Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేంద్రంనుంచి 7వేల కోట్లు

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావాల్సిన సీఎస్టీ (సెంట్రల్ సేల్స్ టాక్స్) బకాయిలను రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో మూడు విడతలుగా చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి 2011-12 మొదలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వరకు రూ.11,307 కోట్లు కేంద్రంనుంచి అందాల్సి ఉండగా, ఇందులో తెలంగాణ వాటాగా రూ.4,747 కోట్లు రావాల్సి ఉంది. వీటిని 2014-15, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం అందుకోనుంది.

KCR-met-Minister-for-finance-Arun-jaitley

-సీఎస్టీ బకాయిలు 4,747 కోట్లు -13వ ఆర్థికసంఘం బకాయిలు 2,300 కోట్లు -మూడు విడతల్లో సీఎస్టీ బకాయిల చెల్లింపు -వచ్చే నెలాఖరులోగా ఆర్థిక సంఘం బకాయిలు -సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ హామీ అదేవిధంగా 13వ ఆర్థిక సంఘం గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు సుమారు రూ.2,300 కోట్ల మేరకు బకాయిలు అందాల్సి ఉంది. వీటినికూడా వచ్చే నెల చివరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగానే చెల్లించనున్నట్లు అరుణ్‌జైట్లీ తెలిపారు. ముఖ్యమంత్రి. కే చంద్రశేఖరరావు శనివారం ఉదయం అరుణ్‌జైట్లీని ఆయన నివాసంలో కలుసుకుని తెలంగాణకు సంబంధించిన అన్ని ఆర్థిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ర్టానికి కేంద్రంనుంచి రావాల్సిన సీఎస్టీ బకాయిలు, 13వ ఆర్థిక సంఘం బడ్జెట్ ప్రకారం రావాల్సిన బకాయిల గురించి వివరించారు.

హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్, హౌసింగ్ బోర్డు తదితర సంస్థలను ఆదాయం పన్నునుంచి మినహాయించాలని కోరగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కేసీఆర్ తెలియజేయడంతోపాటు కేంద్రంనుంచి ఆశిస్తున్న ఆర్థిక సాయాన్ని కోరారు. భేటీ అనంతరం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం ప్రవేశపెట్టాలనుకుంటున్న గూడ్స్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) నుంచి అమలవుతుందని అరుణ్‌జైట్లీ తెలిపారని, అన్ని రాష్ర్టాల నుంచి సమ్మతి తీసుకున్న తర్వాతనే అమలులోకి వస్తుందన్న భరోసా ఇచ్చారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కూడా కేంద్రం సరైన సమయంలోనే పరిష్కరిస్తుందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 28న కేంద్ర బడ్జెట్‌ను అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నందున రాష్ట్ర ప్రయోజనాల గురించి కేసీఆర్ వివరించారని చెప్పారు. కొత్త బడ్జెట్‌లో తెలంగాణ అవసరాలను పేర్కొనాలని కోరినట్లు తెలిపారు. బడ్జెట్ రాజ్యాంగంలో పేర్కొన్న ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఉంటుందని అరుణ్‌జైట్లీ చెప్పారని పేర్కొన్నారు. తప్పనిసరిగా కేంద్రంపై రాష్ర్టాలు ఆధారపడే తత్వానికి భిన్నంగా రాష్ర్టాలే ఆర్థికపరంగా స్వయంసంపూర్ణంగా ఉండేలా బడ్జెట్ రూపొందిస్తున్నట్లు వెల్లడించారని తెలిపారు.

రానున్న బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం జీఎస్టీకి సంబంధించిన రాజ్యాంగ సవరణను పార్లమెంటులో ప్రతిపాదిస్తుందని, దీనిపైన చర్చ జరిగిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన వివరాలను అన్ని రాష్ర్టాలకు పంపుతుందని చెప్పారని వివరించారు. వాటి నుంచి సమ్మతి వచ్చి, అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత రానున్న వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతారని, ఆమోదం అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి అన్ని రాష్ర్టాల్లో అమలయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని అరుణ్‌జైట్లీ వివరించినట్లు వినోద్ తెలిపారు.

