Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కదంతొక్కిన టీబీజీకేఎస్

-మీ చేతుల్లోనే సింగరేణి భవిష్యత్.. -టీబీజీకేఎస్ గెలిస్తేనే కార్మికుల హక్కులకు రక్షణ కారుణ్యంతో కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపుతాం -కొత్త గనులతో కార్మికుల సంఖ్యను లక్షకుపైగా పెంచుతాం: ఎంపీ కవిత -టీబీజీకేఎస్‌ను గెలుపును సీఎంకు కానుకగా ఇవ్వాలి: మంత్రి తుమ్మల -ముగిసిన ప్రచారం.. రేపు గుర్తింపు సంఘం ఎన్నికలు

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో టీబీజీకేఎస్ దూసుకెళ్లింది. మిగతా యూనియన్లు తేరుకునేలోపే ప్రతి కార్మికుడి ఇంటి తలుపుతట్టింది. మిగతావాళ్లు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ.. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు అండతో కార్మికుల సంక్షేమంకోసం టీబీజీకేఎస్ సాధించిన విజయాలను వివరిస్తూ మనసులను చూరగొన్నది. టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత కాలుకు బలపం కట్టుకొని నల్లనేలంతా కలియదిరిగారు. కార్మికుల కష్టాలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకొని భరోసా నింపారు. బాణం గుర్తుకు ఓటు వేస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉంటుందనే నినాదం కార్మికులను ఆలోచింపజేస్తున్నది. కోల్‌బెల్ట్‌లోని టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులంతా గేట్ మీటింగ్‌లలో టీబీజీకేఎస్ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ ముందుకుసాగారు. దీంతో టీబీజీకేఎస్‌కు కార్మికుల్లో ఎనలేని మద్దతు వచ్చింది. మంగళవారం ప్రచారం ముగిసే చివరినిమిషం వరకు టీబీజీకేఎస్‌లోకి చేరికల వెల్లువ కొనసాగింది. టీబీజీకేఎస్ విజయం ఎప్పుడో ఖాయమైంది, మెజారిటీ మాత్రమే తేలాల్సి కదంతొక్కిన టీబీజీకేఎస్ఉన్నదనే ప్రచారం బొగ్గుగనుల్లో ఊపందుకున్నది. పదిహేనురోజులుగా హోరాహోరీగా జరిగిన ప్రచారానికి మంగళవారం సాయం త్రం తెరపడింది. గుర్తింపు సంఘం ఎన్నికలు గురువారం జరుగనున్నాయి. అదే రోజు లెక్కింపు జరుగనున్నది.

ఐటీ మినహాయింపుపై పార్లమెంట్‌లో పోరాటం: ఎంపీ కవిత వారసత్వ ఉద్యోగాలతో సింగరేణి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతామని నిజామాబాద్ ఎంపీ, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పునరుద్ఘాటించారు. కార్మికుల చేతుల్లోనే సింగరేణి భవిష్యత్ ఉన్నదని, టీబీజీకేఎస్ గెలిస్తేనే హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పారు. సింగరేణి గుర్తింపు కార్మికసంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం ఏరియాలోని గౌతంఖని ఓసీ, కొత్తగూడెం కార్పొరేట్, ఇల్లెందులోని టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద, మణుగూరు ఓసీ-2 వద్ద ప్రచార కార్యక్రమాల్లో ఆమె మాట్లాడారు. ఏండ్ల తరబడి కార్మికులకు ఇచ్చే పాలు, గుడ్డు ఎవరి వల్ల రద్దు అయ్యాయని ప్రశ్నించారు. ఎన్నికలున్నా, లేకున్నా కార్మికుల శ్రేయస్సు కోసం ఆలోచించే సంఘానికే మద్దతు ఇవ్వాలని కోరారు. కార్మికుల హక్కులకు రక్షణ, సంస్థ బాగుండాలనే సంకల్పంతో రూ.175 కోట్ల వృత్తి పన్ను రద్దు చేశామని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలపై ప్రకటన చేశాక, ఏఐటీయూసీ, ఐఎన్టీయూ సీ నేతల కుటుంబసభ్యులే కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కోర్టు ఇచ్చిన వెసులుబాటుతోనే సీఎం కేసీఆర్ వారసత్వ ఉద్యోగాలను, కారుణ్య నియామకాల రూపంలో అమలుచేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. లాభాల్లో వాటాను 16 నుంచి 25 శాతం పెంచిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుదేనని చెప్పారు.

ఇల్లెందులో 21 ఇైంక్లెన్‌తో ఏటా రూ.30 కోట్లు నష్టం వస్తున్నప్పటికీ కార్మిక కుటుంబాలను కాపాడే ఆలోచనతో సీఎం కేసీఆర్ తిరిగి తెరిపించారని చెప్పారు. బొగ్గుట్టకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. గత పాలకులు గనులను మూసేసి లక్షా 15 వేల మంది ఉన్న కార్మికుల సంఖ్యను 60 వేలకు తగ్గించారని, టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే కొత్త గనులను ప్రారంభించి మళ్లీ లక్షకుపైగా ఉద్యోగాల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు. ఆదాయం పన్ను మినహాయింపుపై పార్లమెంట్‌లో గళం విప్పుతామన్నారు. కార్మికుల సొంతింటి నిర్మాణానికి రూ.6 లక్షల వడ్డీలేని రుణాన్ని ఇప్పిస్తామన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఎన్ని నిధులైనా కేటాయించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలకు నుంచి కార్మికులు ఎంపీ ్ల కవిత సమక్షంలో టీబీజీకేఎస్‌లో చేరారు. వీరిలో ఏఐటీయూసీ నుంచి మహ్మద్‌పాషా (జేకే ఓసీ), శశిరేఖ, నాగమణి, కోటమ్మ, నాగమ్మ (ఏఐటీయూసీ) ఉన్నారు. మంగళవారం రాత్రి సమయంలో ఎంపీ కవిత హైదరాబాద్‌కు వెళ్లేందుకు సిద్ధమవగా భారీవర్షం కురియడంతో అక్కడే బసచేశారు.

రెండు నెలలకు ఒకసారి సమీక్ష: మంత్రి తుమ్మల సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించాక కార్మికుల స్థితిగతులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ రెండు నెలలకోసారి సమీ క్ష నిర్వహిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సింగరేణి కార్మికులను సరిహద్దు సైనికులతో సీఎం కేసీఆర్ పోల్చారని.. కార్మికులపై ఆయనకు ఉన్న ప్రేమకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. అన్ని డివిజన్లలో టీబీజీకేఎస్‌ను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతారాంనాయక్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు జలగం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పువ్వాడ అజయ్‌కుమార్, శంకర్‌నాయక్, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, టీబీజీకేఎస్ నేతలు ఆకునూరి కనకరాజు, డాక్టర్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

11 ఏరియాల్లో 92 పోలింగ్ కేంద్రాలు సింగరేణి 11 ఏరియాల్లో గురువారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. రాత్రి ఏడు గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. 92 పోలింగ్ కేంద్రాల్లో 52,534 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 11 ఏరియాలు, హైదరాబాద్ సింగరేణిభవన్‌లో పోలింగ్ జరిగిన ఓట్లను లెక్కించాక తుది ఫలితాన్ని ప్రకటిస్తారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.