Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్ తీన్మార్

మనం కలలుకన్న బంగారు తెలంగాణ అనుకున్నది అనుకున్నట్లుగా సాధించుకోవాలంటే ఆరునూరైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి తీరాలని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లతోపాటు.. నగరంలోని మాల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలోని అల్వాల్‌లో జరిగిన భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడారు.

KCR in Chevella Meeting

-మూడు సభలు.. ముమ్మర ప్రచారం -షాద్‌నగర్, చేవెళ్ల, అల్వాల్‌లో పోటెత్తిన జనం -కేవీపీ భేతాళ మాంత్రికుడు.. చంద్రబాబు శని -పొన్నాల గరీబోడు.. ఆయనకు నాయకత్వం తెల్వదు -ఇద్దరు నాయుళ్ల చీకటి కుట్రే టీడీపీ, బీజేపీ పొత్తు -రెచ్చగొట్టేందుకే జేపీ, దినేష్‌రెడ్డి మల్కాజిగిరిలో పోటీ -కాంగ్రెసోళ్లు ఉద్యమం చేసిందెప్పుడు? -ప్రజలకేం కావాలో టీఆర్‌ఎస్‌కే తెలుసు -కొట్టినా తిట్టినా నేను తెలంగాణ పక్షమే -నాలాంటి మొండోడు ఉంటేనే అభివృద్ధి -పొట్టకొట్టే సీమాంధ్రులపైనే మా పోరాటం -జన్మలో చూడని హైదరాబాద్‌ను చూపిస్తా -మహిళా సంఘాలకు 600కోట్లతో నిధి ఏర్పాటు -ఆంధ్రోళ్లు కబ్జా చేసిన భూములను కక్కిస్తం

-పార్టీ ప్రచారసభల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. భేతాళ మాంత్రికుడైన కేవీపీ మోచేతి నీళ్లుతాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధికారం అప్పగిస్తే వాళ్లు తెలంగాణను నిలువునా ముంచుతారని హెచ్చరించారు. పొన్నాల గరీబోడని, ఆయనకు నాయకత్వం తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును శని అంటూ అభివర్ణించిన కేసీఆర్.. తెలంగాణలోని అక్రమాస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు, వెంకయ్యనాయుడు చీకటి పొత్తులుపెట్టుకుని, టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకూడదని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

ఎవరెన్ని కుట్రలు చేసినా.. తెలంగాణలో వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏం కావాలో, ప్రజలేం కోరుకుంటున్నారో ఉద్యమపార్టీగా టీఆర్‌ఎస్‌కే తెలుసని ఆయన తేల్చి చెప్పారు. తలరాతలు మార్చుకునే సందర్భంలో ఏమరుపాటు తగదని ఓటర్లను అప్రమత్తం చేశారు. తెలంగాణలో ఆంధ్రోళ్లు కబ్జా చేసిన భూములను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తీసుకుంటామని కేసీఆర్ స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు ఇచ్చే రుణాన్ని పది లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. వారిని ప్రోత్సహించేందుకు రూ.600కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు రాబోతున్న హైదరాబాద్‌ను విశ్వస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామన్న కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే జన్మలో చూడని హైదరాబాద్‌ను చూపిస్తానని ప్రకటించారు. తనలాంటి మొండోడు ఉంటేనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఖండాంతరాలు దాటుతుందని చెప్పారు. తనను కొట్టినా.. కోసినా తెలంగాణ పక్షాన్నే మాట్లాడుతానని తేల్చి చెప్పారు.

మనం కలలుకన్న బంగారు తెలంగాణ అనుకున్నది అనుకున్నట్లుగా సాధించుకోవాలంటే ఆరునూరైనా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చి తీరాలని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. భేతాళ మాంత్రికుడు కేవీపీ రామచంద్రరావు మోచేతి నీళ్లు తాగే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అధికారం అప్పగిస్తే తెలంగాణ రాష్ర్టానికి ఏం ఒరగబెట్టరని, నిండా ముంచుతారని ధ్వజమెత్తారు. 13 ఏళ్లు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఏవిధంగా అభివృద్ధి చేసుకోవాలో, ప్రజలకు ఏం కావాలో ఉద్యమపార్టీగా తమకు తెలున్నారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు తెలంగాణ ప్రయోజనాలను కాపాడలేరని తేల్చిచెప్పారు. ఆంధ్రోళ్లు కబ్జా చేసిన భూములను టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక స్వాధీనం చేసుకుంటామని, కబ్జాదారులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

