-స్వయం ఉపాధికి సరికొత్త పథకాలు
-రాష్ట్ర బడ్జెట్‌కు కొత్త రూపం
-వ్యవసాయం, కులవృత్తులు, స్వయం ఉపాధికి నిధుల కేటాయింపుల్లో పెద్దపీట
ప్రజల్లో ఉన్న ఆశలు, ఆకాంక్షలు, అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించ నుంది. సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రాధాన్యతలు కల్పిం చాలని సీఎం శ్రీ కె.చంద్రశేఖరరావు నిర్ణయించారు. రాష్ట్ర భవిష్యత్తుపై తన కున్న ఆలోచనలు, ముందుచూపు మేరకే అన్ని శాఖలకు మార్గనిర్ధేశం చేసి బడ్జెట్ ప్రతిపా దనలు తయారు చేయించారు. ఈ తరం యువతకు ఎక్కడా అసంతృప్తి కలుగకుండా ఉపాధి రంగానికి ప్రత్యే క ప్రాధాన్యత కల్పించబోతున్నారు. సరికొత్త వ్యూహాలతో స్వయం ఉపాధి పథకాలను రూపొం దించి చేయూత ఇవ్వనున్నారు. అదే సమయంలో కుల వృత్తులను మరింతగా ప్రోత్స హించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశా లను మెరుగుపర్చా లన్నది ప్రభుత్వ సంకల్పం. చదువుకున్న యువతను స్వయం ఉపాధి రంగంవైపు మళ్ళిం చేందుకు వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగం గా అంతరించి పోయిన కుల వృత్తులను సైతం వెలుగు లోకి తీసుకువచ్చి ప్రత్యేక ప్రోత్సాహకాలతో ఆదరిం చాలని కేసీఆర్ సంక ల్పించారు. మిగతా రంగాల్లోనూ గత కొంత కాలంగా ఉపాధి అవకాశాలపై అధ్యయనం చేసిన ఆయన కీలక శాఖల ద్వారా కొత్త పథకాలను ప్రకటించేందుకు సిద్ధ మయ్యారు. ఆ దిశగానే 2018-19 వార్షిక బడ్జెట్ కేటా యింపుల్లో ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతిపాదనలు తయారు చేయించారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రజలకు మరెన్నో శుభవార్తలను అందించనున్నారు. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారాన్ని బట్టి ముఖ్యమంత్రి మదిలో ఎనిమిది కొత్త పథకాలకు రూపకల్పన జరిగినట్లు తెలుస్తోంది. ఆ పథకాలను మార్చి నెలలో ప్రారంభమయ్యే వార్షిక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లి వేదికగా ప్రకటించాలని నిర్ణయించారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువజనోపాధి రంగాలకు మరింత ప్రాధాన్యత ఇస్తూ ఈ రంగాల్లోనే కొత్త పథకాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయిం చారు. ప్రత్యేకంగా పేద వర్గాల కోసం ఓ ఆరోగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలన్నది కేసీఆర్ ఆలోచన అని అనుయాయులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద కుటుంబాల విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక స్కాలర్‌షిప్ పథకం, చిన్న, సన్నకారు రైతు కుటుంబాల కోసం మరో రెండు సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత కోసం డ్వాక్రా తరహాలో ఎక్కువ లబ్ధిని చేకూర్చే వడ్డీలేని రుణ పథకం, వైఎస్ హయాంలో ఉన్న విధంగా కొత్త పేరుతో ముఖ్యమంత్రి యువజన యోజన పథకం ప్రారంభించి అన్ని వర్గాలను ఆకర్షించాలన్నది కేసీఆర్ మదిలో ఉన్న సరికొత్త ఆలోచన.
సామాజిక వర్గాలకు అతీతంగా పథకాల వర్తింపు సామాజిక వర్గాలకు అతీతంగా ఈ ఏడాది బడ్జెట్‌లో యువజనోపాధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలనుకుంటున్న ముఖ్యమంత్రి అందుకోసం వ్యక్తిగతంగా, యువజన సంఘాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను కల్పించబోతు న్నారు. గ్రామీణ ప్రగతి, ఉపాధి రంగాలతో ముడిపెట్టుకుని ఉన్న అన్ని శాఖల్లోనూ ఈసారి అనేక కొత్త పథకాలను ప్రకటించి, వాటి ద్వారా ఆశించిన ఫలితాలను సాధించే దిశగా ముందడుగు వేయాల్సిన అవసరముందని సీఎం తనతో పాటు గతంలో పనిచేసిన సీనియర్ మంత్రులతో స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ సమాచారాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో నవతరం యువతకు భారీ నజరానాలు ప్రకటించనున్నారు. అనధికారిక సమాచారం మేరకు సుమారు లక్షా 60వేల కోట్ల రూపాయలుగా ఉండే రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 40శాతం వాటాను సంక్షేమం, స్వయం ఉపాధి పథకాలకే కేటాయింనున్నారు.
