-నిరుపేదలకు మెరుగైన వైద్యమే సర్కారు లక్ష్యం -పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు -డయాగ్నోస్టిక్ మినీహబ్ ప్రారంభోత్సవం

పేదలకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లను భవిష్యత్‌లో జిల్లా కేంద్రాలకు విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని 8 ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించామని తెలిపారు. జూబ్లీహిల్స్ శ్రీరాంనగర్‌లోని హెల్త్ సెంటర్లో డయాగ్నోస్టిక్ మినీహబ్‌ను కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్‌కు హైదరాబాద్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా సమయంలో విశేష సేవలందించిన వైద్య సిబ్బంది రుణం తీర్చలేనిదని చెప్పారు. నగర పేదలకు వైద్యసేవలను మరింత చేరువచేసే క్రమంలో పురానాపూల్, బార్కాస్, పానీపుర, జంగమ్మెట్, లాలాపేట, అంబర్‌పేట, సీతాఫల్‌మండిల్లో డయాగ్నోస్టిక్ మినీ హబ్‌లను మంత్రులు ఈటల, మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. జూబ్లీహిల్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపీనాథ్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ పాల్గొన్నారు.
కేటీఆర్ సీఎం కావాలని ఎదురుచూస్తున్నాం కేటీఆర్ సీఎం అయితే సంతోషమేనని, ఆ సమయం కోసం మంత్రులమంతా ఎదురుచూస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్‌అలీ చెప్పారు. డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు.