సాధారణంగా గోదావరిపై ఒక ప్రాజెక్టు ఐదున్నరేండ్లలోపు పూర్తయినట్లు చరిత్రలో లేదు. అందులోనూ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి కావాలంటే పదిహేనేండ్లకు పైనే పడుతుంది. అలాంటిది ఈ ఎత్తిపోతల పథకం చరిత్రనే తిరగరాసింది. కేవలం నాలుగేండ్లలోనే పూర్తయిన ఈ ప్రాజెక్టు తాలూకు పూర్తిస్థాయి ఫలాలు ఈ ఏడాదే అందనున్నాయి. ఇలా తిరగరాసిన చరిత్రలోనూ మరో చరిత్రకెక్కారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలోని ఏ ప్రాజెక్టూ పూర్తికాక ముందు రెండోసారి సందర్శించిన ముఖ్యమంత్రి గానీ.. ప్రధానమంత్రిగానీ ఎవరూ లేరు. కానీ… శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు ఒక ప్రాజెక్టును ఆరు సార్లు సందర్శించిన ఏకైక సీఎం కేసీఆరే. అంతేకాదు.. దేశంలో ఇంతవరకూజరగని విధంగా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కాళేశ్వరాన్ని ప్రారంభించిన సీఎంగా కేసీఆర్ చరిత్రకెక్కారు. ఇదే సమయంలో కాళేశ్వర దేవస్థానాన్ని నాలుగుసార్లు దర్శించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా ఆయనే.
‘రైతుబంధు’వై.. అన్నదాత కుటుంబానికి ‘ఆపద్బంధువై’.. ఇంటింటికీ నీళ్లు తెచ్చే అపర ‘భగీరథు’డై.. ‘కాళేశ్వర’ గంగను ఎత్తిపోసేందుకు నిత్య కృషీవలుడైన కేసీఆర్.. రైతన్న కష్టాలు తీర్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణమే ఏకైక మార్గమని భావించారు. కరువుతో అల్లాడుతున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు రూ.307 కోట్లతో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేసి 58.958 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి పూర్తిచేసిన తొలి ప్రాజెక్టుగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.
సాధారణంగా గోదావరిపై ఒక ప్రాజెక్టు ఐదున్నరేండ్లలోపు పూర్తయినట్లు చరిత్రలో లేదు. అందులోనూ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు పూర్తి కావాలంటే పదిహేనేండ్లకు పైనే పడుతుంది. అలాంటిది ఈ ఎత్తిపోతల పథకం చరిత్రనే తిరగరాసింది. కేవలం నాలుగేండ్లలోనే పూర్తయిన ఈ ప్రాజెక్టు తాలూకు పూర్తిస్థాయి ఫలాలు ఈ ఏడాదే అందనున్నాయి. ఇలా తిరగరాసిన చరిత్రలోనూ మరో చరిత్రకెక్కారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలోని ఏ ప్రాజెక్టూ పూర్తికాక ముందు రెండోసారి సందర్శించిన ముఖ్యమంత్రి గానీ.. ప్రధానమంత్రిగానీ ఎవరూ లేరు. కానీ… శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు ఒక ప్రాజెక్టును ఆరు సార్లు సందర్శించిన ఏకైక సీఎం కేసీఆరే. అంతేకాదు.. దేశంలో ఇంతవరకూజరగని విధంగా పొరుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కలిసి కాళేశ్వరాన్ని ప్రారంభించిన సీఎంగా కేసీఆర్ చరిత్రకెక్కారు. ఇదే సమయంలో కాళేశ్వర దేవస్థానాన్ని నాలుగుసార్లు దర్శించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కూడా ఆయనే. ‘రైతుబంధు’వై.. అన్నదాత కుటుంబానికి ‘ఆపద్బంధువై’.. ఇంటింటికీ నీళ్లు తెచ్చే అపర ‘భగీరథు’డై.. ‘కాళేశ్వర’ గంగను ఎత్తిపోసేందుకు నిత్య కృషీవలుడైన కేసీఆర్.. రైతన్న కష్టాలు తీర్చేందుకు ప్రాజెక్టుల నిర్మాణమే ఏకైక మార్గమని భావించారు. కరువుతో అల్లాడుతున్న ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సాగునీరు అందించేందుకు రూ.307 కోట్లతో భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేసి 58.958 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసి పూర్తిచేసిన తొలి ప్రాజెక్టుగా ఇది చరిత్రలో నిలిచిపోయింది. -గాజుల నాగార్జున