Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కోటి ఆశల మహా యజ్ఞం

-కోటీ 20 లక్షల ఎకరాలు -లక్షా 50 వేల కోట్ల సంపద -ఇదీ ముఖ్యమంత్రి కేసీఆర్ మహాసంకల్పం -పల్లెసీమలకు పచ్చలహారం -వేగంగా ప్రాజెక్టుల పూర్తి -రిజర్వాయర్లుగా వరదకాలువ -ప్రతి వాగూవంక పునరుజ్జీవం

ఒక మహాస్వప్నం! తన ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన తెలంగాణను ప్రాణప్రదంగా చూసుకుంటున్న ఒక నాయకుడు కంటున్న అపూర్వ కల! అరవై ఏండ్లుగా తెలంగాణ పడిన గోసను, ఆ దైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టి.. ఘనంగా పునర్నిర్మించాలనే తపన! నేలకీ నీటికీ.. మట్టికీ మనిషికీ ఉన్న అనుబంధాన్ని పటిష్ఠంచేసి.. పదిలపర్చి.. చుక్కచుక్క నీటిని పొదివిపట్టి.. నిలువ చేయాలి! పొలాలకు పారించి.. బంగారు పంటలు పండించి.. భావి తెలంగాణ పల్లె సీమలకు పచ్చలహారం అలంకరించాలి! ఇదే తాపత్రయం! 45 వేల చెరువులు.. 50 ప్రాజెక్టులు.. వందకు పైగా రిజర్వాయర్లు.. 1350 టీఎంసీల నీరు.. ఆ నీటితో కోటీ ఇరువై లక్షల ఎకరాల సాగు.. దాని ఫలితం లక్షన్నర కోట్ల రూపాయల పాడిపంట.. ఇదీ ఆయన వెంటాడే లక్ష్యం! అందుకే మూడేండ్లుగా మహాయజ్ఞం చేస్తున్నారు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు! నిరంతరం అదే ధ్యాస! అదే శ్వాస! దానిపైనే సమీక్ష!! వాటన్నింటి సారాంశమే బంగారు తెలంగాణకు పునాదులు! ఆ క్రమంలోనే కేసీఆర్ మదిలో చిగురుతొడిగిన కొత్త ఆలోచన.. నదిలో నిత్యం నీళ్లున్నట్టుగానే.. వరదకాల్వను సైతం రిజర్వాయర్లుగా మార్చాలనే మరో యజ్ఞం!!

మనం తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, ప్రధాన కాలువలు, పంటకాలువలు కూడా పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరివ్వగలిగితే తెలంగాణ ఒక భాగ్యసీమ అవుతుంది.

శ్రీరాంసాగర్ వరద కాలువలో 102 కిలోమీటర్ల పొడవున మూడు రెగ్యులేటర్లు నిర్మించి కాలువ గర్భంలో నీటిని నిలువ చేయడం, అవసరమైనప్పుడు శ్రీరాంసాగర్‌లో ఎత్తిపోయడం కొత్త ఆలోచన సారాంశం. 43 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల లోతు ఉండే ఈ కాలువలో సుమారు నికరంగా ఒకటిన్నర టీఎంసీల నీటిని నిలుపవచ్చని అంచనా వేస్తున్నారు. శ్రీరాంసాగర్‌కు ఎగువనుంచి నీరు రానప్పుడు వరదకాలువ రిజర్వాయర్ల నుంచి శ్రీరాంసాగర్‌ను నింపుకోవచ్చు. శ్రీరాంసాగర్ ఆయకట్టు 9 లక్షల ఎకరాలకు నికరంగా సాగునీరు ఇవ్వవచ్చు. సుమారు ఎనిమిది కోట్ల రూపాయల విలువచేసే పంటలు పండించడానికి గ్యారంటీ ఇవ్వవచ్చు. అంతేకాదు అంతపొడవున నదిలో నీళ్లున్నట్టు వరదకాలువలో నీరు ఉంటే ఈ పక్క, ఆ పక్క గ్రామాలకు ఎంత జలకళ? ఎంత సందడి? పాడిపంటలు, చెట్టు చేమలు, జీవరాశులు ఎంతగా ఎదిగివస్తాయి. శ్రీరాంసాగర్ కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి. అందులో నిత్యం నీరు ఉండేట్టు చూడగలిగితే తెలంగాణలో ధాన్యసిరులు పొంగిపొర్లుతాయని ముఖ్యమంత్రి ఆలోచన చేశారు అని ఆ ఇంజినీరు అన్నారు. వరదకాలువను మూడు రిజర్వాయర్లుగా మార్చడానికి పెద్దగా భూసేకరణ అవసరం లేదు. మూడు చోట్ల అతితక్కువ వ్యయంతో మూడు లిఫ్టులు నిర్మించడానికి తప్ప. మొత్తం ప్రాజెక్టు విలువ వెయ్యి కోట్లకు మించదు.

