Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కనీవినీ ఎరుగని రీతిలో టీఆర్‌ఎస్ ప్లీనరీ

-పాల్గొననున్న 30 వేల మంది ప్రతినిధులు -ప్లీనరీకి జయశంకర్ ప్రాంగణంగా నామకరణం -ప్రభుత్వం, పార్టీ బలోపేతమే ఎజెండా.. పరేడ్‌గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ -ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ -కార్యకర్తలను గౌరవించుకుంటాం -ప్లీనరీ ప్రాథమిక ఏర్పాట్లు పూర్తి -పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ -మంత్రి కేటీఆర్ వెల్లడి -చంద్రబాబు తెలంగాణ ప్రజా కంటకుడు -పచ్చపార్టీ వారికి పిచ్చి మాటలు ఎక్కువ -మెదక్ గుణపాఠంతోనూ బుద్ధి రాలేదు -టీటీడీపీ, టీ బీజేపీ నేతలు చంద్రబాబు, వెంకయ్య తొత్తులు -ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డ కేటీఆర్

TRS Leaders

టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఐటీ, పంచాయితీ రాజ్‌శాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న ఈ ప్లీనరీలో 30 వేల మంది వరకు ప్రతి నిధులు పాల్గొంటారని ఆయన చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు ఈటెల రాజేందర్, పద్మారావు, ఎంపీలు జితేందర్ రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్, గోపాల్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రాష్ట్ర టీఆర్‌ఎస్ యువత అధ్యక్షుడు రాంమోహన్, ఫుడ్ కమిటీ సభ్యులు దేవరి మల్లప్ప, ఇనాయక్ బాక్రి, గోషామహల్ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ ప్రేమ్‌కుమార్ ధూత్‌తో కలిసి మంత్రి కేటీఆర్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీ ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్లీనరీ నిర్వహించే ఎల్బీస్టేడియంప్రాంగణానికి జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేసినట్లు తెలిపారు. 12న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్లీనరీ, బహిరంగ సభల నిర్వహణ కోసం వేసిన కమిటీలు ఏర్పాట్లను చూస్తున్నాయన్నారు. ప్రాథమిక ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారని చెప్పారు. ప్లీనరీకి వస్తున్న 30 వేల మంది ప్రతినిధులకు తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లీనరీ సందర్భంగా నగరాన్ని అలంకరిస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశం, బహిరంగ సభ నిర్వహణ కోసం సుశిక్షితులైన కార్యకర్తల సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ప్రభుత్వం, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్లీనరీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పదమూడు సంవత్సరాలుగా పార్టీకి పునాదిరాళ్లుగా పనిచేసిన కార్యకర్తలను సముచితంగా గౌరవించుకోవడమే ప్లీనరీ ఎజెండాగా ఉంటుందని స్పష్టం చేశారు. సంస్థాగత నిర్మాణం కోసం టీఆర్‌ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా రూపుదిద్దేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ ప్రజల అభిష్టానికి, ఆకాంక్షలకు దగ్గరగా ప్లీనరీ ఉంటుందన్నారు. మంగళవారం పార్టీ జిల్లా సమావేశాలు ఉంటాయని, బుధవారం నియోజకవర్గ సమావేశాలు ఉన్నాయని చెప్పారు. పార్టీలో చేరికలు ఉంటాయా? అనే ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని, తినబోతూ రుచులడగమెందుకని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభకు అనుమతులు వస్తాయని, ఎక్కడ సభ పెట్టినా తట్టుకునే మైదానం లేదన్నారు. స్టేడియంలో కలియతిరిగిన కేటీఆర్ అక్కడ భోజన ఏర్పాట్లతో పాటు సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. మొదట ఎల్బీ స్టేడియంలో భోజన ఏర్పాట్లు చేయాలనుకున్నప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రతినిధులు వస్తున్న దృష్ట్యా నిజాం కళాశాల మైదానంలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చ జరిగింది. ఐతే దీనిపై తుది నిర్ణయానికి రాలేదు.

తెలంగాణ ప్రజా కంఠకుడు చంద్రబాబే కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేని పచ్చ పార్టీ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందని టీటీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులకు చీము, నెత్తురు ఉంటే బానిస బతుకులు విడనాడాలని సూచించారు. తెలంగాణ ప్రజా కంఠకుడిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ, అమరుల కుటుంబాలను ఆదుకోవడంతోపాటు అనేక పథకాలు చేపడుతున్న కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో లేక రుణమాఫీ చేయని చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారో స్పష్టం చేయాలన్నారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ప్రజలకు స్వేచ్ఛ లభించిందని, కానీ తెలంగాణ తెలుగుదేశం నాయకులు మాత్రం ఇంకా బానిస బతుకులు బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీపీ నాయకులు చంద్రబాబుకు, తెలంగాణ బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడుకు తొత్తులుగా మారి అభివృద్ధికి అవరోధాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేతలకు చేవ, సత్తా ఉంటే అభివృద్ధికి సహకరించాలన్నారు. మెదక్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా టీటీడీపీ నేతల తీరు మారడం లేదన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.