మారుమూల గ్రామాలకూ ప్రాధాన్యత
మారుమూల గ్రామాల్లో సైతం మౌలిక వసతుల కల్పన, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, కుల వృత్తులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చేయూత ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలుగా ఉండనున్నాయి. గడిచిన మూడేళ్ళ పాలనలో పరిపాలనా సౌలభ్యం కోసం, వ్యవస్థ స్థిరీకరణ కోసం ప్రభు త్వం చేపట్టిన చర్యలన్నీ విజయవంతమైనందున వచ్చే ఏడాది లో ఫలితాలను సాధించి చూపాల్సిన బాధ్యతపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. ఆ దిశగా సీఎం కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసి పదునైన ఆలోచనలతో, దూరదృష్టితో ముందడుగు వేయాలని నిర్ణ యిం చుకున్నారు. అందులో భాగంగానే అన్ని శాఖల్లోనూ ప్రభుత్వం ఎంచుకు న్న లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించేలా నిర్ధిష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.
కీలక శాఖల్లో అభివృద్ధి, సంక్షేమం రెండు విభాగాలు ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే కీలక శాఖల్లో అభివృద్ధి, సంక్షేమం అనే రెండు వేర్వేరు విభాగాలను ఏర్పాటు చేసుకుని పథకాలు, కార్యక్రమాలను రూపొందించారు. అందుకు అవసరమయ్యే నిధులను దృష్టిలో పెట్టుకుని అంచనాలు తయారు చేయించారు. గత ఏడాది వివిధ రంగాలకు ఇచ్చిన ప్రాధాన్యత, నిధుల కేటాయింపులను తెలుసుకుని ఈ ఏడాది ఇవ్వాల్సిన ప్రాధాన్యతలను నెల రోజుల ముందుగానే కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఆ మేరకే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ, క్యాపిటల్ పద్దులపై అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు దృష్టి కేంద్రీకరించి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు. అన్ని సామాజిక వర్గాల్లో వెనుకబాటు తనాన్ని గుర్తించి పథకాల రూపకల్పనలో, నిధుల కేటాయిం పుల్లో ప్రాధాన్యత కల్పించనున్నారు. యువజన సర్వీసులు, యువశక్తి కార్యక్రమాలు, సెట్విన్, ఎన్‌సీసీ లాంటి అంశాలపై కూడా దృష్టిపెట్టి వాటి ద్వారా మరిన్ని ప్రయోజ నాలను చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. నేరుగా పేద, మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా, వారిని ఆకర్షించే విధంగా అన్ని శాఖలు తమతమ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఏప్రిల్ నుంచి వ్యవస్థీకృత మార్పులు ఈ ఏడాది ఏప్రిల్ మొదలుకుని వ్యవస్థీకృత మార్పులతో కొత్త పథకాలు కార్యరూపంలోకి రానున్నాయి. నూతన బడ్జెట్ విధానం ప్రకారం ప్లాన్, నాన్‌ప్లాన్ స్థానంలో క్యాపిటల్, రెవెన్యూ ఆదాయ, వ్యయాల పద్ధతిలో ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అలాగే అన్ని శాఖల్లో ప్రతిపాదనలను నిర్వహణ పద్దు, ప్రగతి పద్దుగా విభజించారు. నిర్వహణ పద్దులో సంస్థాగత కార్యక్రమాలు, నిర్వహణ, చెల్లింపులు, ప్రగతిపద్దులో సబ్సిడీలు, గ్రాంట్లు, స్కాలర్‌షిప్‌లు ఉంటాయి. ఈ ప్రతిపాదనలలో ఎస్సీ సబ్‌ప్లాన్, ఎస్టీ సబ్‌ప్లాన్‌లకు నిధుల కేటాయింపుల ప్రాధాన్యతలను స్పష్టం చేస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు కేటాయించిన నిధులకు యుటిలైజే షన్ సర్టిఫికెట్లను సమర్పించే అంశంపై సీఎం మార్గదర్శకాల మేరకు అధఙకార యంత్రాంగం కసరత్తు చేస్తున్నారు.