Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కళాకారుడికి మద్దతు ఇవ్వండి

కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. కళాకారులను గుర్తించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే. ఉద్యమంలో కళాకారుల పాత్ర మరువలేం. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో కళాకారులు భాగస్వాములవ్వాలి. వరంగల్ ఎంపీ ఉప ఎన్నికలో ఓ కళాకారుడికి టీఆర్‌ఎస్ అవకాశం ఇచ్చింది.

Harish-Rao-election-campaign-in-warangal-west01

-స్వరాష్ట్రంలోనే కళాకారులకు గుర్తింపు -దయాకర్‌కు మెజార్టీ ఖాయం: మంత్రి హరీశ్‌రావు -ప్రతిపక్షాలను పాతరేయండి: మంత్రి ఈటల -విపక్షాల మాటలు నమ్మొద్దు: మంత్రి జగదీశ్‌రెడ్డి -అభివృద్ధికి పట్టం కట్టండి: మంత్రి పోచారం -సొంతింటికల నెరవేరుస్తాం: మంత్రి అల్లోల

కళాకారులంతా పసునూరి దయాకర్‌ను గెలిపించాలి అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో కళాకారుల ర్యాలీని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించి మాట్లాడారు. ఉద్యమంలో పాల్గొన్న కళాకారులను గుర్తించిన ప్రభుత్వం, ఉద్యోగాలు ఇచ్చి గౌరవించిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ గుండు సుధారాణి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ బోడికుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, టీఆర్‌ఎస్‌ గ్రేటర్ అధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ ఇవ్వండి: మంత్రి ఈటల ఉప ఎన్నికలో ప్రతిపక్షపార్టీలను పాతరేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు పరకాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సీఎం కేసీఆర్‌కు ఉప ఎన్నికలో ప్రజలు మరింత అండగా నిలవాలని కోరారు. చరిత్రలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర బడ్జెట్‌లో 33 శాతం నిధులు సంక్షేమానికే వెచ్చిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. పదిహేను రోజులుగా గ్రామాల్లో నిర్వహించిన ప్రచారానికి ప్రజలు టీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారని, దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. సమావేశంలో విప్ నల్లాల ఓదెలు, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి పాల్గొన్నారు.

ప్రతిపక్షాల దిమ్మతిరిగే తీర్పివ్వండి: మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రజాసంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి బంగారు తెలంగాణ కోసం కృషిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని, ఉపఎన్నికలో దయాకర్‌కు భారీ మెజార్టీతో గెలిపించాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. తొర్రూరు పట్టణంలో,దుబ్బతండాలో ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్ విజయం ఖాయమైందని, డిపాజిట్లు దక్కించుకోవాలన్న తాపత్రయంతోనే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఆంధ్రా తొత్తులుగా వ్యవహరిస్తున్న టీడీపీ నేతలకు, తెలంగాణపై చిన్న చూపు చూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

ద్రోహులను తరమండి:మంత్రి పోచారం అనతికాలంలోనే అభివృద్ధికి బాటలు వేసిన టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని, తెలంగాణ ద్రోహుల పార్టీలను తరిమికొట్టాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. చిట్యాల మండలంలో ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఉప ఎన్నికలో ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కే ఉన్నదన్నారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు ఓట్లెలా అడుగుతున్నారని ప్రశ్నించారు. 42 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, 17 ఏండ్లు పాలించిన టీడీపీ తెలంగాణలో ఏం అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. 45 లక్షల ఇండ్లు నిర్మించామని కాగితాల్లో రాసుకున్న నేతలు, వారి కార్యకర్తలకే బంగ్లాలు నిర్మించుకునేలా వ్యవహరించారని, నిరుపేదలకు ఇండ్లు మంజూరైనా వారికి ఇచ్చే డబ్బులు గోడలవరకే పరిమితమయ్యాయన్నారు. ఉప ఎన్నికలో దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

విద్యుత్ సమస్యను తీర్చాం: మంత్రి అల్లోల పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మిస్తున్నారని, త్వరలోనే అందరికీ ఇండ్లు మంజూరవుతాయని గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. రఘునాథపల్లి మండలంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజయ్య, బాబూమోహన్, పార్టీ నేత రాజరాపు ప్రతాప్‌తో కలిసి ప్రచా రంలో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు చెల్లించేందుకు రూ.250 కోట్లు విడుదల చేశామని, మార్చి నుంచి తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కల్యాణలక్ష్మి వర్తింపజేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి సాగుకు పగలే తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. దయాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎంపీ కవిత పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపడుతుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. గురువారం వరంగల్ జిల్లా పరకాల మండలం వరికోలులో నిర్వహించిన సభలో, ప్రచారంలో ఆమె మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో గృహనిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు సుమారు రెండు లక్షల ఇండ్లను కేటాయించి కేంద్రం, తెలంగాణకు కేవలం 10 వేల ఇండ్లను మంజూరు చేయడం వివక్షకు నిదర్శనం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.8వేల కోట్లు కేటాయించి, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మొండిచెయ్యి చూపడాన్ని తప్పుబట్టారు. టీఆర్‌ఎస్ ఎంపీలమంతా కేంద్రాన్ని నిలదీస్తుంటే, రాష్ట్రం నుంచి గెలిచిన ఇతర ఎంపీలు ప్రజాసమస్యలను గాలికొదిలేస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలో దయాకర్‌ను మెజార్టీతో గెలిపిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. వరికోల్‌ వాసులంతా టీఆర్‌ఎస్‌కే ఓట్లేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి సీఎం కేసీఆర్‌కు బాసటగా నిలబడడం సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రా తొత్తులను ఈ ఎన్నికలో పాతరేయాలని పిలుపునిచ్చారు. పరకాల నియోజకవర్గానికే సీఎం కేసీఆర్ రూ.600కోట్లు కేటాయించారని, ఆయన అడిగిన వెంటనే వరాలు ఇచ్చే బోళాశంకరుడని వర్ణించారు. మంత్రి వెంట విప్ నల్లాల ఓదెలు,ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ ఉన్నారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.