Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరంపై ఇంకా కువిమర్శలా?

ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెట్టుకున్నా.. ఇంకా తొడలు కొడుతు, సంక్రాంతి కోడిపుంజుల్లా ఎగిరెగిరిపడుతున్న ప్రతిపక్షనాయకులు సాధించింది ఏమిటి? నిజంగా ప్రాజెక్టులపై సందేహాలుంటే, మీ అభిప్రాయాలుంటే చెప్పండని ప్రభుత్వం అవకాశం ఇచ్చిన ప్రతిసారి పలాయనవాదం పుచ్చుకొని తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబడిన వారు ఇంకా కాళేశ్వరం గురించి వెకిలి మాటలు మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి?

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు,
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
దిరిగి కుందేటి గొమ్ము సాధించవచ్చు
జేరి మూర్ఖుల మనసు రంజింపరాదు..
ప్రయత్నిస్తే ఇసుక నుంచి నూనె తీయవచ్చును, ఎండమావులలో నీరు తాగవచ్చును, కుందేటి కొమ్ము సాధించవచ్చు.. కానీ మూర్ఖుల మనసును రంజింపచేయలేము. ఈ మాట భర్తృహరి తన శతకంలో చెప్పినప్పుడు, దానిని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించడం… ఆ పద్యం సరి గ్గా ఇప్పటి తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సరిపోవడం వైచిత్రి కాకుంటే మరేంటి? ప్రపంచమే కాళేశ్వరంవైపు చూస్తుంటే, కాంగ్రెస్ నాయకులు ఇంకా మూర్ఖపు వాదనలతో ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి? అందుకే పై పద్యం వీళ్ల కోసమే రాసిందన్న భావన కలుగుతున్నది.

వలస పాలనలో ఎడారిగా మారిన తెలంగాణకు పచ్చని పందిరి వేయాల నే దృఢ సంకల్పంతో స్వరాష్ట్ర ఉద్యమం ప్రారంభించి, పల్లె పల్లెకు తిరిగి తెలంగాణ సాగునీటి అవసరాలు ఏమిటో పూర్తిగా అవగాహన చేసుకొని, నీరు పల్లమెరుగు అనే నానుడికి భిన్నంగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించే భగీరథ ప్రయత్నానికి పూనుకున్నడు కేసీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని ప్రారంభించడానికి సిద్ధం చేసిండు. ఇంతటి మహత్తర ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతున్న సందర్భంలో కాంగ్రెస్ నాయకులు పాడిందే పాటన్నట్టు పదే పదే విమర్శలకు దిగుతున్నరు. కొన్ని మాసాల్లోనే గోదావరి నీళ్లు తెలంగాణ రైతుల పాదాలను కడుగుతూ, బీళ్లుపడ్డ నేలలను సస్యశ్యామలం చేస్తూ, వలస పాలనలో గోసపడ్డ తెలంగాణ రైతన్నల కన్నీటిని తుడిచి వారి కండ్లల్లో ఆనందం చూసే రోజు దగ్గరవుతున్న కొద్ది కాంగ్రెస్ నాయకులు బెంబేలెత్తిపోతున్నరు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం విజయవంతం అయితే.. తమ భవిష్యత్తు అంధకారం అవుతుందనేదే వారి బాధ. అందుకే మూర్ఖపు వాదనలు చేస్తున్నరనే విషయం సామాన్యుడికైనా అర్థం అవుతున్నది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మూర్ఖపు వాదనలు ఏప్రిల్ 8న మహారాష్ట్ర ప్రభుత్వంతో రెండు రాష్ర్టాల మధ్య గోదావరి జలాల ఒప్పందం నుంచి మొదలై, 2016 మే 2న కాళేశ్వరం ప్రాజెక్టుకు శంఖుస్థాపన జరిగి, ఈనెల 21వ తేదీన ప్రారంభించుకొనేది కండ్ల ముందు కనిపిస్తు న్నా.. కొనసాగడం వారి అజ్ఞానానికి నిదర్శనం.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్కో ఇటుక పేర్చుతున్న కొద్దీ.. కాంగ్రెస్ నాయకు ల కాళ్ల కింద భూమి కదులుతున్నది. అందుకే వారు కేవలం విమర్శించడానికి పరిమితం కాలేదు. కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణ మారాలనే సీఎం కేసీఆర్, రైతుల ఆకాంక్షలపై దాడులు చేస్తూ సాక్షాత్తు ప్రాజెక్టు ను అడ్డుకోవడానికి బరితెగించిన్రు. ఈ క్రమంలో నిర్వాసితులను రెచ్చగొట్టడం, వారిచే కోర్టుల్లో కేసులు వేయించడం చేశారు. స్వయానా వారే కోర్టుల్లో కేసులు వేసి అభ్యంతరాలు చెప్పారు. ఇలా ఒక్కటేమిటి అనేక టక్కుటమారా విద్యలను ప్రదర్శించిన్రు. కానీ నిజాయితీ నిండిన సంకల్పాన్ని మించిన ఆయుధం లేదన్న అబ్దుల్ కలాం మాటను నిలబెట్టినట్టు తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా పనులను ప్రారంభించింది. ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొన్న సమయంలో తెలంగాణ సమాజం, రైతాంగం సంబురంగా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ నాయకులు గందరగోళపరిచే పద్ధతిలో మాట్లాడటం బాధ్యతారాహిత్యం. అందుకే నిజాయితీలేని ప్రతిపక్షాన్ని తెలంగాణలో భరిస్తున్న ప్రజలకు, మరీ భారం గా మారినట్టుగా కనిపిస్తున్నది.

