Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జలమే జీవం పొదుపే మంత్రం

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆలోచించినప్పుడే.. గోదావరి నీటిని ప్రతిపొలానికి, ఇంటింటికీ చేర్చేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచించారు. ఇందులో భాగంగానే మిషన్‌ భగీరథను, మిషన్‌ కాకతీయను చేపట్టారు. నాలుగు విడతల మిషన్‌ కాకతీయతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 శాతం చెరువుల పునరుద్ధరణ జరిగింది. నీళ్లు వస్తే నిల్వ చేసుకోవడానికి వీలుగా వాటిని తీర్చిదిద్దారు. అంతేనా, చెరువులకు, కాల్వలకు అనుసంధానం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించారు.

చరాచర జగత్తుకు హేతువు నీరే. జగతు ్తఆవిర్భావానికి తొలి బీజం నీటి నుంచే పడింది. అందుకే, నీరు మనిషికి పుట్టిల్లులాంటిది. ఆనీటి విషయంలోమనిషి ఎప్పుడూ గౌరవ భావాన్ని ప్రదర్శించాలి. జలసంరక్షణలో, వినియోగంలోసర్వదా జాగ్రత్త వహించాలి. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి పంచభూతాలు. ఈఐదింటిలోనూ మళ్లీ నీటికే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. జీవుల మనుగడకు నీరుప్రాణాధారం కావడమే ఇందుకు కారణం. ఇప్పుడు తెలంగాణ మనుగడకూ ఆనీరే ప్రాణాధా రం. తెలంగాణలో పోరగాండ్లు చెరువుల్లో దుంకుతుంటే.. ఈతలు కొడుతుంటే నాప్రాణం గాల్లో తేలిపోయింది. నాకేకాదు.. ప్రతిఒక్కరిలోనూ ఇదే భావన. ఇందుకు కారణం నీటికి, మనిషికి ఉన్న అవినాభావ సంబంధమే. మనశరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. మన భూమి మీద కూడా 71 శాతం నీరే. అందుకే నీరుఎక్కడ కనిపించినా మన ఒళ్లు పులకరిస్తుంది. కాల్వలోకి నీరు వస్తే ఈత కొట్టాలని అనిపిస్తుంది. నదులు, సముద్రాల వద్దకు విహారానికి వెళ్లాలని అనిపిస్తుంది. ప్రాజెక్టుల గేట్లు తెరిస్తే పెద్దఎత్తున వెళ్లి ఆనీటి ప్రవాహాన్ని ఆస్వాదించాలని అనిపిస్తుంది. ప్రాజెక్టుల నుంచి నీరు ఎగిరి దుంకుతుంటే మన గుండె ఆనందంతో పరవశిస్తుంది. ఇందుకు కారణం.. నీరు మనిషికి జీవనాధారం కావడమే.

నెరవేరిన నీటి కల: ఒక్కసారి తెలంగాణ ఉద్యమ సమయానికి వెళదాం. మన ఉద్యమ నినాదంలో ప్రధానమైనది కూడానీళ్లే. అప్పట్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఎడారిని తలపించేది. శ్రీరాంసాగర్‌ ఆయకట్టు ఎడారిగా మారిపోయింది. చివరి ఆయకట్టు భూములు సాగుపై ఆశలను ఎప్పుడో వదిలేసుకున్నాయి. తలాపునే గోదావరి పారుతున్నా సాగుకుచుక్క నీరులేని దుస్థితి. సాగుకు మాత్రమే కాదు తాగు నీటికీ ఇబ్బందులే. మన ఆడబిడ్డలు కిలోమీటర్లకు కిలోమీటర్లు వెళ్లి బిందెడునీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడో..? మన ఇంట్లోకే నల్లా నీరు వస్తున్నది. మన పొలానికే గోదావరి నీరు వస్తున్నది. మన చెరువుల్లో కృష్ణమ్మ బిరబిరా పరుగులు తీస్తున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా ఇప్పుడు సస్యశ్యామలమైంది. ఆ జిల్లాలో మొత్తం మీద 7480 చెరువులు ఉంటే.. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమాఎత్తిపోతల పథకాల పరిధిలోని దాదాపు 2500 చెరువుల్లో ఇప్పుడు నీళ్లు దుంకుతున్నాయి.

ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సీంఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా నీటిపైనే దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను సవరిస్తూ తెలంగాణ అవసరాలకు అనుగుణంగా సరికొత్తగా డిజైన్‌ చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం ఒక్క కాళేశ్వరం సాగు నీటి పథకానికే ఏడాదికి రూ.25 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ, అత్యుత్తమ యంత్రాలను తీసుకొచ్చి, దేశానికే ఆదర్శంగా కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు పూర్తిచేశారు.

చరిత్రలో తొలిసారిగా రెండో పంటకూ నీటికి ఇబ్బందిలేని పరిస్థితి అక్కడ నెలకొంది. జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, రాజోలిబండ కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుల పరిధిలో 1152 చెరువులు ఉంటే ఇప్పటికే వాటిలో 970 చెరువులను నింపేశారు. శ్రీరాంసాగర్‌, ఎఎంఆర్‌పి, నాగార్జునసాగర్‌, ఆసిఫ్‌ నహర్‌, మూసి, డిండి ప్రాజెక్టుల పరిధిలో 496 చెరువులు ఉంటే 378 చెరువులను నింపేశారు. దేవాదుల పథకం 492 చెరువులు ఉంటే 327 చెరువులను నింపడం జరిగింది. శ్రీరాంసాగర్‌ కొన్ని దశాబ్దాల తర్వాత నీటితో కళకళలాడుతున్నది. శ్రీరాంసాగర్‌ రెండో దశ ఆయకట్టు పరిధిలో 644చెరువులు ఉంటే వాటిలో 593 చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. దశాబ్దాల తర్వాత రెండోపంటపై రైతులకు ఆశ ఏర్పడింది. చివరి ఆయకట్టు భూముల్లోనూ బంగారు పంటలు పండుతున్నాయి. పరిశ్రమలకు 24 గంటలూ నీటి సరఫరా జరుగుతున్నది. హైదరాబాద్‌ రోజు విడిచి రోజుఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఇంటిమధ్య నల్లాలోకే వస్తున్నాయి. మొన్న వర్షకాలం వచ్చిన వరదల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దాదాపు 30 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు.

ఆ నీటితో ఉత్తరతెలంగాణలోని దాదాపు చెరువులన్నింటినీ నింపేశారు. చాలా చెరువులు అలుగులు పోస్తున్నాయి. దాంతో, ఇప్పుడు తెలంగాణలోఎక్కడ చూసినా జలం.. జీవం. తెలంగాణలోని దాదాపు 80 శాతం చెరువులను కృష్ణా, గోదావరి జలాలతోనింపేశారు. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా బెసిన్ల పరిధిలో చెరువులను నింపే ప్రక్రియ 13 జనవరి నాటికి ఇట్లా ఉంది.ఇందుకు కారణం మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ దూరదృష్టి, దార్శనికత. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత సీంఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా నీటిపైనే దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులను సవరిస్తూ తెలంగాణ అవసరాలకు అనుగుణంగా సరికొత్తగా డిజైన్‌ చేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం ఒక్క కాళేశ్వరం సాగు నీటి పథకానికే ఏడాదికి రూ.25 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ, అత్యుత్తమ యంత్రాలను తీసుకొచ్చి, దేశానికే ఆదర్శంగా కాళేశ్వరం ప్రాజెక్టును దాదాపు పూర్తిచేశారు. ఒక పని చేసేటప్పుడు విమర్శకులు, సమర్థకులూ ఉంటూనే ఉంటారు. మనం వెళ్లే దారి మంచిది అయినప్పుడు, పదుగురికి మంచి చేసేది అయినప్పుడు విమర్శల గురించి పట్టించుకోకూడదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఇదే భావనతో విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగిపోయారు.

కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం ఇదే ప్రాజెక్టులు కట్టిన తర్వాత గోదావరి నీరు నేరుగా ఇంటింటికీ రావాలంటే.. ఆయకట్టుకు చివర ఉన్న భూములకు కూడా చేరాలంటే.. అందుకు తగిన ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలి. కాళేశ్వరం ప్రాజె క్టు గురించి ఆలోచించినప్పుడే.. గోదావరి నీటిని ప్రతిపొలానికి, ఇంటింటికీ చేర్చేందుకు కూడాముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచించారు. ఇందులో భాగంగానే మిషన్‌ భగీరథను, మిషన్‌ కాకతీయను చేపట్టారు. నాలుగు విడతల మిషన్‌ కాకతీయతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 శాతం చెరువుల పునరుద్ధరణ జరిగింది. నీళ్లు వస్తే నిల్వ చేసుకోవడానికి వీలుగా వాటిని తీర్చిదిద్దారు. అంతేనా, చెరువులకు, కాల్వలకు అనుసంధానం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించారు. ధ్వంసమైన తూములను ఎక్కడికక్కడ మళ్లీ నిర్మించారు. ఇంకా నిర్మిస్తున్నారు. అటు చెరువులు సిద్ధమయ్యాయి. ఇటు తూములు ఏర్పడ్డాయి. వాటికి అనుసంధానంగా కాల్వలు సిద్ధమయ్యాయి. అందుకే, ఇప్పుడు గోదావరి, కృష్ణా నీళ్లు వచ్చిన వెంటనే చెరువులు నింపేశారు. ఇక అక్కడి నుంచి పొలాలకు చేరవడమే తరువాయి.

నిజానికి, తెలంగాణలో సాగంతా వర్షాధారమే. రెండోపంటను నీటి ఆధారంగా వేసే పరిస్థితి ఎన్నడూ లేదు. కానీ, ఇప్పుడు తొలిసారిగా రెండోపంట కూకావాల్సినంత నీరు ఇప్పుడు మన చెరువుల్లోనే నిల్వ ఉంది. కాకతీయ రాజుల పాలన తర్వాత ఇది తెలంగాణ ప్రాంత చరిత్రలోనే ఓ అద్భుతఘట్టం. అటు ఈఏడాది మంచి వర్షాలు కురిశాయి. ఇటు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు నిండాయి. దాంతో, గతానికి భిన్నంగా భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. ఒక్కఏడాదిలోనే భూగర్భ జలమట్టం 3.56 మీటర్లు పెరగడం ఇది మరో అద్భుతం. అలాగే, గత పాలనలో నల్లానీళ్లు కొన్ని ప్రాంతాలకే పరిమితం. హైదరాబాద్‌ లోనూ రెండు మూడురోజులకోసారి మంచి నీళ్లు వచ్చే పరిస్థితి. కానీ, మిషన్‌భగీరథతో ఇప్పుడు పరిస్థితి మారింది. గోదావరి నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లిలో నిల్వ ఉంచుకుంటున్నాం. అక్కడి నుంచి రాష్ట్రమంతటా ఎక్కడికైనా ఎన్ని నీళ్లు కావాలంటే అన్నినీళ్లను సరఫరా చేసుకునే వెసులుబాటు మనకు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో, దార్శనికతతో చేపట్టిన మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ కారణంగా ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచి నీరు వస్తున్నది. ప్రతి పొలానికి సాగు నీరు అందుతున్నది.

వృథా చేస్తే వృథా ప్రయాసే: భవిష్యత్తులో కేవలం నీటి కోసమే ప్రపంచయుద్ధాలు వస్తాయని ఇప్పటికే నిపుణులు తేల్చిచెబుతున్నారు. దక్షిణాఫ్రికా ఖండం మొత్తాన్ని నీటి సంక్షోభం పట్టిపీడిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా 85 కోట్లమందికి అసలు తాగడానికి నీళ్లేలేవు. సురక్షిత నీరు లేనికారణంగా ప్రపంచంలోప్రతిరోజూ ఐదేళ్లలోపు ఉన్న చిన్నారులు 800 మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లోని 180 కోట్ల మంది ప్రజలు సమీప భవిష్యత్తులోనే తాగునీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడనున్నారు. భూమిమీద 71 శాతం నీరు ఉన్నా.. అందులో తాగడానికి పనికి వచ్చేది కేవలం 2.5 శాతం మాత్రమే. ఇందులోనూ కేవలం ఒక్కశాతం మాత్రమే ప్రజలకు అందుబాటులోఉంటున్నది. మిగిలిన మంచి నీరంతా హిమనీనదాలు, మంచుకొండల్లోనే నిక్షిప్తమై ఉంది. ఇంత పరిమితమైన నీటి వనరులు కూడా ఉష్ణతాపంతో ఆవిరయిపోతూ ఉంటాయి. విచ్చలవిడిగా వాడితే వృథా అయిపోతాయి.

