-నిర్మాణానికి నిధులిచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెండి -కేంద్ర మంత్రి దత్తాత్రేయకురాష్ట్ర మంత్రి తుమ్మల వినతి

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లో ప్రకటించిన విధంగా రాష్ర్టానికి జాతీయ రహదారుల నిర్మాణంలో కేంద్రం ప్రాధాన్యమిచ్చేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు – భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనశాఖ సహాయ మంత్రి (స్వతంత్రహోదా) బండారు దత్తాత్రేయను కోరారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని దిల్కుషా గెస్ట్‌హౌజ్‌లో దత్తాత్రేయను తుమ్మల మర్యాద పూర్వకంగా కలిశారు. జాతీయ రహదారుల కేటాయింపు, నిధుల మంజూరులో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సందర్భంగా దత్తాత్రేయ దృష్టికి తెచ్చినట్లు భేటీ అనంతరం తుమ్మల తెలిపారు.
రాష్ట్ర విభజన బిల్లులోని షెడ్యూల్ 9లో పేర్కొన్న ఆరు జాతీయ రహదారుల నిర్మాణం త్వరగా చేపట్టిలని కోరినట్లు జడ్చర్ల-మహబూబ్‌నగర్ మధ్య ఎన్‌హెచ్-67 పై చేపట్టనున్న నాలుగు లైన్ల రహదారి స్థానంలో హైదరాబాద్ నుంచి జడ్చర్లకు నాలుగు లైన్ల రోడ్డు వేయాలని, ఎన్‌హెచ్-765, ఎన్‌హెచ్ 44 నుంచి ఆరాంఘర్ జంక్షన్ – శంషాబాద్ వెళ్లడానికి సర్వీస్ రోడ్లు, ైఫ్లె-ఓవర్, బోయిన్పల్లి నుంచి కొంపల్లి రోడ్డు నిర్మాణంలో మార్పులు చేయాలని దత్రాత్రేయను తుమ్మల కోరారు. వీటిపై కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్గడ్కరీతో చర్చించి న్యాయం జరిగేలా చూస్తానని దత్తాత్రేయ హామీ ఇచ్చినట్లు తుమ్మల వెల్లడించారు. పార్లమెంటు సమావేశల తర్వాత గడ్కరీని కలవనున్నట్లు తుమ్మల తెలిపారు.