తమ అక్రమాస్తులను కాపాడుకునేందుకే చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు చీకటి పొత్తులు పెట్టుకొని టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో వచ్చేది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 90 ఎమ్మెల్యే స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ను లేకుండా చేయాలని భావించిన వైఎస్.. భేతాళ మాంత్రికుడు కేవీపీ ద్వారా తనకు వేల కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినా, తాను లొంగలేదని చెప్పారు. దీంతో కేసీఆర్ చావడు.. తెలంగాణ ఉద్యమాన్ని చావనియ్యడు.. అని ఆంధ్ర నేతలు తనను దూషించారన్నారు. చేవెళ్లలో శనివారం సాయంత్రం టీఆర్‌ఎస్ నిర్వహించిన చేవెళ్ల గర్జన సభలో కేసీఆర్‌తో పాటు చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థులు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, కేఎస్ రత్నం, సంజీవరావు, స్వర్ణలతరెడ్డి, శంకర్‌గౌడ్, కొత్త మనోహర్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ డీజీపీ పేర్వారం రాములు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సభకు హాజరైన భారీ జనసందోహాన్నుద్దేశించి కేసీఆర్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే… తెలంగాణ వచ్చిన తొలి రోజుల్లో జరుగుతున్న ఈ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. తెలంగాణ రాష్ట్రం త్యాగాలతో వచ్చింది. వందల ఆత్మబలిదానాలు, వేల కేసులు, అంతకు మించి దీక్షలు, పోరాటాల ఫలితమే ప్రత్యేక రాష్ట్రం. తెలంగాణకు ఇప్పుడు ఏం కావాలి? ఇక్కడి ప్రజలకు ఏం చేయాలి? అన్నది ఇప్పుడు ఎవరు నిర్ణయించాలి? ఈ సమయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న దెబ్బతింటాం. మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. మన కష్టాలు, బాధలు ఎవరి ద్వారా తీరుతాయో ప్రజలు గ్రహించేలా చైతన్యపరచాలి. మన తలరాతలు మార్చుకునే సమయం వచ్చింది.

ప్రజలకు ఏం కావాలో కాంగ్రెసోళ్లకు తెల్వదు కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణను ఎట్ల అభివృద్ధి చేసుకోవాలో? ఇక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెసోళ్లకు సోయిలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది ప్రజల్లోకి వెళ్లి చెప్పుకునే సోయిలేదు. కానీ పొన్నాల లక్ష్మయ్య, ఇంక ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ నాయకులు పొద్దుగాలోడు.. పొద్దుమీకోడు ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్‌ను విమర్శించుడు తప్ప ఇంకేమీ పనిలేదు. టీ కాంగ్రెస్ నేతలు నిఖారుసైన తెలంగాణవాదులైతే ఆంధ్రోళ్లు పొన్నాల, జానారెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టకుండా, కేసీఆర్ దిష్టిబొమ్మలు ఎందుకు తగలబెడుతున్నారు? పొన్నాల గరీబోడు. ఆయనకు నాయకత్వం తెల్వదు.

ఆంధ్రోళ్ల డబ్బులతో, కేవీపీ పైరవీతో పీసీసీ అధ్యక్షుడయ్యిండు. ఆయన తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తడు? ఆయనను తిట్టి వేస్టు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలో, సీమాంధ్ర ఉద్యోగులు సీమాంధ్రలో పనిచేయాలంటే టీ కాంగ్రెస్ నేతలు నా మీద ఎగిరిపడుతుండ్రు. నేను మాట్లాడేది తప్పా? నేను గట్లనేఅంటా. కొట్టిన, కోసినా తెలంగాణ దిక్కే మాట్లాడుతా.

ఆంధ్రోళ్లు కబ్జా చేసిన భూములను కక్కిస్తాం … తెలంగాణలో ఆంధ్రోళ్లు కబ్జా చేసిన భూములను ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తీసుకుంటాం. వక్ఫ్ భూములను తిరిగి వక్ఫ్ బోర్డుకు అప్పగిస్తాం. వక్ఫ్ బోర్డుకు జ్యూడిషియల్ హోదా కల్పిస్తాం. ఆంధ్రోళ్లు ప్రభుత్వ భూములను, ముస్లిం వక్ఫ్ బోర్డు భూములను అక్రమంగా కబ్జా చేశారు. వైఎస్ తమ్ముడు, చంద్రబాబు బంధువు.. అక్కినేని నాగార్జున ఇలా ఆంధ్ర బడా నేతలు, పెద్దమనుషులుగా చలామణి  అవుతున్న కబ్జాకోరులు ఎవ్వరినీ వదిలిపెట్టం. వీరందరూ హైటెక్ సిటీ పక్కన గురుకుల ట్రస్ట్, ముక్తుబండి, వక్ఫ్ భూములను వందల ఎకరాల్లో అక్రమించుకున్నారు.

టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే వీరందరి బండారం బయటపెడుతాం. జిల్లాలో భూదాన ఉద్యమంలో ఆచార్య వినోభాబావేకు రామచంద్రారెడ్డి దానం ఇచ్చిన లక్ష 14వేలఎకరాల్లో 90శాతం కబ్జా పెట్టిన వారి భరతం పడతాం. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో తాము అక్రమంగా దండుకున్న ఆస్తులు పోతాయన్నా భయంతోనే ఆంధ్రోళ్లు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు గెలిచేలా వేల కోట్లు కుమ్మరిస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు విజ్ఞతతో మన ప్రాంతంలో మన పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి.

రైతులకు రుణ మాఫీ.. మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణ ఏం చేయబోతున్నమనేది మ్యానిఫెస్టో ద్వారా సభల్లో ఇప్పటికే చెప్పాం. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ తప్పక అమలు చేస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు 100శాతం రవాణా పన్నును రద్దు చేస్తాం. వితంతువులు, వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పింఛన్ నూరు శాతం అమలు చేస్తాం. బలహీనవర్గాలకు 125 గజాల్లో రెండు బెడ్‌రూమ్‌లు, హాల్, వంటగది, బాత్‌రూమ్‌లతో ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది. మహిళలకు ఎనిమిది లక్షల వడ్డీలేని రుణం ఇస్తామనుకున్నాం. కానీ మహిళలు ఫోన్లు చేసి ఈ పథకం బాగుందన్నా.. పది లక్షల వరకు పెంచాలి అని కోరిండ్రు. మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు రూ.600కోట్ల అదనంగా ఖర్చు అయినా కచ్చితంగా వడ్డీలేని రుణాలు అందజేస్తాం. ఐకేపీ సిబ్బందికి కేవలం రూ.2వేల జీతం ఇస్తున్నారు. వాటికీ ఎనిమిది నెలలుగా దిక్కులేదు. తెలంగాణలోని 18వేల మంది ఐకేపీ సిబ్బందికి నెలకు రూ.5వేల జీతం ఇస్తాం. రెగ్యులరైజ్ చేస్తాం. ఆటో, రిక్షాల టాక్స్‌లను రద్దు చేసి, పేద వర్గాల నిరుద్యోగ యువతను ఆదుకుంటాం. గిరిజనులకు, మైనార్టీలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తాం.

టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి : విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ కాపీ కొట్టిందని విమర్శించారు. విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు టీఆర్‌ఎస్‌కు పూర్తి మద్దతుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ దమ్ము లేక పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో దిగాయని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని, ప్రజలే సొంత పార్టీగా భావించి గెలిపించేందుకు ముందుకొస్తున్నారని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. వేలమంది సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు చేస్తుండగా, తెలంగాణ నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతంపై మమకారం లేని నేతలు రాష్ట్రం కోసం మాట్లాడుతున్నారని, ఇది వారి అవివేకమని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేయాల్సింది తప్ప తెలంగాణ ప్రభుత్వంలో ఎలా పనిచేస్తారని ఆయన ప్రశ్నించారు. అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని స్పష్టం చేశారు.

విశ్వనగరంగా హైదరాబాద్ తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయనేది ఆంధ్రోళ్ల కిరికిరి. నిజానికి రాబోయే ప్రభుత్వంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రాజధానితోపాటు సమీపంలోని రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. మరో సిలికాన్ వ్యాలీగా, చైనాలోని షాంఘై నగరం తరహాలో హార్డ్‌వేర్ హబ్‌గా మార్పు చెంది, రెండు కోట్ల విలువ చేసే భూమి ఇరవై కోట్లకు చేరుకుంటుంది.

భారీ ఎత్తున నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రంగారెడ్డి జిల్లాకే కాకుండా రాజధాని హైదరాబాద్ విద్యుత్ అవసరాల కోసం శంకర్‌పల్లి ప్రాజెక్టును సాధిస్తాం. 4వేల మెగావాట్ల అల్ట్రా ప్రాజెక్టు ఏర్పాటు చేసి 16వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. రంగారెడ్డిజిల్లా పరిసరాల్లో మరో ఎయిర్‌పోర్ట్ అవసరముంది. కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు 200 ఏళ్లు అయినా పూర్తి కాదు. జూరాల నుంచి కృష్ణా జలాలను తరలించి పశ్చిమరంగారెడ్డిలోని లక్ష ఎకరాలకు సాగునీరుతోపాటు హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తాం. పైలల్ ప్రాజెక్టుగా కూరగాయల సాగు పరిశోధన కేంద్రాన్ని చేవెళ్లలో ఏర్పాటు చేస్తాం.