రెండు విషయాలు కాంగ్రెస్ నాయకులు ఆలకించి ఆచరిస్తే బావుండు. వారు స్వయంగా ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులను పరిశీలించి మాట్లాడితే బాగుండేది. ప్రాజెక్టును చూసి ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టని కీర్తించిన వివిధ రాష్ర్టాల మేధావుల మాటలను, వారి అభిప్రాయాలను, వారి వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించి ఉంటే బాగుండేది. లేదా కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్లిన శాసనమండలి సభ్యుల బృం దంలో ఉన్న సొంత పార్టీ సభ్యులనైనా అడగాల్సింది.

ఇవేవి లేకుండా, గాలి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని గందరగోళపరచడం ఎంతవరకు భావ్యం? గత ఏడాది మార్చి నెలలో, కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు జర్నలిస్టుల బృందంతో స్వయంగా నేను కూడా వెళ్లడం జరిగింది. ఆ రోజు జరుగుతున్న పనులను చూసినప్పుడు గానీ, లేదా అంతకు ముం దు ప్రతిపక్షపార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టును నిత్యం అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నప్పుడు గానీ, లేదా.. ప్రాజెక్టు సందర్శనకు ముందు జర్నలిస్టు మిత్రులతో అభిప్రాయాల్ని పంచుకున్నప్పుడు, నిజమే ఈ ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తవుతుందా అనే అపనమ్మకం ఆ మూడు రోజుల సందర్శనకు వచ్చిన జర్నలిస్టు మిత్రులను వెంటాడింది. కానీ మూడు రోజులు ప్రాజెక్టు పనులను సందర్శించినాక అక్కడ పనిచేస్తున్న అధికారులు, ఇంజినీర్ల సంకల్పం, కార్మికుల పని విధానం చూసి తిరుగు ప్రయాణంలో అందరు అభిప్రాయాలు మార్చుకోవల్సిన అనివార్యత ఏర్పడింది.

గత ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టులు ప్రారంభించినా దశాబ్దాలపాటు ప్రాజెక్టుల నిర్మాణం జరుగడం, నిర్వాసితులను పట్టించుకోకపోవడం ఉండేది. ప్రజలు ఆశించినట్లుగా నీళ్లు రాకపోవడం గత పాలకుల పుణ్యమా అని అందరికి ప్రభుత్వాల మీద ఏర్ప డ్డ భావాలవి. కానీ కేసీఆర్ సర్కా రు పనివిధానం పూర్తి భిన్నమనే అభిప్రాయం కాళేశ్వరం ప్రాజెక్టు ను చూశాక ఎవ్వరికైనా కలగకుం డా మానదు.

ఇంత జరుగుతున్నా ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెట్టుకున్నా.. ఇంకా తొడలు కొడుతు, సంక్రాంతి కోడిపుంజుల్లా ఎగిరెగిరిపడుతున్న ప్రతిపక్షనాయకులు సాధించింది ఏమిటి? నిజంగా ప్రాజెక్టుల పై సందేహాలుంటే, మీ అభిప్రాయాలుంటే చెప్పండని ప్రభుత్వం అవకా శం ఇచ్చిన ప్రతిసారి పలాయనవాదం పుచ్చుకొని తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబడిన వారు ఇంకా కాళేశ్వరం గురించి వెకిలి మాటలు మాట్లాడటంలో ఆంతర్యం ఏమిటి? మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల చీత్కారానికి గురై రాజకీయ అంధకారంలోకి నెట్టివేయబడుతున్న సమయంలో కూడా ఇంకా నీళ్లు వస్తాయా? ఎంతశాతం పని జరిగింది? ఎన్నివేల ఎకరాల భూములకు నీళ్లిస్తరనే పసలేని వాదనతో ప్రజలను అయోమయానికి గురిచేయడం భావ్యమా? కడుపునిండా కాలకూట విషాన్ని నింపుకున్న ఈ కాంగ్రెస్ నేతలకు ఈ నెల 21వ తేదీ తప్పకుండా సమాధానంగా నిలుస్తుంది. తెలంగాణ ఉద్యమాన్ని బాధ్యతగా నడిపిన తీరులోనే, సొంత రాష్ట్రం సాధించుకున్న తరువాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా అభివృద్ధి బాధ్యతను భుజాలకెత్తుకొని నిజాయితీగా ప్రజలకు అభివృద్ధి ఫలాలను పంచుతున్నారు. ఇలాంటి మూర్ఖ పు మనుషుల నీచ మనస్తత్వాన్ని వివరిస్తూ.. కేసీఆర్ గారు ఉదహరించిన భర్తృహరి మాటల్లోనే.. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నా యాస సంత్రస్తులై
యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్ !
ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్న తోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సమీ ప్రజ్ఞా నిథుల్ గావునన్ !!
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యులు) కర్నె ప్రభాకర్

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.