నీటితోనే భవిష్యత్తు అని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కష్టనష్టాలకు, విమర్శలకు ఓర్చి సాగు నీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నది. ఇందుకు కొన్నివేల కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు.. తెలంగాణ భవిష్యత్తు కోసం రైతులూ ఎంతో త్యాగం చేశారు. రాష్ట్ర ఉమ్మడి అవసరాల కోసం వాళ్లు తమ భూములను ఇచ్చారు. ఆభూములు, అక్కడి ఇళ్లు, ప్రజలతో ఉన్న అనుబంధాలను త్యాగం చేశారు. ఇంత ప్రణాళికాబద్ధంగా కష్టపడితే ఇప్పుడు నీళ్లు మన దగ్గరకు వచ్చాయి. ఇప్పటివరకూ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. ఇక, దానిని కొనసాగించాల్సిన వంతు మనదే. నీటిని వృథా చేయకుండా కాపాడుకోవడమే మన కర్తవ్యం. ప్రతినీటి బొట్టునూ సద్వినియోగం చేయడమే మన పరమ ధర్మం. నీటిని ఎక్కడా వృథాగా పోనివ్వవద్దు. ఉదాహరణకు, మీఊళ్లో ఒక నల్లా నుంచి నీరు వృథాగా పోతున్నదనుకోండి. అది మన నల్లా కాదు కదా.. దాని గొడవ మనకెందుకు అని నిర్లిప్తంగా ఉండవద్దు. ఎవరో ఒకరు ఒకరూ.20 పెట్టి ఒక నల్లా తీసుకురండి.

దానికి బిగించండి. అంతకూడా ఖర్చు చేయలేరనుకో.. 10 రూపాయలు పెట్టి ఒక డమ్మీ తీసుకురండి. దానిని నల్లాకు బిగించండి. ఎవరోవచ్చి ఏదో చేస్తారని కాకుండా ఇది మన బాధ్యత అని ప్రతిఒక్కరూ భావించాలి. అలాగే, చెరువుల్లోంచి నీరు అలుగులు పోస్తున్నదనుకోండి. తూముల్లోంచి లీకేజీ అవుతున్నదనుకోండి. ఎవరి గురించో ఎదురుచూడవద్దు. లీకేజీని అరికట్టడానికి మీరే చొరవ తీసుకోండి. కొన్ని వేల కిలోమీటర్ల పైపులైన్లు వేసినప్పుడు ఎక్కడో ఒకచోట చిన్నదో పెద్దదో లోపం ఉండవచ్చు. అక్కడి నుంచి లీకేజీ రావచ్చు. అధికారుల తప్పిదంగా కాకుండా దానిని అరికట్టడం మన బాధ్యతగా తీసుకుందాం. నీటి వృథాను అరికడదాం. ఎండాకాలం వస్తే పశువులు, పక్షులు చనిపోతున్నాయి. మీకుగుర్తుందా? ఎండాకాలం వచ్చిన వెంటనే పక్షులకు ఇళ్లలో నీళ్లు పెట్టండి అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో మెసేజులు కూడాపెడుతున్నారు. గతంలోఅయితే రోడ్లపక్కన నీటితొట్లు కట్టేవారు. ఇప్పుడు వాటి అవసరమే ఉండదు. చెరువుల్లోనే నీళ్లు ఉన్నాయి. కనక, పక్షులు వాటి చెంతకే వచ్చి తాగి వెళ్లిపోతాయి. చెరువుల గట్లమీద ఉండే పళ్లను తిని, ఆపక్కనే ఉండే నీటిని తాగి సాంత్వన పొందుతాయి. అందుకే, పశుపక్ష్యాదుల నుంచి మనవరకూ ప్రతిఒక్కరి నీటి అవసరాలు తీరాలంటే నీటిని వృథా కాకుండా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత.