చంద్రబాబు.. ఓ శని చంద్రబాబుకు తెలంగాణలో ఇంకా పని ఏముంది? మెడలు పట్టి నూకిన పొడంట! ఆయన మాకో శని. టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు చంద్రబాబు, వెంకయ్య చీకటి కుట్రలు చేసిండ్రు. తెలంగాణ బీజేపీ నేతలు తెలంగాణ వ్యతిరేకి టీడీపీతో పొత్తు వద్దంటున్నా వీరిద్దరూ కూడబలుక్కొని పెట్టుకున్న పొత్తుల మర్మమేమిటో ప్రజలకు తెలుసు. టీఆర్‌ఎస్ ముమ్మాటికీ సెక్యులర్. మతతత్వ బీజేపీ పార్టీతో ఎట్టిపరిస్థితుల్లో కలిసేది లేదు. ముస్లిం సోదరులంతా టీఆర్‌ఎస్‌కు అండగా నిలబడాలి. కాంగ్రెసోళ్లు ఉద్యమం చేసిందెప్పుడు? షాద్‌నగర్, ఏప్రిల్ 19 (టీ మీడియా):తనను కొట్టినా, తిట్టినా, తెలంగాణ ప్రజల పక్షాన్నే మాట్లాడతానని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగులకు స్థానంలేదని, తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెబితే కాంగ్రెసోళ్లకు ఎందుకు కోపం వస్తున్నదని నిలదీశారు.

-ఉద్యమాలు చేసినోడికి తెలుస్తుంది తెలంగాణ బాధ

-కొట్టినా.. తిట్టినా.. నేను తెలంగాణ పక్షమే -తెలంగాణ ఉద్యోగుల గురించి మాట్లాడితే కాంగ్రెసోళ్లకు ఎందుకు కోపం? -షాద్‌నగర్ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ఈ విషయంలో పొన్నాల, దామోదర, జానారెడ్డిలు తనపై విమర్శలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంకోసం కాంగ్రెసోళ్లు ఏనాడైనా ఉద్యమాలు చేశారా? తెలంగాణ ప్రజలు పడుతున్న గోసను పట్టించుకున్నరా? బస్సులకు అడ్డం పడ్డారా? రైళ్లను ఆపారా? రాస్తారోకోలు చేశారా? అంటూ మండిపడ్డారు. ఉద్యమాలు చేయని కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజల బాధలు ఎలా తెలుస్తాయని అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఆంధ్రోళ్ల పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్లేనన్నారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన వెంకయ్యనాయుడి బంధువులు జడ్చర్ల ప్రాంతంలో పేదల భూమిని కబ్జా చేశారన్న కేసీఆర్.. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న 18వేల విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లకు రూ.5వేల వేతనాన్ని చెల్లిస్తామని, అవసరమైతే శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పారు. అగ్నిమాకపశాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఐకేపీల ద్వారా ప్రతి మహిళా సంఘానికి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు వడ్డీలేని రుణాలను ఇచ్చి, వారి అభివృద్ధికి తోడ్పడతామని, రూ.ఒక లక్షవరకు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. జిల్లాలోని 14లక్షల ఎకరాలకు సాగునీరు అందేవిధంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితే పశ్చిమ రంగారెడ్డి జిల్లాలోని గ్రామాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని గ్రామాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. మన కలలు సాకారం చేసుకోవాలంటే కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సాధించుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలంటే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉండాలన్నారు.

40ఏళ్ల కాంగ్రెస్ పాలన, 20ఏళ్ల టీడీపీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయం ఏమిటో మీకే తెలుసని, ఆ పార్టీలకు మరోసారి ఓటేస్తే మనకు అన్యాయమే తప్ప న్యాయం జరగదన్నారు. పాలమూరు ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఈ జిల్లా వాసుల గొప్పతనమని, మీరు, మీ జిల్లా చరిత్రలో లిఖించదగిదని కొనియాడారు. మహబూబ్‌నగర్ జిల్లాకు ఎంతో రుణపడి ఉన్నానని చెప్పారు. మన కళలు సాకారమయ్యేంత వరకు చిత్తశుద్ధితో పని చేస్తానని తెలిపారు. ఉద్యమకారులు, కవులు, కళాకారులు, కార్మికులు, ఉద్యోగులు, మహిళలు టీఆర్‌ఎస్ గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.