Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్‌తో నడిస్తే నీళ్లు బాబుతో కలిస్తే కన్నీళ్లు

-వలసపాలకులకు సద్దులు మోస్తున్న కాంగ్రెసోళ్లు
-పాలమూరులో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీళ్లిచ్చాం
-వలస వెళ్లిన కూలీలంతా వాపస్ వచ్చిండ్రు
-కొడంగల్‌లో గులాబీ జెండా ఎగురడం ఖాయం: మంత్రి హరీశ్‌రావు
-కొడంగల్ నియోజకవర్గం నుంచి భారీగా టీఆర్‌ఎస్‌లో చేరికలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నడిస్తే పొలాలకు సాగునీళ్లు అందుతాయని, చంద్రబాబుతో కలిసి నడిస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎప్పుడూ ఆంధ్రపాలకుల పల్లకీలు మోస్తున్నారని, నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిలను మోసినవాళ్లు.. నేడు చంద్రబాబు పల్లకీ మోసేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం నాలుగేండ్లలో లక్షన్నర ఎకరాలకు సాగునీరందించి పాలమూరును పచ్చగా మార్చిందని చెప్పారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం కొడంగల్ నియోజకవర్గం బొంరాస్‌పేటకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలతోపాటు, ముదిరాజ్, మత్స్యకార సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 60 ఏండ్లుగా తెలంగాణను వంచిస్తూ.. సంపదను దోచుకుపోయిన వలస పాలకులను తరిమికొట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు కాంగ్రెసోళ్లు ఆ దొంగలకు సదులు ్దమోస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ పక్కా ఆంధ్రాపార్టీ అని, అది తెలంగాణ ప్రయోజనాలను కాలరాస్తున్నదని అన్నారు.

70 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పాలమూరు జిల్లాలో లక్షన్నర ఎకరాలకు మాత్రమే సాగునీరిస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేండ్లలోనే ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరిచ్చిందని, పాలమూరు పచ్చబడి వలసబోయిన కూలీలంతా వాపస్ వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. 2009 ఎన్నికల్లో తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు సాయంత్రానికల్లా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాటమార్చి.. తెలంగాణకు, హైదరాబాద్‌కు పోవాలంటే వీసాలు, పాస్‌పోర్టులు కావాలా? అని రెచ్చగొట్టినప్పుడు ఇక్కడి కాంగ్రెస్ నాయకులు పౌరుషం లేకుండా ఆయన పల్లకీ మోశారని.. ఒక్క చిత్తూరు జిల్లా తాగునీటి కోసం రూ.7వేల కోట్లు కేటాయించి, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అసెం బ్లీ సాక్షిగా విర్రవీగిన నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెనుక చేరి బల్లలు చరుస్తూ, కేరింతలు కొడు తూ పదవుల కోసం ఆయన పల్లకీ మోశారని, ఇప్పు డు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల మోటర్లను బంద్‌పెట్టాలని కేంద్రానికి ఫిర్యాదు చేసి పాలమూరు ప్రజల పొట్టకొట్టాలని కుట్రలు చేస్తున్న చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని మండిపడ్డారు.

ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో టీడీపీ చేరి రెండు మంత్రి పదవులు తీసుకోవాలని అనుకుంటున్నారని, వాటిలో ఓటుకు నోటు కేసును ఎత్తివేయించుకునేందుకు హోం ఒకటి కాగా, రెండోది తెలంగాణ పంట భూ ములను ఎండబెడుతూ కృష్ణా, గోదావరి జలాలలను సీమాంధ్రకు తరలించుకుపోయేందుకు నీటిపారుదలశాఖ తీసుకుంటుందని ఎద్దేవా చేశారు. నాలుగు సీట్ల కోసం అవకాశవాద పొత్తులు పెట్టుకున్న కాం గ్రెస్, టీడీపీలను ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజమంతా ఏకమై అభివృద్ధిని గెలిపించి, అవకాశవాదాన్ని ఓడించాలన్నారు. కాం గ్రెస్ నేతలు మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారని, బతుకమ్మ చీరెలు పంచకుండా అడ్డుకున్నారని అన్నారు.

కొడంగల్ టీఆర్‌ఎస్‌దే..
ఈ ఎన్నికల్లో కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌దే విజయమని, అక్కడ గులాబీ జెండాఎగురడం ఖాయమని హరీశ్‌రావు స్పష్టంచేశారు. కొడంగల్‌కు సాగు, తాగునీరు కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. తండాలను పంచాయతీలుగా మార్చి గిరిజనులకు న్యాయంచేసిన పార్టీ టీఆర్‌ఎస్ అని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కరం ట్ లేక ప్రజలు నరకయాతన పడ్డారని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 24 గంటల నిరంతర విద్యు త్ సరఫరా జరుగుతున్నదని పేర్కొన్నారు. కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకోవడానికి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటిని కొనసాగించడానికి, వేగంగా పూర్తిచేయడానికి మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ సందర్భంగా తిరుపతయ్య, పిట్లం రాములు, మహేందర్, కొడి వెంకటయ్య, మెట్ల శ్రీనివాస్, సత్తయ్య తదితరులతోపాటు 600 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాం చందర్‌రావు, పార్టీ నాయకులు ముద్దప్ప, కొడంగల్ నియోజకవర్గ నాయకులు బాలసింగ్, సత్తయ్య, మెట్టు శ్రీనివాస్, యాదగిరి, మధుయాదవ్, సలీం, విష్ణువర్ధన్‌రెడ్డి, మహిపాల్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.