తెలంగాణ ప్రజలు నీటి కోసం కొట్లాడుకునే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మన చెంతకే తాగునీటిని, సాగు నీటిని తీసుకొచ్చారు. ఇందుకు వందలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జయజయహే తెలంగాణను జల జలహే తెలంగాణగా మార్చారు. యాసంగి పంటను మాత్రమేకాదు.. వేసవి అవసరాలు కూడా తీర్చేసుకుని మళ్లీ వర్షాకాలం వరకూ ఆ నీటిని కాపాడుకోవడం ఇక మనవంతు. ఇందుకు ప్రతిఒక్కరం నడుం బిగిద్దాం. మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం.

జలం పరబ్రహ్మ స్వరూపం: అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు. కానీ, జలం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఆకలిదప్పులు తీర్చేది సాక్షాత్తూ భగవంతుడి స్వరూపం కాకమరేమిటి? అందుకే, నీటిని కూడాప్రేమించాలి. నీటిని ఆదరించాలి. నీటిని గౌరవించాలి. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదా అని విచ్చలవిడిగా వృథా చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులుపడాల్సి వస్తుంది. ఇప్పుడు నీటిని వృథా చేశామనుకోండి. మనకు తాగునీరు అందించడానికి, సాగునీరు అందించడానికి ప్రభుత్వం మళ్లీ చెరువులను నింపాల్సి ఉంటుంది. అప్పుడు నీళ్లు ఉండచ్చు. ఉండకపోవచ్చు. నీళ్లు ఉంటే చెరువులను నింపడానికి విద్యుత్తు బిల్లు పేరిట మళ్లీ బోల్డంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ, నీళ్లు లేవనుకోండి. అప్పుడు ఇబ్బందులు పడేది మనమే. ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని వృథా చేస్తే అవసరమైనప్పుడు అదే నీరు మనకు దొరకకుండాపోతుంది. ఒక, నీటి లీకేజీలను అరికట్టలేదనుకోండి. విచ్చలవిడిగా పారబోశామనుకోండి. అప్పుడు కూడా ఇబ్బందులు పడేది మనమే.

ఎక్కడికక్కడ నీరు పేరుకుంటే దోమలు పెరుగుతాయి. ఇవి అసలే మంచినీటి దోమలు. వాటి కారణంగా డెంగీ వంటి రోగాలు మనల్నే చుట్టుముడతాయి. అందుకు ఆస్పత్రుల చుట్టూ తిరిగి వందలు, వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. నీరు భూమిపైవ థాగా కొట్టుకుపోయిందనుకోండి. భూసారం కూడా కొట్టుకుపోతుంది. వృక్షో రక్షతి రక్షిత: అంటారు. అంటే చెట్టును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని అర్థం. కానీ, జలం కూడా అంతే. దానిని మనం రక్షి స్తే అది మనల్ని రక్షిస్తుంది. మన అవసరాలు తీరుస్తుంది. అందుకే, నీటి ధర్మమే నేటి ధర్మం. తెలంగాణ ప్రజలు నీటి కోసం కొట్లాడుకునే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మన చెంతకే తాగునీటిని, సాగు నీటిని తీసుకొచ్చారు. ఇందుకు వందలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. జయజయహే తెలంగాణను జల జలహే తెలంగాణగా మార్చారు. యాసంగి పంటను మాత్రమేకాదు.. వేసవి అవసరాలు కూడా తీర్చేసుకుని మళ్లీ వర్షాకాలం వరకూ ఆ నీటిని కాపాడుకోవడం ఇక మనవంతు. ఇందుకు ప్రతిఒక్కరం నడుం బిగిద్దాం. మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. నీటికొరత కారణంగా ఇప్పటివరకూ ప్రతి ఊళ్లోనూ ఆర్వోల ను ఏర్పాటు చేశారు. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిద్వారా కూడా నీటి అవసరాలు తీరవచ్చు. కానీ, ఎంతశుద్ధి చేసినా భూగర్భ జలం భూగర్భ జలమే. నదీ జలం నదీ జలమే. (వ్యాసకర్త: రాష్ట్ర ఆర్థికమంత్రి) శ్రీ తన్నీరు హరీష్ రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.