Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జోరుగా టీఆర్‌ఎస్ సభ్యత్వాలు

-లక్ష్యానికి మించి నమోదయ్యే అవకాశం -సభ్యత్వ నమోదులో శ్రేణుల ఉత్సాహం -మంత్రులు, ఎంపీల నుంచి ఎమ్మెల్యేల వరకు చురుకుగా సాగుతున్న ప్రక్రియ

Harish-rao-participated-in-Membership-drive-programme

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతున్నది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో నిర్ధేశించిన లక్ష్యంలో దాదాపు 60శాతంపైగా పూర్తయ్యాయి. సోమవారం మెదక్ జిల్లాలో సభ్యత్వ నమోదు కొనసాగింది. జిల్లాకు నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటికే 60 శాతం సభ్యత్వాలు నమోదయ్యాయి. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సభ్యత్వ నమోదు ప్రారంభించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, పార్టీ జిల్లా పరిశీలకులు సామ్యుల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్ వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మెదక్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, దుబ్బాకలో ఎమ్మె ల్యే సోలిపేట రామలింగారెడ్డి, పటాన్‌చెరులో గూడెం మహిపాల్‌రెడ్డి, సంగారెడ్డిలో చింత ప్రభాకర్, నర్సాపూర్‌లో మదన్‌రెడ్డి సభ్యత్వ నమోదు చేపడుతున్నా రు. అందోల్‌లో కొంత మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం. జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజక వర్గాల్లో పార్టీ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో సభ్యత్వ నమో దు కార్యక్రమం కొనసాగుతున్నది.

ఆరు రోజుల్లో లక్షా 25వేల సభ్యత్వాలు: కరీంనగర్ జిల్లాలో లక్ష్యానికి మించి సభ్యత్వం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా లక్ష్యం 3.9లక్షలు కాగా సోమవారం వరకు జిల్లాలో లక్ష సాధారణ, 25వేల క్రియాశీల సభ్యత్వం పూర్తయింది. సభ్యత్వ నమోదు లక్ష్యానికి మించి నమోదయ్యే అవకాశం ఉంది. సోమవారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదును ప్రారంభించారు. స్టీరింగ్ కమిటీ సభ్యుడు, జిల్లా ఇన్‌చార్జి కన్నబోయిన రాజయ్యయాదవ్ మానకొండూరులో సమీక్ష నిర్వహించి సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో పర్యటించారు. జిల్లా కన్వీనర్ ఈద శంకర్‌రెడ్డి నియోజకవర్గాల వారీగా పర్యటిస్తూ సభ్యత్వ నమోదు పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నారు.

వరంగల్‌లో రెండు లక్షల సభ్యత్వాలు పూర్తి: వరంగ ల్ జిల్లాలో 3 లక్షల సాధారణ సభ్యత్వం, 60 వేల క్రియాశీల సభ్యత్వం చేయాలని అధిష్ఠానం ఆదేశించగా పార్టీ నేతలు గ్రామాల్లో సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. సోమవారం నాటికి వరంగల్ జిల్లాలో మొత్తం రెండు లక్షల ఎనిమిది వేల సభ్యత్వ నమోదు పూర్తయింది. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం టీఆర్‌ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ లక్షెట్టిపేటలో జరిగిన సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. జన్నారంలో ఎమ్మె ల్యే అజ్మీరా రేఖా శ్యాంనాయక్ పాల్గొన్నారు. పార్టీ తూర్పు జిల్లా మాజీ అధ్యక్షుడు లోక భూమారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 2.50 లక్షల సాధారణ, 50 వేల క్రియాశీల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఊపు చూస్తే 4.50 లక్షల వరకు సభ్యత్వ నమోదు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.

సభ్యత్వాలకు భారీ స్పందన: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ లకా్ష్మరెడ్డి సోమవారం పాలమూరు జిల్లా జడ్చర్లలోని తన ఇంట్లో సభ్యత్వ నమోదుపై సమీక్షాసమావేశం నిర్వహించారు. బంగారు తెలంగాణ సాధించుకునేందుకు ప్రజలు పట్టుదలతో ఉన్నారని, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులను చూసి న ప్రజలు సభ్యత్వాలను తీసుకునేందుకు గ్రామాల్లో బారులు తీరుతున్నారన్నారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు తెలంగాణ ఉద్యమంలా సాగుతున్నదని సభ్యత్వ జిల్లా ఇన్‌చార్జి మార్కండేయ నాగర్‌కర్నూల్‌లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. రాష్ట్రంలో 50 లక్షలకు సభ్యత్వాలు చేరుకునే అవకాశం ఉందన్నారు. నల్లగొండ జిల్లా ఆలేరు నియోజవర్గంలోని తుర్కపల్లి మండలంలో చేపట్టిన మండల స్థాయి సభ్యత్వ నమోదుకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొని కార్యకర్తలకు సభ్యత్వాలు అందజేశారు.

ఇతర పార్టీల్లోంచి వెల్లువలా చేరికలు: రంగారెడ్డి జిల్లా లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్నివర్గాల ప్రజలు వెల్లువలా అధికార పార్టీలో చేరుతున్నారు. దీంతో పల్లె నుంచి పట్టణం దాకా ఇంటి పార్టీ సభ్యత్వ నమోదు జోరందుకుంటున్నది. ఆరు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని 3.55 లక్షలు టార్గెట్‌గా నిర్ణయించారు. సోమవారం నాటికి 45,500 సభ్యత్వాలను పూర్తిచేశారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 60 శాతం మేర సభ్యత్వం పూర్తయినట్లు మెంబర్‌షిప్ డ్రైవ్ ఇన్‌చార్జి రూప్ సింగ్ తెలిపారు. ఇచ్చిన టార్గెట్‌కు మించి దాదాపు అన్నిచోట్ల సభ్యత్వనమోదు అయ్యే అవకాశాలున్నట్లు చెప్పారు.

ఖమ్మంలో ముమ్మరంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ఖమ్మం జిల్లావ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఖమ్మంనగరంతోపాటు అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రా లు, గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు సభ్యత్వ నమోదును ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. జిల్లాలో మూడు లక్షల సభ్యత్వాలను చేర్పించాలని సీఎం కేసీఆర్ టార్గెట్ విధించగా, ఇప్పటికే రెండు లక్షలు దాటినట్లు ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.