మొత్తం తెలంగాణను పచ్చని పంటపొలాలతో, ఏపుగా ఎదిగివచ్చే చెట్టు చేమలతో, కళకళలాడే జీవరాశులతో, నాటుపాట, కలుపు పాట, కోతపాటలతో రాగరంజితంగా ఉండే రత్న గర్భగా మార్చుకోవాలన్న తాపత్రయం ఈ ఆలోచనకు స్ఫూర్తి. కేసీఆర్ ఆశ, ధ్యాస అదే అని ప్రముఖ తెలంగాణ రచయిత, విశ్లేషకుడు చెప్పారు. తెలంగాణలో ఏటా కోటి 20 లక్షల ఎకరాల్లో పంటలు పండించే అవకాశం ఉంది. ఆరుగాలం చెమటోడ్చే కష్టజీవి రైతులు 55 లక్షలమంది ఉన్నారు. కృష్ణా, గోదావరి-రెండు నదుల్లో మనకు సమైక్య పాలనలో నిర్దేశించిన వాటా జలాలు 1350 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సుమారు 300 టీఎంసీల నీటిని పారిశ్రామిక, తాగు, ఇతర అవసరాలకు వినియోగించుకున్నా ఇంకా వెయ్యి టీఎంసీలకు పైగా నీరు వ్యవసాయానికి అందుబాటులో ఉంటుంది.గోదావరి నది నుంచి 47 ఏండ్లలో ఏడాదికి సగటున 1700 టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నట్టు కేంద్ర జలసంఘమే నిర్ధారించింది. మిగులు జలాలను ఎంతైనా వాడుకునే హక్కు తెలంగాణకు ఉంది. 45 వేల చెరువులు, 50 ప్రాజెక్టులు, 100కు పైగా రిజర్వాయర్లు, 1350 టీఎంసీల నీరు, 1,20,00,000 ఎకరాల సాగు, రూ.1,50,000 కోట్ల పాడిపంట…ఇదీ కేసీఆర్ వెంటాడే లక్ష్యం. అందులో భాగంగానే ఆయన ఇంజనీర్లు, అధికారులు, మంత్రుల వెంటపడుతున్నారు. ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టిస్తున్నారు.

మొగులుకు మొకంపెట్టని తెలంగాణ వానాకాలం మొగులుకు మొకంపెట్టి చూడడం, కాలం వెనుకబడిపోయినంక నార్లు పోయడం, విత్తనాలు వేయడం, కరువొస్తే ఆగమైపోవడం… ఇప్పటిదాకా మనకు తెలిసిన తెలంగాణ ఇదే. వాన రానీ, రాకపోనీ కత్తెరలోనే నార్లు పోయడం, పంటలు వేయడానికి అవసరమైన అన్ని పనులు పూర్తి చేసుకోవడం, వేళప్రకారం విత్తనాలు వేయడం జరిగిపోవాలి. అలా జరుగాలంటే కరువులు కాటకాల వల్ల జరిగీ జరిగీ వెనుకకు పోయిన కాలాన్ని తిరిగి ముందుకు తీసుకురావాలి. అది ఒక్క నీటి లభ్యతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. కుంటలు, చెరువులు, రిజర్వాయర్లలో నీరు ఉండి, వాగులు వంకలు, ఉపనదులు పునరుజ్జీవం పొందితే పూడిపోయిన బావులు తిరిగి జల ఊటలతో వర్ధిల్లుతాయి. బోరుబావుల్లో నీరు లభిస్తుంది. తెలంగాణ సాధించిన అద్భుత విజయం అన్నివేళలా కరెంటు అందుబాటులో ఉండడం. అది కూడా అరకొర కాదు త్రీఫేజ్ కరెంటు అందుబాటులో ఉండడం. నీరు, కరెంటు ఉంటే కాలం ముందుకు రాక ఏమవుతుంది? గోదావరి పరీవాహకప్రాంతం చెరువుల్లో 165 టీఎంసీలు, కృష్ణా పరీవాహక ప్రాంతం చెరువుల్లో 90 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకొంటున్నట్టు 1974లోనే బచావత్ ట్రిబ్యునల్ తన నివేదికలో పొందుపరిచింది. ఆరు దశాబ్దాల జీవన విధ్వంసం పర్యవసానంగా తెలంగాణలో వేలాది చెరువులు కనుమరుగయ్యాయి. ఇంకా మిగిలి ఉన్న 45 వేల చెరువులను ఎవరూ పట్టించుకోలేదు. పూడిపోయి, చెట్లు తుప్పలతో నిండిపోయి ఎండిపోయాయి. వాగులు, వంకలు, ఉపనదులు కూడా ఒట్టిబారిపోయాయి.

