తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన కేసీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేనిఫెస్టోలోని అంశాలు క్రింది విధంగా ఉన్నాయి.
* రైతులను లక్షాధికారులను చేస్తాం. * భూమిలేని నిరుపేదలకు 3ఎకరాల చొప్పున భూమి, సంవత్సరం పెట్టుబడి. * రైతులకు లక్ష రూపాయల వరకు క్రాప్ లోన్ మాఫీ. * ముస్లిం మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్. * వికలాంగులకు రూ.1500, వితంతువులకు రూ.1000 పెన్షన్. * ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీటి సౌకర్యం. * కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ. * తెలంగాణలో కొత్తగా 14జిల్లాలను ఏర్పాటు చేయడం. * అమరవీరుల కుటుంబాలకు 10లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం. * తెలంగాణ చెరువులకు, కుంటలకు పూర్వ వైభవం తీసుకొస్తాం. * సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. * లక్షల కోట్ల విలువైన వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైన వాటిని విడిపించేందుకు టీఆర్ఎస్ సుప్రీం కోర్టులో కేసులు వేసింది. వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు ఇస్తాం. * హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్ ల ఏర్పాటు. * రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు. * రాష్ట్ర పండుగగా బతుకమ్మ. * సంచార్ కమిటీని తూచా తప్పకుండా పాటిస్తాం. * బలహీన వర్గాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు. * ఆటోలకు రవాణా పన్నునుండి మినహాయించి, రవాణాశాఖ అధికారుల వేధింపులు లేకుండా చర్యలు తీసుకుంటాం. * తెలంగాణ భూముల వివరాలు కంప్యూటరైజేషన్. * గృహనిర్మాణ లబ్ధిదారుల రుణాలు మాఫీ. * వ్యవసాయరంగంలో ఆధునిక పద్ధతులు తెస్తాం. * మూడేళ్లకోసారి మాత్రమే ఉద్యోగుల బదిలీ ఉంటుంది. * కొత్తగా పది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వాటిద్వారా లక్షమందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పన. * కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంధ విద్య. కేసీఆర్ ఆదేశం మేరకు ఎంపికైన అభ్యర్థులు ఉదయమే తెలంగాణ భవన్ కు చేరుకోగా, వారితో తెలంగాణ తల్లి సమక్షంలో కేసీఆర్ ప్రమాణం చేయించారు. పార్టీ అభ్యర్థిగా ఎంపికైన నేను ఎలాంటి రాజకీయ అవినీతికి పాల్పడనని, నాయకుని ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని, నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని అందులో సారాంశం.