టీఆర్‌ఎస్ కార్యకర్తలు దురదృష్టవశాత్తు ప్రమాదంలో చనిపోతే వారికి రూ.2 లక్షలు చెల్లించేవిధంగా బీమా, గత సంవత్సరం ప్రీమియం కింద రూ.5 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. బీమా కంపెనీలు నష్టపోయామని విజ్ఞప్తి చేయటం, సభ్యుల సంఖ్య పెరుగటంతో ఆ మొత్తాన్ని సుమారు రూ.10 కోట్లకు పెంచినట్టు చెప్పారు. ఇప్పటివరకు డాటా ఎంట్రీ అయిన 60 లక్షల సభ్యత్వానికి సంబంధించిన చెక్కును ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సీఎం అందజేశారు. ఇన్సూరెన్స్ ప్రక్రియను పూర్తిచేయాలని పల్లాను ఆదేశించారు. వెంటనే ఆ చెక్కును న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారులకు పార్టీ కార్యాలయంలో అందజేశారు.