Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జనం చూస్తున్నారు

-అధికారులూ జాగ్రత్త.. మర్యాదగా వ్యవహరించండి
-పేదలను కడుపులో పెట్టుకొని చూసుకోండి: సీఎం
-ప్రజల సంతోషం కోసమే రెవెన్యూ చట్టం
-ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తరహాలో సేవలందించాలి
-అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు
-రెవెన్యూ చట్టం అమలుపై దిశానిర్దేశం
-రెవెన్యూ ఉద్యోగులపై వరాల జల్లు
-ప్రమోషన్ల ప్రక్రియ పూర్తికావాలని ఆదేశం
-తాసిల్దార్లకు రెగ్యులర్‌గా కారు అలవెన్స్‌
-మండలాఫీసుల్లో సౌకర్యాలకు 60 కోట్లు

‘ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి ప్రజలే కేంద్రబిందువు. అందరూ సంతోషంగా ఉండాలన్న ఆశయంతోనే సమగ్ర అధ్యయనం చేసి సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. కొత్త చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో దానిని పక్కాగా అమలు చేయాలె. పేదలను కడుపులోపెట్టుకొని చూసుకోవాలె. ఓపికగా సమస్యలను విని పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలె’

రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న మహాసంకల్పంతోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. రెవెన్యూశాఖలో ఉన్నతాధికారులు మొదలు కిందిస్థాయి ఉద్యోగి వరకు సమిష్టిగా, సానుకూల దృక్పథంతో పనిచేస్తూ, ప్రజల్లో నమ్మకాన్ని కల్పిస్తూ ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో ఇకనుంచి స్పష్టమైన మార్పు రావాలని చెప్పారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కొత్తచట్టంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగులపై వరాలు కురిపించారు. ఉద్యోగ భద్రతతోపాటు కార్యాలయాల్లో అన్నివసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ‘ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి ప్రజలే కేంద్ర బిందువు. అందరూ సంతోషంగా ఉండాలన్న ఆశయంతోనే సంస్కరణలకు శ్రీకా రం చుట్టాం. కొత్తచట్టం ఎవరికీ వ్యతిరేకం కాదు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో దానిని పక్కాగా అమలు చేయాలె. పేదలను కడుపులోపెట్టుకొని చూసుకోవాలె. ఓపికగా సమస్యలను విని పరిష్కరించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలె’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

పూర్వవైభవాన్ని తీసుకురావాలి
ప్రజల్లో చైతన్యం పెరిగిందని, అధికారులు ఎలా మాట్లాడుతున్నారో గమనిస్తుంటారని, వారి అంచనాలకు తగినట్టుగా పోలీస్‌శాఖలో వచ్చినట్టు రెవెన్యూశాఖలోనూ మార్పు రావాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. కార్యాలయాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, సమస్యలను ఓపికగా విని పరిష్కరించాలని సూ చించారు. గతంలో బాగా పనిచేసిన ఉద్యోగుల ను ప్రజలు దేవుళ్లుగా కొలిచేవారని, మళ్లీ అలాం టి సంస్కృతిని పాదుకొల్పాలని అభిలషించారు.

రెవెన్యూ ఉద్యోగులకు వరాలు
రెవెన్యూశాఖ ఉద్యోగులపై సీఎం కేసీఆర్‌ వరా ల జల్లు కురిపించారు. ఎలక్షన్లు, ప్రకృతి వైపరీత్యా లుసహా 54 రకాల విధులను నిర్వర్తిస్తూ రెవె న్యూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని అభినందించారు. రెవెన్యూశాఖలో అన్నిస్థాయిల్లో వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. తాసిల్దార్లకు కారు అలవెన్స్‌ను రెగ్యులర్‌గా ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించారు. కార్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు రూ.60 కోట్లను మంజూరుచేస్తున్నట్లు చెప్పారు. ప్రోటోకాల్‌ సహా కార్యాలయాల నిర్వహణకు కొరతలేకుండా చూస్తామన్నారు.

ఇతరశాఖల్లో చేరేందుకు వీఆర్వోలకు ఆప్షన్లు
వీఆర్వోలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూస్తామని, ఇతరశాఖల్లో చేరేందుకు ఆప్షన్లు ఇస్తామని సీఎం చెప్పారు. విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్లలో (వీఆర్‌ఏ) ఎక్కువశాతం పేదవర్గాల వారే ఉన్నారని తెలిపారు. వారిలో వృద్ధులైనవారి పిల్లలకు ఉద్యోగావకాశం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. వీఆర్‌ఏలకు పేస్కేల్‌ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై రూ.260 కోట్ల భారం పడుతుందని, అయినామానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విధి నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రభు త్వం దృష్టికి తీసుకురావాలని, అన్నివిధాలా అం డగా ఉంటామని ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ట్రెసా ప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం హామీలపై ఉద్యోగుల్లో హర్షం
సీఎం కేసీఆర్‌ వెల్లడించిన అంశాలు, ఇచ్చిన హామీలపై ట్రెసా ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. కొత్త రెవెన్యూ చట్టానికి తాము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని, అమలులో పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తామని ముక్తకంఠంతో తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌, నాయకులు మన్నె ప్రభాకర్‌, రామకృష్ణ, బాణాల రాంరెడ్డి, దేశ్యానాయక్‌, నాగమణి, వాణీరెడ్డి, శైలజా, మా ధవి, పల్నాటి శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులు పలు సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా తాసిల్దార్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని కోరగా, అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది. అదేవిధంగా వీలైనంత త్వరగా రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.