-ఆన్‌లైన్‌లో హవా -విజయన్,అమీర్ ఖాన్,సల్మాన్, షారుక్, సత్య నాదెళ్లను వెనుకకు నెట్టిన కేసీఆర్ -నిన్నగూగుల్ సెర్చ్‌లో ప్రముఖస్థానం
నేడు పాపులర్ ఇండియన్ పోటీలో..సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్-2014 అగ్రస్థానంలో సీఎం
రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆన్‌లైన్‌లో మరో రికార్డు సాధన దిశగా దూసుకుపోతున్నారు. నిన్నగాక మొన్న గత దశాబ్దంలో గూగుల్‌సెర్చ్‌లో అత్యధికులు అన్వేషించిన నాయకుడుగా ఎంపికైన కేసీఆర్ తాజాగా సీఎన్‌ఎన్-ఐబీఎన్ చేపట్టిన ఇండియన్ ఆఫ్‌ది ఇయర్-2014 కంటెస్ట్‌లో శుక్రవారం సాయంత్రం నాటికి 24 శాతం ఓట్లతో అగ్రస్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఓటు వేసే అవకాశం ఉన్న ఈ పోటీలో కేసీఆర్ చాలా వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మొదటి స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారి విజయన్‌ను సైతం వెనుకకు నెట్టి కేసీఆర్ ప్రథమ స్థానానికి చేరుకున్నారు.
14 సంవత్సరాల అలుపెరుగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమనేతగా దేశవాసులందరికీ కేసీఆర్ సుపరిచితమే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలు కూడా దేశంలో చర్చనీయాంశాలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎన్‌ఎన్-ఐబీఎన్ కేసీఆర్‌ను 2014లో ప్రముఖ భారతీయుడు పోటీకి ఎంపిక చేసింది. రాజకీయం, క్రీడలు, వినోదరంగం, విజ్ఞానరంగం తదితర అనేక రంగాలనుంచి 35 ప్రముఖులను ఎంపిక చేసి వారిలో నచ్చినవారికి ఓటు ఇచ్చే అవకాశం నెటిజన్లకు కల్పించింది.
http://www.indianoftheyear.com/vote.php www.facebook.com/indianoftheyear
బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ వంటి రాజకీయ ఉద్దండులతో పాటు ఆమిర్‌ఖాన్, సల్మాన్, షారూక్ వంటి సినీ దిగ్గజాలు, సత్యనాదెళ్ల, చేతన్ భగత్, చందా కొచ్చర్, సానియా మీర్జా వంటి వివిధ రంగాల ప్రముఖులు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. అయినా తెలంగాణ రాష్ట్ర సాధనతో దేశ ప్రజల అందరి దృష్టిని ఆకర్షించిన కేసీఆర్ వారందరినీ వెనక్కి నెట్టేశారు.
24 శాతం ఓట్లతో.. ఇండియన్ ఆఫ్‌ది ఇయర్ -2014 పోటీలో కేసీఆర్ 24శాతం ఓట్లతో అందరి కంటే ముందు వరుసలో నిలిచారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు మొదటి స్థానంలో ఉన్న ఐపీఎస్ అధికారి విజయన్‌ను వెనక్కి నెట్టి శుక్రవారం సాయంత్రానికి కేసీఆర్ ప్రథమ స్థానానికి చేరుకున్నారు. కాగా ప్రస్తుతం విజయన్ 20శాతం ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలువగా, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కేవలం 8 శాతం ఓట్లతో మూడవ స్థానంలో, కాశ్మీర్ వరదల సందర్భంగా సహాయక చర్యల్లో అత్యంత తెగువను చూపిన ఇండియన్ ఆర్మీ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీం 6శాతం ఓట్లతో నాలుగవ స్థానంలో, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 5శాతం ఓట్లతో ఐదవ స్థానంలో నిలిచారు.
సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇండియన్ ఆఫ్‌ది ఇయర్ పోటీ చేపట్టడం ఇది తొమ్మిదోసారి. ఈ పోటీ జనవరి నెలాఖరుతో ముగుస్తుంది. అవార్డుల ప్రదానోత్సవం నెలాఖరుకు నిర్వహిస్తారు. తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ది ఇండియన్ ఆఫ్ ది ఇయర్-2014 అవార్డుకు ఎన్నుకోవాలనుకుంటే మీరు ఐఓటీఐ(ioty) ఫేస్‌బుక్ పేజిలో ఓటు వేయండి. లేదా www.indianoftheyear.com, www.facebook.com/indianoftheyear కు లాగిన్ అయి పేజీని చూడండి.