Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్‌కు నెటిజన్ల బ్రహ్మరథం

– ఏడాది పాలనకు జేజేలు – సర్వేలో సానుకూలంగా స్పందించిన 60 శాతం మంది – విద్యుత్ అంశానికి భారీ స్పందన – పథకాలు, ప్రణాళికలకు ఫిదా – నిరుద్యోగం, వ్యవసాయంపై మరింత దృష్టి పెట్టాలని సూచన

KCR-01

కేసీఆర్ పాలనకు నెటిజన్లు జై కొట్టారు. కొత్తగా సాధించుకున్న రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా సాగుతున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. అనేక వర్గాలకు కల్పించిన రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రశంసించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను శ్లాఘించారు. విద్యుత్ సమస్య పరిష్కరించిన తీరుకు నీరాజనం పట్టారు. ఏడాది కేసీఆర్ పాలన మీద ముగ్గురు సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో తెలుగుపల్స్ వేదిక నెటిజన్ల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో మొత్తంగా 60శాతం మంది కేసీఆర్ పాలనకు బ్రహ్మరథం పట్టగా, 23 శాతం మంది మామూలుగా ఉందన్నారు. ఇదే సమయంలో 17శాతం మంది మాత్రం వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాలన అనుకున్న స్థాయిలో లేదని చెప్పారు. అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో పారదర్శక విధానంలో నిర్వహించిన ఈ సర్వేలో కేసీఆర్ పాలన ఎలా ఉంది అనే ప్రశ్న వేసి 1. బాగా ఉంది. 2. మామూలుగా ఉంది. 3. బాగా లేదు అనే ఆప్షన్లు ఇచ్చారు. అభిప్రాయాలు సేకరించింది. వివిధ ప్రక్రియల ద్వారా 120960 మంది నెటిజన్లకు ఈ సర్వే చేరవేశారు. జూన్ 1నుంచి 4వ తేదీవరకు ఈ సర్వే సాగింది. పోల్‌లో 5656 మంది స్పందించి పాల్గొన్నారు. వీరిలో 3394 మంది పాలన బాగా ఉందని, 1301 మంది మామూలుగా ఉందని, 961 మంది బాగా లేదని ఆప్షన్ల ద్వారా అభిప్రాయాలు తెలియచేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో పురుషులు 70 శాతం, మహిళలు 30 శాతం ఉన్నారు. నెట్‌లో తెలుగుపల్స్ పేజీ ద్వారా 90 శాతం, వివిధ ఫేస్‌బుక్ పేజీల ద్వారా9 శాతం, ఇతర పద్ధతుల్లో 1 శాతం అభిప్రాయ సేకరణ జరిగింది. ఇందులో 1300 మంది తమ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో కూడా ప్రత్యేకంగా పొందుపరిచారు. సర్వేలో 18 నుంచి 32 వయసు కలిగిన వారు పాల్గొన్నారు.

సంతృప్తి, అభినందన.. ఈ సర్వేలో వెల్లడైన స్పందనలో అత్యధికులు కేసీఆర్ పాలన బాగుంది.. ఏ ముఖ్యమంత్రి ఏడాది కాలంలో చేయలేనివి చేశారని పేర్కొన్నారు. కరెంటు కోతలు నివారించడం ఎక్కువమందిని ఆకట్టుకుందని వారి వ్యాఖ్యల ద్వారా వెల్లడైంది. సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, నూతన పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు ఇలా వివిధ అంశాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే మొత్తానికి మొత్తం మారిపోతుందని అనడం కూడా సరికాదని, ప్రభుత్వం సవ్యదిశలో వెళుతున్నదన్న అభిప్రాయం వ్యాఖ్యల్లో వ్యక్తమైంది. ఒక సీనియర్ ఉన్నతాధికారి అభిప్రాయం వ్యక్తం చేస్తూ కేసీఆర్ పాలన బాగుందని, పరిపాలన తీరులో మార్పులు కనబడుతున్నాయని పేర్కొన్నారు.

వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడిన తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చారని, అది వివిధ పథకాలకు చేస్తున్న కేటాయింపులో కనిపిస్తున్నదని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డారు. పథకాలు బాగున్నాయి.. కేసీఆర్ అనుకున్నవి చేయగలిగితే ఇక తిరుగు ఉండదు అని హైదరాబాద్ నెటిజన్ ఒకరు తెలిపారు. కేసీఆర్ తానేంటో నిరూపించుకున్నారని కొందరు నీరాజనం పట్టారు. ఏడాది పాలనలో జనం పూర్తి విశ్వాసంతో ఉన్నారని, ప్రత్యేకించి తమ రాష్ట్రం తమకు వచ్చిందనే భరోసాతో పాటు తమ బాగోగులు చూసే నాయకుడు తమకు అండగా దొరికాడని అత్యధికులు తెలిపారు. సాధారణంగా ఒక్క ముక్కలో అభిప్రాయం వ్యక్తం చేసే పద్ధతి అధికంగా పాటించే నెటిజన్లు చాలామంది సూపర్ సీఎం, తెలంగాణ టైగర్, తెలంగాణ గాడ్ అని వ్యాఖ్యలు చేశారు.

