Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్ ఆశీస్సులతో భారీ మెజారిటీ తథ్యం

2014లో తొలిసారిగా లోక్‌సభ టికెట్ ఇవ్వడమే కాకుండా భారీ మెజార్టీతో తనను కేసీఆర్ గెలిపించారన్నారు. ఈ సారి కూడా కేసీఆర్ మళ్లీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించడం తన అదృష్టంగా ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ఆశీస్సులతోనే ప్రతి కార్యక్రమాన్ని పూర్తిచేయగలిగానని తెలిపారు.

< font color="red">భారీ మెజారిటే లక్షమని అంటున్నారు కదా.. అది ఏ విధంగా సాధ్యం?
ఈ సారి కూడా సీఎం కేసీఆర్ పథకాలే నాకు భారీ మెజార్టీని అందించబోతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పు ఆధారంగా గెలుపు గురించి ఆలోచించడం లేదు, భారీ మెజార్టీ ఖచ్చితంగా లభిస్తుంది. స్థానిక అంశాలు కాకుండా జాతీయ అంశాలపై దృష్టిసారించి ఈ ప్రాంత సమగ్ర అభివృద్దికిపాటుపడతా. సిఎంగా కెసిఆర్ తన లోక్సభ పరిధిలోని గజ్వేల్‌కు ఎమ్మెల్యేగా ఉన్నారు, అందువల్ల ప్రతీ విషయంలో ఆయన సహాయ సహకారాలతో పాటు ఆశీస్సులు తీసుకున్నాను. అందువల్లనే పనులు త్వరితంగా పూర్తిచేయగలిగాను. లక్షలాది మెజార్టీ ప్రజలు అందించబోతున్నారు.

< font color="red">ఎంపీగా జాతీయ రహదారుల విస్తరణపై చేసిన ప్రయత్నమేమిటి?
జాతీయ రహదారులకు సంబంధించి మెదక్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 1226 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మంజూరు చేయించడం జరిగింది. దీని పరిధిలో దుండిగల్ నుంచి నర్సాపూర్-మెదక్ వరకు గల రోడ్ విస్తరణ, నూతన రోడ్ నిర్మాణం, సంగారెడ్డి నుంచి నాందేడ్ వరకు గల జాతీయ రహదారుల నిర్మాణ పనులు మొదలయ్యాయి.. రాష్ట్ర రహదారులకు సంబంధించి పార్లమెంట్ పరిధిలో 2069 కోట్ల రూపాయల నిధులతో, 1454 కి.మీ. మేర, వివిధ రకాల నూతన పనులు మంజూరు చేశా. అందులో కొన్ని ఇప్పటికే పూర్తి అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గ వారీగా నిధుల వినియోగంలో దుబ్బాకకు 119 కోట్ల4లక్షలు, గజ్వేల్‌కు 777 కోట్ల 53లక్షలు, మెదక్ 225 కోట్ల 87లక్షలు, నర్సాపూర్ 184కోట్ల 74 లక్షలు, సంగారెడ్డి 291 కోట్ల46 లక్షలు, సిద్దిపేట 350 కోట్ల 28లక్షలు మంజూరయ్యాయన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివక్ష లేకుండా పనులు జరిపించినందున రికార్డు మెజార్టీతో గెలువబోతున్నాము.

< font color="red">రెండోసారి పోటీ చేస్తున్న అనుభూతి ఎలా ఉంది?
ఉద్యమ పార్టీ టిఆర్‌ఎస్‌లో తెలంగాణ ఏర్పాటు కంటే ముందు నుంచే ఉన్నాను, ఉద్యమంలో పాల్గొన్నాను, తెలంగాణ సాధనకు కెసిఆర్ బాటలో నావంతుగా ముందుకు పోతున్నాను. అలాంటి సమయంలో మొదటి సారి పార్లమెంట్ అవకాశం ఇచ్చినపుడు ఎంతో గర్వంగా ఫీలయ్యాను, భారీ మెజార్టీతో గెలవడంతో బాధ్యత మరింత పెరిగింది. ఈ సారి కూడా నాకు కెసిఆర్ అవకాశం ఇచ్చినందుకు మరింత రుణపడి ఉంటాను, ప్రజలకు సేవ చేసే అవకాశం మళ్లీ లభించినందుకు సంతోషకరంగా ఉంది.

< font color="red">రైల్వేలైన్ల విషయంలో తీసుకున్న చొరవ ఏమిటి?
గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, బ్రిడ్జీలు, రోడ్ల విస్తరణ, రోడ్ల మరమ్మత్తులు కొత్త రోడ్డు నిర్మాణం జరిగింది. దీని వలన అన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, రవాణా సౌకర్యం మెరుగుపడి ఆర్థికంగా గ్రామాలు చాలా అభివృద్ధ్ది చెందాయి. ఇక కీలకమైన రైల్వే విషయంలో ఎంతో చొరవ తీసుకున్నాను. తద్వారా మెదక్ రైల్వే లైన్ మంజూరైంది. కొత్త రైల్వే మెదక్ పార్లమెంట్ పరిధిలో మంజూరైంది. ఇందులో భాగంగా గజ్వేల్ మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151 కి.మీల లైన్ 1100 కోట్ల అంచనాలతో పనులను ప్రారంభించడం జరిగింది. రైల్వే లైన్ పనులు పూర్తయి గజ్వేల్ పరిసర గ్రామ ప్రజలకు రైల్వే సౌకర్యం లభిస్తుంది.