ఇప్పుడు మళ్లీ మన ప్రభుత్వం ఆ చెరువులను బాగు చేస్తున్నది. చెరువుల నీటి నిల్వసామర్థ్యం పెంచేందుకు అన్ని శక్తులూ ఒడ్డుతున్నది. రెండు దశల మిషన్ కాకతీయ వల్ల చెరువుల కింద ఈసారి సాగుభూమి విపరీతంగా పెరిగింది. ఆంధ్ర ప్రాంతం కంటే మిన్నగా రికార్డుస్థాయిలో ఈసారి పంట దిగుబడి వచ్చింది. మనం తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి, ప్రధాన కాలువలు, పంటకాలువలు కూడా పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరివ్వగలిగితే తెలంగాణ ఒక భాగ్యసీమ అవుతుంది. అన్ని జలవనరులూ పునరుజ్జీవం పొందితే మిగిలిన 20 లక్షల ఎకరాల మెట్ట పొ లాలు కూడా బావులు, బోర్ల కింద సాగవుతాయి. భూగర్భ జలాలు అంతటా పెరుగుతాయి. జలరాశుల తెలంగాణ పచ్చని ధాన్యరాశుల తెలంగాణకు, జీవరాశులతో కేరింతలు కొట్టే తెలంగాణకు బాటలు వేస్తుంది. నీరుంటే చెట్టూ చేమా పెరుగుతాయి. పశుపక్ష్యాదులకు నీరు దొరుకుతుంది. గడ్డిగింజలు దొరుకుతాయి. పాడి అభివృద్ది చెందుతుంది. గొర్రెలు, మేకలు, పశువులు సమృద్ధిగా పెంపొందుతాయి. చేపల పెంపకం వృద్ధి చెందుతుంది. మొత్తం పర్యావరణమే మారిపోతుంది. ఆర్థికవ్యవస్థ ఉత్తేజం పొందుతుంది. కోటి 20 లక్షల ఎకరాలలో పంటలు పండితే ఎంత సంపద పుడుతుంది?

ఏటా లక్షా 50 వేల కోట్ల సంపద కోటి 20 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తే వాటి విలువ ఎంత ఉంటుంది? నిజానికి తక్కువ రాబడి వచ్చేది వరి ధాన్యం వల్లే ఎకరాకు 35 క్వింటాళ్ల ధాన్యం పండిస్తే, క్వింటాకు 1500 రూపాయల చొప్పున ధరవస్తే ఆ ఆదాయం సుమారు 60 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. రెండు పంటలకు లెక్క వేస్తే లక్షా 20 వేల కోట్ల విలువ చేసే పంట పండుతుంది. మక్కజొన్న అయితే ఎకరాకు సుమారు 70 వేల రూపాయల ఆదాయాన్ని ఇస్తుంది. పసుపు, ఇతర వాణిజ్య పంటలయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇవి కాక గొర్రెల పెంపకం, పశుపోషణ ద్వారా మరో 22500 వేల కోట్ల ఆదాయం గ్రామీణ పేద రైతులకు వస్తుంది. చేపల పెంపకం ద్వారా పదివేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఏటా లక్షా 50 వేల కోట్ల సంపదను సృష్టించడం సాధ్యమవుతుంది. ఇంత సంపద గ్రామాల్లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రజల జీవనప్రమాణాలు పెరుగుతాయి. చదువులు బాగుపడుతాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గురుకుల పాఠశాలల వ్యవస్థ నాణ్యమైన విద్యను పేదలకు అందిస్తుంది. వృత్తులు వ్యాపారాలుగా బలపడుతాయి. లక్షలాది మందికి నాణ్యమైన ఉపాధి లభిస్తుంది. దినసరి వేతనాలు పెరుగుతాయి. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఉజ్వలంగా ఉద్దీపింపజేసే కొత్త ఒరవడి అవుతుంది. కొత్తగా నైపుణ్యాలను ఇవ్వడం కాదు, మన ప్రజలకు ఉన్న నైపుణ్యాలను గుర్తించి, వాటిని సద్వినియోగంలోకి తీసుకురావడానికి పనిచేయాలన్నది కేసీఆర్ ఆలోచన. మానవవనరులను అర్థం చేసుకోవడంలో ఇదొక విప్లవాత్మక మార్పు అని సీనియర్ జర్నలిస్టు వ్యాఖ్యానించారు.

