-తెలంగాణ రాంరెడ్డికి సీఎం రూ.10లక్షల ఆర్థికసాయం -అందజేసిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

తొలితరం తెలంగాణ ఉద్యమ నేతలను గుర్తించి, సత్కరించి వారి చరితను నేటి తరాలకు వివరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చూపుతున్న చొరవను తెలంగాణ సమాజం హర్షిస్తుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆంధ్రపదేశ్ ఏర్పడిన అనంతరం తెలంగాణ ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా 1958 జనవరి 27న తన ఉన్నతమైన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగానికి రాజీనామా చేసిన గుండా రాంరెడ్డి (తెలంగాణ రాంరెడ్డి )ని మంగళవారం మన్సూరాబాద్ డివిజన్ సాయి సప్తగిరి కాలనీలోని ఆయన నివాసంలో సన్మానించారు. కేసీఆర్ వ్యక్తిగతంగా పంపిన రూ.10 లక్షల చెక్కును రాంరెడ్డికి బహూకరించారు.
తెలంగాణ రాంరెడ్డి లాంటి ఎంతోమంది నేతల పోరాటం, త్యాగం వల్లే రాష్ట్రం సిద్ధించిందని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటును చూసేందుకే భగవంతుడు నాకు 96 ఏండ్ల ఆయుస్సును ప్రసాదించాడని తెలంగాణ రాంరెడ్డి తెలిపారు. మొదటి తరం ఉద్యమ నేతలను గుర్తించి కేసీఆర్ ఇచ్చిన గౌరవానికి ఎంతో కృతజ్ఞుడనన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, తెలంగాణ రాంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.