Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కవితకు భారీ మెజార్టీయే లక్ష్యం

-ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీదే విజయం
-ఆవిర్భావం నుంచి పార్టీకి నిజామాబాద్‌ అండ
-అభివృద్ధిని ఓర్వలేక దుష్టశక్తుల రాజకీయం
-మతాల చిచ్చుపెట్టే వారిని ఎదుర్కొంటాం
-నిజామాబాద్‌ స్థానిక ప్రజాప్రతినిధులతో
-టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రస్థానాన్ని చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి పార్టీలను ప్పటికప్పుడు ఎదుర్కొంటూ అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తూ వస్తున్నది. కులాలు, మతాల పేరుతో చిచ్చుపెట్టే పార్టీలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తాం. ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయశక్తి అని మరోసారి నిరూపిస్తాం.
– టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటూ వస్తున్నదని గుర్తుచేశారు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రెండు దశాబ్దాల క్రితం మోతె గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక ద్వారా జిల్లాలో ప్రారంభించిన టీఆర్‌ఎస్‌ ప్రస్థానాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేండ్లుగా చేపట్టిన రైతు సంక్షేమ, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ కవితకు మద్దతు తెలుపాలని కోరారు. సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. ప్రత్యేకించి నిజామాబాద్‌ జిల్లాలో ఎస్సారెస్పీ పునర్జీవం ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని కేటీఆర్‌ చెప్పారు. కాలువల ఆధునీకరణ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే నీళ్లు అందనున్నాయని తెలిపారు. వ్యవసాయరంగ ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేసి జిల్లాలో యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రజల ముంగిటకు పాలన అందించాలన్న సంకల్పంతో జిల్లాల పునర్విభజన ద్వారా నిజామాబాద్‌ జిల్లాలో కొత్త మండలాలు, పంచాయతీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్‌ చట్టాల ద్వారా పల్లెలు, పట్టణాల్లో మార్పులు వస్తున్నాయని వివరించారు.

చిచ్చుపెట్టే పార్టీలను ఎదుర్కొంటాం
అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రస్థానాన్ని చూసి ఓర్వలేక కొన్ని పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని కేటీఆర్‌ విమర్శించారు. ఇలాంటి పార్టీలను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తూ వస్తున్నదని చెప్పారు. కులాలు, మతాల పేరుతో చిచ్చుపెట్టే పార్టీలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ గెలిచి టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయశక్తి అని మరోసారి నిరూపిస్తామని చెప్పారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించిన టీఆర్‌ఎస్‌.. విద్యుత్‌ సంస్కరణల పేరిట ఉచితవిద్యుత్‌కు ప్రమాదం తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా వ్యతిరేకిస్తున్నదని తెలిపారు. రైతు సంక్షేమం కోసం అవసరమైతే దేవుడితోనైనా పోరాడతామన్న సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ముందుకుపోతున్నామని వివరించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ప్రత్యేక నిధుల విషయంలోఉన్న సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, దీనికి సంబంధించిన ఒక పరిష్కారంతో ముందుకొస్తామని చెప్పారు. కార్పొరేటర్లు, మున్సిపల్‌ కౌన్సిలర్ల సమస్యలు సైతం తనకు తెలుసునని.. మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు ఇచ్చి వార్డుల్లో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేలా చూస్తున్నామని తెలిపారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకుపోతున్న తమ ప్రభుత్వ పనితీరును అర్థం చేసుకొని ఈ నెల 9న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.