-తెలంగాణకు కాబోయే సీఎంకు పలువురి శుభాకాంక్షలు -కేసీఆర్ నివాసానికి ప్రభుత్వ అధికారుల తాకిడి

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావుకు అభినందనల వెల్లువ కొనసాగుతున్నది. రాజకీయ, ఉద్యోగ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ఆదివారం కేసీఆర్‌ను కలిసి టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి టీపీ దాస్, సీనియర్ ఐపీఎస్ అధికారి తేజ్‌దీప్‌కౌర్, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, టూరిజంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ చందనఖన్, అసెంబ్లీ సెక్రెటరీ రాజా సదారాం, ఐఏఎస్‌లు అనంతరాము, కేవీ రమణ, అజైయ్ జైన్, శ్రీధర్, వెంకటేశం, సంజయ్‌జాజు, నాగిరెడ్డి, ఐపీఎస్ అధికారి నవీన్‌చంద్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ సత్యనారాయణ, ఒలంపిక్ షూటర్ గగన్ నారంగ్ ఆదివారం కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు.
కేసీఆర్‌తో తెలంగాణ ఉద్యోగుల ఐక్య వేదిక భేటీ తెలంగాణ ఉద్యోగుల ఐక్య వేదిక అధ్యక్షుడు ఏ పద్మాచారి, ఉపాధ్యక్షులు రాములు, జీ శంకర్‌లతో కూడిన ప్రతినిధి బృందం కేసీఆర్‌తో ఆదివారం ఆయన నివాసంలో సమావేశమయ్యింది. ముఖ్యమంత్రి కాబోతున్నందుకు కేసీఆర్‌కు వారు శుభాకాంక్షలు తెలిపారు.

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు సరళకుమారి, స్వరూపారాణి, రేణుక, శిరోమణి అభినందనలు తెలిపారు. తెలంగాణ పీఆర్టీయూ సంఘం నేతలు పీ వెంకట్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సరోత్తంరెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, మధుసూధన్‌రెడ్డి ఆదివారం కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రిజన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపింది. చర్లపల్లి జైలు ఆవరణలో ఆదివారం సమావేశమైన అసోసియేషన్ జనరల్ బాడీ సభ్యులు అడ్‌హక్ కమిటీని రద్దు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
కేసీఆర్‌కు టీఆర్టీయూ శుభాకాంక్షలు టీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నికైన కేసీఆర్‌కు తెలంగాణ రీజినల్ టీచర్స్ యూనియన్ (టీఆర్టీయూ) శుభాకాంక్షలు తెలిపింది. యూనియన్ అధ్యక్షుడు ఎం మణిపాల్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సమావేశమైన యూనియన్ కార్యవర్గం టీఆర్ఎస్ ప్రభుతం ఏర్పడగానే పాఠశాల విద్యను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలని, వివిధ యాజమాన్యాలలోని ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరింది. తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల ఫోరం కేసీఆర్‌కు అభినందనలు తెలిపింది. ఫోరమ్ చైర్మన్ గొడిశాల బక్కయ్య సారధ్యంలో తెలంగాణ బ్యాంక్ ఉద్యోగులు ఆదివారం కేసీఆర్‌ను ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
జీఎంఆర్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జునరావు, మా టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ కూడా కేసీఆర్‌ను కలిసి అభినందనలు తెలిపారు. మరోవైపు కేసీఆర్ చిత్రపటానికి ఉస్మానియా యూనివర్సిటీలో గిరిజన విద్యార్థి సంఘం (జీవీఎస్), టీజీవీబీ, ఓయూజేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌నాయక్, సంపత్‌నాయక్, రవీందర్‌నాయక్, విష్ణు రమావత్, శ్రీనునాయక్, కష్ణ, అల్వార్‌స్వామి, జగన్నాయక్, శ్రీకాంత్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.