నాడు బాబ్లీ డ్రామాలు, నేడు కేసుల డ్రామాలు రాజకీయాలు చేసేవాళ్లు బాబ్లీ ఉద్యమాల్లాగా డ్రామాలు ఆడుతారు. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ బాబ్లీ ప్రాజెక్టుపై పెద్ద డ్రామా నడిపించింది. ఆల్మట్టిపై కూడా ఏదో పెద్ద పొడిచేస్తున్నట్టు అనవసరమైన ఘర్షణలు సృష్టించింది. కాంగ్రెస్ హయాంలో ఆకుకు అందకుండా పోకకు పొందకుండా చాలా ప్రాజెక్టులు మొదలు పెట్టారు. దేనికీ అనుమతి సంపాదించలేదు. పైగా పొరుగు రాష్ర్టాలతో కావాలని వివాదాలు సృష్టించి పెట్టారు. నిధులు కేటాయించలేదు. హెడ్‌వర్క్స్‌వదిలి తోకపనులు చేశారు. నిధులు మింగేశారు. నీళ్లు లేవు. ఏ అనుమతులూ లేకపోయినా, ఎన్ని వివాదాలు చెలరేగినా ఆంధ్రా నాయకులు తమకు అవసరమైన ప్రాజెక్టుల విషయంలో మాత్రం దున్నుకుపోయారు. పోతిరెడ్డిపాడు పూర్తి చేసుకున్నారు. హంద్రీ నీవా పూర్తి చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. కొత్తగా పట్టుమని లక్ష ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించింది లేదు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అందుకు భిన్నంగా ముందుకు పోతున్నది. మన రాష్ట్రం, మన ప్రజలు, మన నీళ్లు అన్న సోయితో పనులు చేసుకుపోతున్నది. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న తాపత్రయంతో పనిచేస్తున్నది. ఇది సఫలం కాకూడదని కాంగ్రెస్, టీడీపీలు అన్ని అడ్డదారులూ తొక్కుతున్నాయి. 25 రోజుల్లో, నాలుగు కోర్టుల్లో కేసులు వేశారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వేయించినన్ని కేసులు ఇంకే అంశంపైనా వేసి ఉండరు. తెలంగాణ రాష్ట్రంకోసం ఇంత కష్టపడి ఉంటే తెలంగాణ ఇంకా ముందుగా వచ్చి ఉండేది. అయినా కోర్టులు న్యాయం పక్షాన ఉన్నాయి. తెలంగాణ ప్రాజెక్టుల అవసరాన్ని గుర్తించి కేసులను కొట్టి వేశాయి. ప్రాజెక్టులు పూర్తి అవుతాయి. తెలంగాణ మాగాణాల్లో జలరాశులు పొంగిపొరలుతాయి అని ఒక రచయిత, విశ్లేషకుడు అన్నారు. నేటి స్వప్నం, రేపటి స్వర్ణధామంగా మారుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.కుంటలు, చెరువులు, రిజర్వాయర్లలో నీరు ఉండి, వాగులు వంకలు, ఉపనదులు పునరుజ్జీవం పొందితే పూడిపోయిన బావులు తిరిగి జల ఊటలతో వర్ధిల్లుతాయి. బోరుబావుల్లో నీరు లభిస్తుంది. తెలంగాణ సాధించిన అద్భుత విజయం అన్నివేళలా కరెంటు అందుబాటులో ఉండడం.

