Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రండి

-మీ సహకారంతోనే కాళేశ్వరం సాకారం
-మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో సీఎం కేసీఆర్..
-ఆహ్వానపత్రిక స్వయంగా అందజేత
-గవర్నర్ విద్యాసాగర్‌రావునూ ఆహ్వానించిన కేసీఆర్
-21న కన్నెపల్లిలో 6 మోటర్ల వెట్న్
-ఏర్పాట్లుచేస్తున్న ప్రాజెక్టు అధికారులు
-అదేరోజు మహాజల సంకల్పయాగం!

మహారాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ సమయంలో పూర్తిచేయగలిగామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో అన్నారు. రికార్డుస్థాయిలో అద్భుతంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ మహాఘట్టానికి రావాలని సాదరంగా ఆహ్వానించారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముఖ్య అతిథులుగా పొరుగురాష్ర్టాలైన మహారాష్ట్ర, ఏపీ ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ముంబై వెళ్లిన సీఎం కేసీఆర్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌తో సమావేశమయ్యారు. ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ గ్రామంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా కోరారు. ఇందుకు సంబంధించి ఆహ్వానపత్రాన్ని అందించారు. మీ సహకారంతోనే ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ సమయంలో పూర్తిచేయగలిగాం. తద్వారా దాదాపు 45 లక్షల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందనున్నది. ముఖ్యంగా ప్రాజెక్టుకు సంబంధించి అంతర్రాష్ట్ర అంశాలను పరిష్కరించడంలో మీరు, మీ ప్రభుత్వం అందించిన సహకారానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ నెల 21న జరుగనున్న ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా వ్యక్తిగతంగా కోరుతున్నా. అంతర్రాష్ట్ర సహకారానికి ఇది ప్రతీక అని ఆహ్వాన పత్రంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతకుముందు ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించుకొన్నారు.

గవర్నర్ విద్యాసాగర్‌రావుకు ఆహ్వానం
అంతకుముందు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ ముంబై చేరుకోగానే ముందుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌రెడ్డి ఉన్నారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవాడ వెళ్లి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

ప్రారంభోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు
చారిత్రక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతున్నది. ప్రాజెక్టు అధికారులు సాంకేతికంగా అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో ఆరు మోటార్ల వెట్న్‌క్రు ఏర్పాట్లుచేస్తున్నారు. ఇందుకుగాను నీటి లభ్యత సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టారు.

మహాజల సంకల్పయాగం
కాళేశ్వరం (జయశంకర్ భూపాల్‌పల్లి): కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ నేపథ్యంలో 21వ తేదీ ఉదయం మహాజల సంకల్పయాగాన్ని సీఎం కేసీఆర్ దంపతుల చేతులమీదుగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం కన్నెపల్లి పంపుహౌస్‌ను వేద పండితులు గోపీకృష్ణశర్మ, ఫణి శశాంక్‌శర్మతోపాటు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ సందర్శించారు. జల సంకల్పయాగం కోసం స్థలా న్ని పరిశీలించారు. గోదావరి తీరం, పంపుహౌస్ వ్యూ పాయింట్, డెలివరీ స్ట్రెచర్ స్థలాన్ని పరిశీలించారు. యాగం ఎక్కడ చేయా లనే అంశంపై వేద పండితులతో కలెక్టర్, ఎస్పీ చర్చించారు. అంతకుముందు కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.