సూచనలు.. జాగ్రత్తలు.. నిరసనలు ఇక కొంతమంది పాలన బాగుందని చెబుతూనే కొన్ని విషయాల్లో ఇంకా బాగా చేయాలనో.. పరిస్థితి మెరుగుపడాలనో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో కొన్ని అభిప్రాయాలు నిష్ఠూరం, నిరసన, సలహాలు, సూచనల రూపంలో వ్యక్తం చేశారు. ఎక్కువ మంది వ్యవసాయం, గ్రామాలపై ఇంకా ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. నిరుద్యోగం అంశాన్ని పలువురు ప్రస్తావించారు. వీటిలో సలహాలనుంచి విమర్శల దాకా అన్ని రకాల అభిప్రాయాలున్నాయి. ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ప్రోత్సహకాలపై కొందరు రుసరుసలాడారు. ఉద్యోగులు బాగా పనిచేయడం లేదని, వారికి బయోమెట్రిక్ హాజరు విధానం పెట్టాలని కోరారు. ఆంధ్రా అధికారులు ఇంకా కదలడం లేదని మరికొందరు పేర్కొన్నారు.

ఇక స్వానుభవాలు.. తమ ఊరు.. తమ ప్రాంతం.. తమ వర్గం అనే దృష్టితో కూడిన అభిప్రాయాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వీరు పాలనపై మొత్తంగా కాకుండా తమకు కావలసిన అంశాలపై పురోగతి లేకపోవడంపై అసంతృప్తి చెందినట్టు కనిపిస్తున్నది. ఉదాహరణకు కరీంనగర్ జిల్లా కేశవాపురం వాసి తమ ఊరికి ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్డు వేయడం లేదని నిరసన వ్యక్తం చేశారు. అది వేస్తేనే కేసీఆర్ పాలన గ్రేట్ అవుతుందని పేర్కొన్నారు. ఇలాంటి అభిప్రాయాలు సింగరేణి నుంచి కూడా ఎక్కువగా వచ్చాయి. ఓపెన్ కాస్టులు, కాంట్ట్రాక్టు, పర్మనెంటు కార్మికుల సమస్యలు ప్రస్తావించారు. కాంట్ట్రాకు ఉద్యోగుల పర్మనెంటు అంశం కూడా చాలా మంది ప్రస్తావించారు. ఎప్పటిలాగే ఈ సర్వేలో కొందరు సీమాంధ్రులు కూడా చొరబడి వెకిలి వ్యాఖ్యలు చేసి కడుపుమంట చల్లార్చుకున్నారు.

నెటిజన్ల అభిప్రాయాలు.. సురేందర్‌రెడ్డి: సూపర్. కానీ ఇంకా చేయాలి. రాజేశ్వర్ శీలం: 100/100. పాలన గోల్డెన్, విజన్ డైమండ్, పట్టుదల బంగారు తెలంగాణ, కల కరెంటు మిగులు, పాలన తిరుగులేని పాలన. మదుగుల గోపాల్: రియల్లీ ఎక్సలెంట్. గుడ్ అడ్మినిస్ట్రేటర్. రవి కుమార్ నాని: ఎంప్లాయిస్‌కి కాదు.. వ్యవసాయం చేసేవాళ్ళకు సాయం చేయాలి. రాధిక గన్నమంటి: సింగపూర్‌కు ఏపీని అమ్మేసిన చంద్రబాబు కంటే ఎంతో బెటర్. ఇంకా బాగుంటుంది. నాగుర్జున అంకూరి: టూ గుడ్ కాదు.. టూ బ్యాడ్ కాదు.. శ్రీనివాస్ గౌడ్: బాగుంది. కానీ షాబాద్ మండల్ డెవలప్‌మెంట్ లేదు. గ్రామాల రోడ్లు బాగాలేవు. గిరి: కేసీఆర్ ఇంటెలింజెంట్ అండ్ ఎక్స్‌ట్రాఆర్డినరీ లీడర్. రవి దాసరి: అన్నీ చేస్తున్నారు. కానీ నిరుద్యోగులకు ఏదో ఒకటి చేయాలి. రత్నమాల ఎలిశెట్టి: హైదరాబాద్ ఒక్కటే కాదు. మిగతా 9 జిల్లాలు కూడా బాగు చేయాలి. రావు నరసింహ : పౌల్ట్రీకి చాలా బాగుంది. మురళి తమన్: ఏ సీఎం కూడా వన్ ఇయర్‌లో ఇంత డెవలప్ చేయలేదు. శివ అడ్ల: రియల్ లీడర్. మా విలేజ్‌లో రోడ్డు లేకుండే. ఇపుడు రోడ్డు, కరెంటు, వాటర్ వచ్చినయ్. కీర్తిన లింగ: వన్ ఇయర్‌లో కేసీఆర్ చేసినంత ఎవరూ చేయలేదు. చేయలేరు కూడా. ఆశు యాదవ్: మాది కరీంనగర్ జిల్లా కేశవాపూర్. ప్రభుత్వాలు వచ్చి పోతున్నా రోడ్, నీరు, బస్సు కూడా లేదు. కేసీఆర్ చేస్తరేమోనని చిన్న ఆశ. చేస్తే గ్రేట్.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.