Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతల భేటీ

తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుతో పలు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ఆదివారం భేటీ అయ్యారు. సీఎం కాబోతున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, తమ సమస్యలను వివరించి పరిష్కరించాలని కోరారు. ఇరిగేషన్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల పంపకాల్లో తప్పనిసరిగా స్థానికతను పరిగణలోకి తీసుకుని ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతాల్లోనే పనిచేసేలా పంపకాలు జరిపించాలని కోరారు. ఈమేరకు కేసీఆర్‌కు వినతిపత్రం సమర్పించారు.

-టీఆర్‌ఎస్ అధినేతకు సమస్యల ఏకరువు -తెలంగాణ తొలి సీఎం కాబోతున్నందుకు శుభాకాంక్షలు

KCR With employees

ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యోగులపై ఆంధ్ర పాలకులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ పలు శాఖలలోని 400 మంది ఉద్యోగులను ఏసీబీ కేసులలో ఇరికించి ప్రమోషన్లు, సర్వీస్ బెనిఫిట్స్ రాకుండా వేదిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ అనిల్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ పవర్ జేఏసీ చేపట్టిన సమ్మె, తదనంతర పరిణామాలను తెలంగాణ పవర్ జేఏసీ ప్రతినిధులు శివాజీ, స్వామిరెడ్డి, జానయ్య, సమ్మయ్య తదితరులు కేసీఆర్‌కు విన్నవించారు. నవ తెలంగాణ నిర్మాణానికి ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తూ టీ జైళ్ల శాఖ ఉద్యోగుల అసోసియేషన్ చేసిన తీర్మానాన్ని అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం కేసీఆర్‌కు అందజేశారు. అధికార పగ్గాలు చేపట్టగానే తొలుత ఆరోగ్య శ్రీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తనను కలిసిన తెలంగాణ ఆరోగ్యశ్రీ ఉద్యోగ సంఘం నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చారు.

సంఘం అధ్యక్షుడు పీ చంద్రశేఖర్, ప్రతినిధులు హరిప్రసాద్, తారక్, పాండు, శ్రీనివాస్ గౌడ్, ఈశ్వర్ కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ వాణిజ్య పన్నులశాఖ ఎన్‌జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వతాలు వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ నేతలతో కలిసి కేసీఆర్ ఆయన నివాసంలో ఆదివారం కలిశారు. ముఖ్యమంత్రి కాబోతున్నందుకు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ పంజాగుట్ట డివిజన్ అధ్యక్షుడు జీ శివరావు, కార్యదర్శి ఎం నర్సింగ్‌రావు, సికింద్రాబాద్ అధ్యక్షుడు లక్ష్మణ్, జలీల్, అబిడ్స్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, బేగంపేట అధ్యక్షుడు అనిల్‌కుమార్, రూరల్ నరసయ్య, రవీందర్‌రెడ్డి, సరూర్‌నగర్ శేఖర్, ఉదయ్‌కుమార్, చార్మినార్ ప్రతినిధి యాదయ్య, వరంగల్ ప్రతినిధి ప్రభాకర్, కరీంనగర్ ప్రతినిధి భిక్షపతి, ఆదిలాబాద్ ప్రతినిధి హరికిషన్, నిజామాబాద్ ప్రతినిధి లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

బోర్డ్ ఆఫ్ ఇంటర్ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంటా జగన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాకరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఎర్ర లక్ష్మయ్య, కార్యదర్శి ఎల్. భీంసింగ్ నాయక్, అవినాష్ సింగ్, శివశంకర్ సింగ్, తోట వేణుగోపాల్ రావు,దివ్యకుమారి, నాగలక్ష్మీ, దివ్య తదితరులు కేసీఆర్‌ను కలిసి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. భద్రాచలం, మంత్రాలయం దేవాలయాల అర్చకులు, సిబ్బంది కేసీఆర్‌ను కలిసి ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు, స్వామి వార్ల ఫొటోలను అందజేశారు. రాజమండ్రి రేంజ్ జైళ్ల శాఖ డీఐజీ ఏ నర్సింహ్మ, జైళ్లశాఖ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా కలిసి కేసీఆర్‌ను అభినందించారు. అదే విధంగా ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు కే సుభాష్, డీ లక్ష్మీనారాయణ కూడా కలిశారు. జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటేలా జరుపుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ 1 అర్ధరాత్రి నుంచే సంబురాలు ప్రారంభించాలని సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.