Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్‌ది విప్లవాత్మక పాలన

-ప్రజల పక్షపాతి సీఎం .. దేశానికే ఆదర్శంగా అభివృద్ధి, సంక్షేమం.. పరకాల బహిరంగసభలో మంత్రి శ్రీ కల్వకుంట్ల తారకరామారావు -దేశ రాజకీయాల్లో కేసీఆర్ ముఖ్యభూమిక -తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యే అవకాశం -డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి -ఈ ఏడాది చివరికి వరంగల్‌కు మరిన్ని ఐటీ కంపెనీలు -ఎస్సార్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ -వేగంగా టెక్స్‌టైల్ పార్కు పనులు -వేసవి ముగిసేలోపే పాలనా భవన నిర్మాణాలు పూర్తిచేయాలి -మంత్రి కేటీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలు -టెక్స్‌టైల్ పార్కు స్థలంలో అధికారులతో సమీక్ష

స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో విప్లవాత్మకమైన పాలన కొనసాగుతున్నదని, దీనికి ప్రజల ఆమోదం ఉన్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో సోమవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు రూరల్, అర్బన్ జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి మంత్రి పాల్గొన్నారు. గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో టెక్స్‌టైల్ పార్కు స్థలంలో వివిధ శాఖల అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లోని ఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్సార్ ఇన్నోవేషన్ ఎక్సేంజ్‌సెంటర్‌ను కడియం శ్రీహరితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం పరకాలలో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ, సమైక్య రాష్ట్రం లో హేళనచేసిన నాయకులకు గుణపాఠం చెప్పేలా స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పాలనను అందిస్తూ ప్రజల పక్షపాతిగా కేసీఆర్ మారారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.

తెలంగాణ రాకముందు సీమాంధ్రులు తెలంగాణ ప్రాంత ప్రజలను, నాయకులను ఎన్నో రకా ల అవమానాలకు గురిచేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు మూడున్నరేండ్ల స్వరాష్ట్ర పాలనను చూసి సీమాంధ్ర నాయకుల కండ్లు తిరుగుతున్నాయని చెప్పా రు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో రైతులు పడిన కష్టాలు వర్ణనాతీతమని, నేడు రైతుల వద్దకే వెళ్లి పథకాలను వర్తింపజేస్తున్న తీరు అభినందనీయమని అన్నారు. 70 ఏండ్లలో ఎవరూ చేయని విధంగా ఎకరానికి రూ.4వేల చొప్పున పంటపెట్టుబడి అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దీనికి సాలీనా గరిష్ఠంగా రూ.10వేల కోట్లు ఖర్చవుతున్నాయని చెప్పారు. వ్యవసాయ ఆధారిత పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని, ఇప్పుడిచ్చిన నిధులే కాకుండా, ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీలేదు: డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాంగ్రెస్, బీజేపీలు ఈ దేశానికి, రాష్ర్టానికి చేసిందేమీలేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. అవినీతిని పెంచి పోషించిన ఆ పార్టీలు అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయన్నారు. బ్యాంకులను లూటీచేసేలా పరిపాలన సాగించిన పార్టీలు ఆ రెండేనని చెప్పారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ ముఖ్య భూమిక ఉండబోతున్నదని, దీనికి ప్రజలు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ వెంట నిలువాలని సభావేదికనుంచి ఆయన విజ్ఞప్తిచేశారు. జాతీయస్థాయి రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక అవసరమని, అది కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని కడియం చెప్పారు. దీంతో తెలంగాణలో అమలయ్యే ప్రతీ పథకం దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సభలో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, తాటికొండ రాజయ్య, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిపల్లి వాసుదేవరెడ్డి, పరకాల నగరపంచాయితీ చైర్మన్ మార్త రాజభద్రయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీ వినయ్, వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంపెల్లి ధర్మరాజు, జిల్లా రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ బొల్లె భిక్షపతి, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

టెక్స్‌టైల్ పార్కు పనులు వేగవంతం చేయండి టెక్స్‌టైల్ పార్కు పనులను మరింత వేగవంతం చేయాలని, వేసవి ముగిసేలోపే పరిపాలన భవన నిర్మాణాలను పూర్తిచేయాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్ పార్కు స్థలంలో సోమవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో 24 ఎకరాల భూమి అవసరమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చెప్పడంతో వెంటనే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ హరితను మంత్రులు ఆదేశించారు. టెక్స్‌టైల్ పార్కుకు అవసరమయ్యే 12.5ఎంఎల్‌డీ నీటిని రీయూజ్ చేసేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. 20 నిమిషాలపాటు డిప్యూటీ సీఎం కడియం, మంత్రి కేటీఆర్‌లు పార్కు స్థలంలో నిలబడి ఈ సమీక్ష నిర్వహించారు.

వరంగల్‌కు మరిన్ని ఐటీ కంపెనీలు జనసామాన్యానికి ఉపయోగపడే ఏ రకమైన సాంకేతిక ఆవిష్కరణకైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటపడుతారని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఏ సాంకేతిక విజ్ఞానమైనా సామాన్యులకు ఉపయోగపడాలన్న తపనతోనే తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పారు. సోమవారం వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లోని ఎస్సార్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎస్సార్ ఇన్నోవేషన్ ఎక్సేంజ్ సెంటర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో మనం నలుగురికి ఉపాధి ఇచ్చేలా ఎదుగుతామా? లేక నలుగురిలో ఒకరిగా ఉపాధి కోసం ప్రయత్నిస్తా మా? అన్నది తేల్చుకోవాలని యువతను కోరారు. భవిష్యత్తులో పెద్ద పెద్ద కంపెనీలు, ఎదిగిన కంపెనీలు అన్నీ ఆటోమేషన్‌వైపు వెళ్తాయని, రాబోయే పదిపదిహేనేండ్ల కాలంలో చిన్నచిన్న సంస్థలే పెద్దపెద్ద ఉద్యోగాలిచ్చే దిశగా మారబోతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ తరువాత వరంగల్‌లో అన్ని రంగాల ప్రగతికి అత్యం త ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. వరంగల్‌ను ఐటీ రంగంలో నిలిపేందుకు అనేక కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయని వివరించారు.సైయంట్ వంటి కంపెనీలు వచ్చాయని, టెక్ మహీంద్రా వంటి పెద్ద కంపెనీతోపాటు మరో మూడు నాలుగు పెద్ద కంపెనీలు ఈ ఏడాది చివరినాటికి ఇక్కడ యూనిట్లు నెలకొల్పేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని సభికుల హర్షధ్వానాల మధ్య మంత్రి ప్రకటించారు. ఉప ముఖ్యమం త్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ఐటీ రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచపటంలో మేటిగా నిలుపుతున్న ఘనత మంత్రి కేటీఆర్‌కు దక్కుతుందని కొనియాడారు. రతన్‌టాటా వంటి పారిశ్రామికయోధుడు కేటీఆర్ వంటి మంత్రి ఉంటే ప్రపంచాన్ని శాశించేవాళ్లమని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హన్మకొండ బాలసముద్రంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన క్యాంపు కార్యాలయంలో ఉదయం స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ తెలంగాణ అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, ఇతర వేద పండితుల సమక్షంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.