Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కులవృత్తులకు అండగా ప్రభుత్వం

కులవృత్తులకు రాష్ట ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లి,వరంగల్ అర్బన్ జిల్లా వంగపల్లి గ్రామాల్లో మంగళవారం యాదవులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. గొర్రెలు, మేకల క్రయ విక్రయాల కోసం మార్కెట్ యార్డుల ఏర్పాటుకు కృషి చేస్తామని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం డొంకల్, భీమ్‌గల్ మండలం చేంగల్‌లో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి, ఆర్మూర్ మండలం పిప్రిలో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో కలిసి గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏసీ గదుల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో గొర్రెల అభివృద్ధి పథకాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 26 వేల మందికి రెండు విడతల్లో గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

కులవృత్తులకు పునర్జీవం కల్పించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో యాదవులకు గొర్రెలను అందజేశారు. మరికల్, జమిస్తాన్‌పూర్, రాజాపూర్‌లో మంత్రి లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ కులవృత్తులు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కురుమ, గొల్ల, యాదవులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 75 శాతం సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి అన్నారు.

వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం వెంకటాంపల్లిలో ఆయన గొర్రెలను పంపిణీ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడంలో భాగంగానే యాదవులకు గొర్రెల యూనిట్లు అందజేస్తున్నట్లు విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ, నిడమనూరు, చిట్యాల మండలాల్లో, సూర్యాపేట జిల్లాలోని కేటి అన్నారం, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం గ్రామంలో మంత్రి జగదీశ్‌రెడ్డి గొర్రెలు పంపిణీ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల కేంద్రంలో గొల్ల, కుర్మ లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెంపకందారులకు గొర్రెలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శాయంపేటలోని పశువైద్యశాల ఆవరణలో మంగళవారం గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా గొల్ల కురుమల కుటుంబాలలో వెలుగులు రానున్నాయని శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో గొర్రెల పంపిణీ పూర్తయితే రెండేళ్లలో రూ. 20 వేల కోట్ల ఆస్తి పరులుగా తెలంగాణ గొల్ల, కురుమలు ఆర్థిక పరిపుష్టి సాధిస్తారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌లో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటకశాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి గ్రామంలో గొల్ల, కురుమలకు ఆయన గొర్రెలను పంపిణీ చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచడానికి సర్కార్ కృషి చేస్తున్నదనీ ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం తిమ్మాపూర్‌లో గొర్రెల్ల యూని ట్ల పంపిణీని ప్రారంభించారు. మెదక్ జిల్లా గుట్టకింది పల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి గొర్రెల పంపిణీని ప్రారంభించారు. గొర్రెల పెంపకం పథకాన్ని ప్రారంభిచండం హర్షించదగ్గ విషయమని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లాలో బషీరాబాద్ మండల పరిధిలోని కొర్విచెడ్ గ్రామం, బొంరాస్‌పేట మండలంలోని నాస్‌ఖాన్‌పల్లి, మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్ గ్రామాల్లో లబ్ధ్దిదారులకు ఆయన గొర్రెపిల్లల పంపిణీ చేశారు.

రాష్ట్రంలో 84 లక్షల గొర్రెల పంపిణీ -మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా 7,925 సొసైటీలను ఏర్పాటు చేసి 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్రలో మంత్రి గొర్రెలను పంపిణీ సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. దేశం చూపు తెలంగాణ వైపు ఉందని వారన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టారని అన్నారు. 75 శాతం సబ్సిడీతో ఒక యూనిట్‌కు లక్షా 25 వేల ఖర్చుతో గొర్రెలను అందిస్తుందని చెప్పారు. గొర్రెల మేత కోసం 45లక్షల ఎకరాల అటవీ భూమిలో ైస్టెబర్‌కోడ్ గడ్డి విత్తనాలను నాటనున్నట్లు చెప్పారు. మొదటి విడతలో 5 నుంచి 6 నెలల పాటు గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలకు కండ్లు మండుతున్నాయని దుయ్యబట్టారు. కులవృత్తులు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.