దున్నని భూమి, వాడని నీరు అడవిలో కాసిన వెన్నెలతో సమానం. వీలైనంత ఎక్కువ నదీ జలాలను, వాననీటిని ఒడిసిపట్టుకోవడం, ఉపయోగించుకోవడం, అత్యధిక భూమిని సాగులోకి తేవడం, లక్షల కోట్ల పాడిపంటలను సృష్టించడం ఒక మహాస్వప్నం. ఒక అసాధారణ కార్యాచరణ. నీరు, భూమి, సంపద ఒకదానిపై ఒకటి ఆధారపడినవి. ఈ బంధాన్ని బాగా గుర్తించినవారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. నీటి శక్తిని, విలువను గుర్తించిన గొప్ప శోధకుడు, సాధకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. ఆయన ఈ మూడేండ్లలో తాగునీరు, సాగునీరు గురించి మాట్లాడినంతగా మరే అంశంపైనా మాట్లాడలేదు. సమీక్షించలేదు. సాగునీరుపై నిత్యం ఏదో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించడం కేసీఆర్ విశిష్టత. కాలువను రిజర్వాయరుగా మార్చడం గురించి మునుపు ఎవరయినా ఆలోచించారా? ఎగువనీరు గ్యారంటీ లేని శ్రీరాంసాగర్‌ను పునరుజ్జీవం చేయడం గురించి ఎవరయినా ప్రణాళికలు చేశారా? కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, వాగులు, వంకలు, ఉపనదులను తిరిగి జలధారలతో అలరారేట్టు చేయాలని ఎవరయినా ప్రయత్నించారా? కేసీఆర్ ఆలోచించారు. కార్యాచరణకు పూనుకున్నారు. ఆయన నీళ్ల మనిషి అని ఒక నీటిపారుదల ఇంజినీరు చెప్పారు.అన్ని జలవనరులూ పునరుజ్జీవం పొందితే మిగిలిన 20 లక్షల ఎకరాల మెట్ట పొలాలు కూడా బావులు, బోర్ల కింద సాగవుతాయి. భూగర్భ జలాలు అంతటా పెరుగుతాయి. జలరాశుల తెలంగాణ పచ్చని ధాన్యరాశుల తెలంగాణకు, జీవరాశులతో కేరింతలు కొట్టే తెలంగాణకు బాటలు వేస్తుంది.

7,500 కోట్లు వర్సెస్ 1,50,000 కోట్లు మీకు రాష్ట్రం ఇస్తే ఎలా పరిపాలించుకుంటారు? అంధకారం అయిపోతుంది. కరెంటు ఉండదు అని అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్లను ఎక్కిరిస్తుంటే ఆయన మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నోళ్లే, ఇప్పుడు ఇన్ని ఎత్తిపోతల పథకాలకు కరెంటు ఎక్కడిది? నిధులెక్కడివి? అని ప్రశ్నిస్తున్నారు. వీళ్లకు నీటి విలువా తెలియదు. కరెంటు విలువా తెలియదు. వీళ్ల సమస్యే అది. వీళ్లు ఈ జన్మకాదు కదా. మరో జన్మ ఎత్తినా తెలంగాణ సాగునీటి సమస్యను అర్థం చేసుకోలేరు. కేసీఆర్ ముందు వీరు పిపీలికాలు అని ఒక సీనియర్ జర్నలిస్టు అన్నారు. సమస్యను ఎదుర్కోవడానికి కావలసింది సంశయం కాదు, మనసు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే ఆంధ్ర ప్రభుత్వం సతాయిస్తున్నా, లెక్కచేయకుండా కరెంటు కొరత లేకుండా చేసి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు ఎత్తిపోతల పథకాలకు అవసరమైన విద్యుత్తును గురించి కూడా ముందుగానే అంచనాలు వేసి, లభ్యతను అంచనా వేసి, ఖర్చు అంచనా వేసి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు 6000 మెగావాట్ల విద్యుత్తు కావాలి. కృష్ణా నదిలో 60 రోజులు మాత్రమే వరద ఉంటుంది. అక్కడ వెంటవెంటనే ఎత్తిపోసుకోవాలి. గోదావరిలో కొన్ని చోట్ల ఆరు మాసాలు, మరికొన్ని చోట్ల తొమ్మిది మాసాలు నీటి లభ్యత ఉంటుంది. తీరుబడిగా ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ప్రాజెక్టులకు నిర్దేశించిన నీటిని ఎత్తిపోయడానికి ఎత్తిపోతలకు అయ్యే కరెంటు ఖర్చు 7,500 కోట్ల నుంచి 10 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఎక్కడ లక్షా 50 వేల కోట్ల రూపాయల పంట, ఎక్కడ 7500 కోట్లు? లెక్కలు తెలిస్తే కాంగ్రెస్ నాయకులు, వ్యతిరేకించడం కోసమే వ్యతిరేకించే ఉద్యమకారులు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మాట్లాడరు. పైగా నీటిని ఎప్పుడు ఎత్తిపోస్తాం.. నదుల్లో సరిపోను నీరు రానప్పుడు, లోటు ఏర్పడినప్పుడు మాత్రమే. లిఫ్టు పెట్టుకున్నామని అస్తమానం ఎత్తిపోయరు కదా.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.