక్షాలున్నాయన్నారు. తొలినుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న తనుకు, శంభీపూర్‌రాజు, నారదాసు లక్ష్మణ్‌రావులకు ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చి సీఎం తమకు ఎనలేని గౌరవాన్ని ఆపాదించారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా ఉంటుందని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికలోనే నిజామాబాద్ జిల్లాలో అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో టీఆర్‌ఎస్ చరిత్ర సృష్టించిందని చెప్పారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.