< font color="red">అక్కన్నపేట రైల్వే లైన్ కోసం చేసిన ప్రయత్నాలేమిటి?
అక్కన్నపేట్ నుండి మెదక్ వరకు, 17 కి.మీ, రూపాయలు 169 కోట్ల అంచనాలతో నూతన రైల్వేలైన్ మంజూరై పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పని కూడా అతి త్వరలో అయి మెదక్ పరిసర ప్రజలకు రైల్వే సౌకర్యం లభిస్తుంది. తద్వారా మెదక్ ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతోంది. ఈ రైల్వే లైన్ కోసం నేను చేసిన ప్రయత్నాలకు సిఎం కెసిఆర్ ఎంతో సహకరించారు, రాష్ట్రప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు, వడియారం స్టేషన్‌లో అంజంతాఎక్స్‌ప్రెస్ ఆగే విధంగా కృషిచేయడం జరిగింది. దీని వలన చేగుంట పరిసర గ్రామ ప్రజలకు షిర్టి ముంబై సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి రైల్వే రవాణా సౌకర్యం లభించింది. ఎంఎంటీఎస్ సర్వీసులను పటాన్‌చెరు వరకు విస్తరించడం జరిగింది, పనులు పూర్తికావడంతో త్వరలో పటాన్‌చెరు ప్రజలకు రైల్వే సౌకర్యం కలిగి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి.

< font color="red">ఎంపి నిధులను ఏ విధంగా వినియోగించారు…?
గత ఐదు సంవత్సరాలలో ఎంపి నిధులను పూర్తిస్తాయిలో ప్రజా సంక్షేమం కోసం ఖర్చుచే యడం జరిగింది. ప్రతి నియోజకవర్గ శాసనసభ్యుల కోరిక మేరకు నిధులను కేటాయించడం జరిగింది. ఈ నిధులతో మంజూరైన పనులలో ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి, మిగితా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మూడు జిల్లాల ఇంజినీరింగ్ అధికారులతో తరుచుగా మాట్లాడుతూ మంజూరైన పనులను త్వరితగతంగా చేయిస్తున్నా. అంబులెన్స్‌లకు రూ.1.-12కోట్లు, సీసీ రోడ్స్ -9.10 కోట్లు, కమ్యూనిటీ హాల్స్-7.13లక్షలు, కమ్యూనిటీ హాల్స్-7.13లక్షలు, గురుద్వారా -5లక్షలు, ముస్లీం మైనారిటీ హాల్ , హజ్‌హాల్-55 లక్షలు, పాఠశాలలు ప్రహరీ గోడ నిర్మాణం(కాంపౌండ్ వాల్స్)-44లక్షలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిల్డింగ్-10లక్షలు, పాఠశాలలలో విద్యార్థులకు మరుగుదొడ్ల నిర్మాణం-13లక్షలు, దివ్యాంగునికి కృత్రిమ కాళ్లు -1లక్ష, వాటర్‌ట్యాంక్ -10లక్షలు, సిసి కెమెరాలు-25లక్షలు, మురికి కాలువలు-41లక్షలు, వ్యాయామశాల పరికరాలకు 15లక్షలు ఖర్చు చేశా.

< font color="red">విద్యుత్ కమిటీ సభ్యులుగా ఏం చేశారు?
కేంద్ర విద్యుత్ కమిటీ సభ్యులుగా సుమారు 155 కోట్లను వివిధప్రాంతాలకు మంజూరు చేయించా, అంతేకాకుండా నాగులపల్లిలో వందకోట్లతో రోడ్డు ఓవర్ బ్రిడ్జి పనులను ప్రారంభించాం, సంగారెడ్డి సమీపంలోని మల్కాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద 31 కోట్లతో కొత్తగా అండర్ పాస్‌ను మంజూరుచేయించా. మెదక్ సమీపంలోని మాసాయిపేట వద్ద రెండు కోట్లతో బాక్స్ కల్వర్టులను మంజూరు చేయించా, పనులు పూర్తయ్యాయి. సిద్దిపేట జిల్లాకు నూతనంగా ఒక కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించా, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతుల సంఖ్య పెరుగుతుంది.

< font color="red">యువత ఉపాధిపై తీసుకున్న చర్యలు ఏమిటీ?
అదే విధంగా సిద్దిపేటలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ప్రారంభించాం, నర్సాపూర్‌లో రైతుల కోసం కృషివిజ్ఞాన కేంద్రం కూడా ఏర్పాటుచేయించాం. సంగారెడ్డిలో నిరుద్యోగుల కోసం ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి, యువకులను స్వయం ఉపాధిలో అభివృద్ధ్ది చేస్తున్నాం. గత 5 సంవత్సరాలలో సిఎం సహాయ నిధి ద్వారా ఆసుపత్రి ఖర్చుల కోసం పేదలకు రూ.7 కోట్లకు పైగా మంజూరు చేయించా. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి కూడా కోటి రూపాయలను అందించాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.