జీఎస్టీని ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పాదక పరిశ్రమలను నిర్వహిస్తున్న కొన్ని రాష్ర్టాల్లో తొలి ఏండ్లలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయని, కానీ సేవా రంగానికి ప్రధాన ప్రాధాన్యం ఇస్తున్న రాష్ర్టాల్లో ఈ సమస్య ఉండదని వివరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అటు ఉత్పాదక రంగంలోనూ, ఇటు సేవా రంగంలోనూ తగిన ప్రాధాన్యం కల్పిస్తున్న దృష్ట్యా జీఎస్టీ వల్ల పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదని, అయినా ఇటీవలి కాలంలో తెలంగాణలో పరిపాలన, ప్రవేశపెడుతున్న పథకాలు దీర్ఘకాల దృష్టితో ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా ఆ రాష్ట్రం చాలా తొందరలోనూ స్వయం సమృద్ధి సాధిస్తుందని కేసీఆర్‌కు అరుణ్‌జైట్లీ అభినందనలు తెలిపారని వినోద్ వివరించారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి గురించీ, జీఎస్టీని ప్రవేశపెట్టడం ద్వారా జరిగే మార్పుల గురించి స్వయంగా కేసీఆర్‌ను అరుణ్‌జైట్లీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. తొలి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రం లబ్ధి పొందుతుందని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారని వినోద్ తెలిపారు.

టెక్స్‌టైల్ క్లస్టర్లకు నిధులు కోరిన సీఎం కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కొత్తగా టెక్స్‌టైల్ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయడానికి సంబంధిత మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినందున వచ్చే బడ్జెట్‌లో వీటికి నిధులను కేటాయించాల్సిందిగా అరుణ్‌జైట్లీని కేసీఆర్ కోరారని వినోద్ తెలిపారు. హైదరాబాద్ చాలా గొప్ప నగరమని, విభిన్న సంస్కృతులు కలిగిన నగరంగా అనేక అంశాల్లో మిగిలిన నగరాలకంటే ముందుకు పోతుందని అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారని, పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న తెలంగాణ రాష్ట్రం త్వరలోనే అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారని ఆయన వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనప్పటికీ ముఖ్యమంత్రి చొరవతో ప్రవేశపెడుతున్న పథకాలను చూసిన తర్వాత అరుణ్‌జైట్లీ చాలా సంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా వ్యాఖ్యానించారని తెలిపారు.

ఏపీకన్నా ఎంతో నయం -రూ.1080 కోట్ల విద్యుత్ చార్జీల ప్రతిపాదన -సబ్సిడీ రూ.6,476 కోట్లు.. కేటగిరీలు, శ్లాబులు యథాతథం వార్షిక ఆదాయ వనరులు (ఏఆర్‌ఆర్), విద్యుత్ చార్జీల (టారిఫ్) ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(టీఎస్‌ఈఆర్సీ)కి డిస్కమ్‌లు శనివారం రాత్రి అందజేశాయి. విద్యుత్‌లోటును ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సేవలందించే లక్ష్యంతో 2015-16 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ.26,700 కోట్ల ఆదాయవనరుల అవసరాలను డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లలో ప్రతిపాదించాయి. విద్యుత్ సంస్థలకు రూ.18,900కోట్ల ఆదాయ వనరులను చూపుతూ, ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో సుమారు రూ.6,476కోట్లు వస్తుందని డిస్కమ్‌లు అంచనావేశాయి.

వినియోగదారుల నుంచి టారిఫ్ రూపంలో రూ.5,396కోట్ల అదనపు రెవెన్యూ అవసరాలను డిస్కమ్‌లు గుర్తించాయి. రాష్ట్ర విభజన తదుపరి ఆంధ్రప్రదేశ్‌కంటే తక్కువగా టారిఫ్ ప్రతిపాదనలను తెలంగాణ డిస్కమ్‌లు చేయడం విశేషం. ఏపీలో రెవెన్యూలోటు రూ.7,716 కోట్లు ఉండగా, ప్రభుత్వ సబ్సిడీ రూ.6,455 కోట్లు, వినియోగదారులపై టారిఫ్ భారం రూ.1,261కోట్ల మేరకు ఉన్న సంగతి తెలిసిందే.

తెలంగాణలోని డిస్కమ్‌లు కేవలం రూ.1,080 కోట్ల మేరకు టారిఫ్ ప్రతిపాదనలకు పరిమితం కావడం, ప్రస్తుత టారిఫ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా అమలుచేయడం వంటి జాగ్రతలు తీసుకున్నాయి. భౌగోళికంగా ఏపీలో ఉన్న కృష్ణపట్నం, హిందుజా, సీలేరు విద్యుత్ ప్రాజెక్టుల నుంచి తెలంగాణ వాటా (53.89%) విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావాన్ని డిస్కమ్‌లు తమ ఏఆర్‌ఆర్‌లలో వ్యక్తపరిచాయి.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.