-లీడర్లేని కాంగ్రెస్.. క్యాడర్ కూడా లేని టీడీపీ.. -అధికారం కోసం మహాకూటమి పగటికలలు -వాళ్లు సీట్లు పంచుకునేలోపే మనం స్వీట్లు పంచుకుంటాం -సీల్డ్‌కవర్ సీఎం కావాలా? సింహంలాంటి సీఎం కావాలా? -ముందస్తు సవాలు విసిరిన నేతలు పారిపోయారు -కాంగ్రెస్‌ను ఎండగట్టేందుకే ముందస్తు ఎన్నికలు: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న శక్తులు మహాకూటమి పేరుతో మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పొరపాటునో, గ్రహపాటునో వారు అధికారంలోకి వస్తే తెలంగాణకు కడగండ్లు తప్పవని, తెలంగాణ మళ్లీ తల్లడిల్లిపోవడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో నిర్వహించిన దసరా సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్‌లో టీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆయా సమావేశాల్లో మాట్లాడిన కేటీఆర్.. ముందస్తు ఎన్నికలకు సవాలు విసిరిన కాంగ్రెస్ నాయకులు.. ఓటమికి సాకులు వెతుక్కుంటున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ దగుల్బాజీ వ్యవహారాలను ఎండగట్టేందుకు, రాష్ట్రాన్ని ప్రగతిబాటలో ముందుకు తీసుకుపోయేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని చెప్పారు. కాంగ్రెస్‌కు లీడర్ లేడని, టీడీపీకి క్యాడర్ కూడా లేదని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఇరవై ముప్ఫైమంది సీఎం అభ్యర్థులు ఉన్నారని, వీరంతా తామే సీఎం అంటూ కలలు కంటున్నారని ఎద్దేవాచేశారు. మహాకూటమిలో సీట్ల కుమ్ములాటలు కొనసాగుతున్నాయని, వాళ్లు సీట్లు పంచుకునేలోపే, మనం స్వీట్లు పంచుకుంటామన్నారు. కేసీఆర్ సింహంలా సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తున్నారని, సీల్డ్కవర్లో ఢిల్లీనుంచి ఎంపికై వచ్చే సీఎం కావాలో.. సింహంలాంటి సీఎం కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు లీడర్ లేడని, టీడీపీకి క్యాడర్ కూడా లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఎద్దేవాచేశారు. 65 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీలు ప్రజలకు చేసిందేమీలేదన్నారు. నాలుగేండ్ల టీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌లో ఇప్పుడున్న నాయకుడు రేపు ఉండడని, అది నెలకో సీఎంను మార్చే పార్టీ అని విమర్శించారు. 65 ఏండ్ల పాలనలో 200 పింఛను కూడా ఇవ్వని ఆ పార్టీలు.. అధికారంలోకి వస్తే రెండువేల పింఛను ఇస్తామంటే ప్రజలు నమ్మటంలేదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే ఇరవై ముప్పైమంది సీఎం అభ్యర్థులు ఉన్నారని, వీరంతా తామే సీఎం అంటూ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లో టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యం లో కార్యకర్తలతో నిర్వహించిన దసరా సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహాకూటమిలో సీట్ల కుమ్ములాటలు కొనసాగుతున్నాయని, వాళ్లు సీట్లు పంచుకొనేలోపే, మనం స్వీట్లు పంచుకుంటామన్నారు. డిసెంబర్ 11న విజయఢంకా మోగించేది టీఆర్ఎస్సేనని విశ్వాసం వ్యక్తంచేశారు. కేసీఆర్ సింహంలా సింగిల్‌గా ఎన్నికలకు వెళ్తున్నారని, సీల్డ్కవర్లో ఢిల్లీ నుంచి ఎంపికై వచ్చే సీఎం కావాలో.. సింహంలాంటి సీఎం కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రత్యేకరాష్ట్రంలోనే మన హక్కులు సాధ్యపడుతాయని పోరాడి తెలంగాణను తెచ్చిన కేసీఆర్.. ప్రజాప్రయోజనం కోసం అహర్నిశలు తపిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనపై ప్రజలకు నమ్మకముందని, ఆయనను మళ్లీ ఎన్నుకోవాలని వారంతా ఎదురుచూస్తున్నారని అన్నారు.

పాలమూరు ఎత్తిపోతలకు టీడీపీ, కాంగ్రెస్ అడ్డు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంద్వారా మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలో సాగునీరు అం దించి రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తే.. కాంగ్రెస్, టీడీపీ అడుగడుగునా అడ్డుకున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఈ పథకాన్ని ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర జలసంఘానికి 30 ఉత్తరాలు రాశారని, కాంగ్రెస్ నాయకులు కోర్టులను ఆశ్రయించి, రైతుల నోట్లో మట్టికొట్టాలని చూశారని మండిపడ్డారు. వారి కుటిల రాజకీయాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పటాపంచలు చేస్తూ పనులు ప్రారంభించినట్టు తెలిపారు. ఆనాడు తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడ్డ కాంగ్రెస్, టీడీపీలు నేడు మళ్లీ తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక మహాకూమి పేరుతో ప్రజల ముందుకొస్తున్నారని, పొరపాటున వీరు అధికారంలోకి వస్తే తెలంగాణ మళ్లీ తల్లడిల్లిపోవడం ఖాయమని అన్నారు. అటువంటివారిని ప్రజలే తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కరువుతో అల్లాడుతున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంతోపాటు పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలంచేసి రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, ఈ పథకాన్ని పూర్తిచేసి సాగునీరు అందిస్తామని చెప్పారు.
తెలంగాణలో పుంజుకున్న రియల్ ఎస్టేట్ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రియల్ఎస్టేట్ వ్యాపా రం పడిపోతుందంటూ గతంలో తప్పుడు ప్రచారాలు చేసినవారి మూతులకు తాళాలు పడ్డాయని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత హైదరాబాద్ శివార్లలో అనేక ఐటీ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుతో రియల్ వ్యాపారం ఊపందుకుందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీ రంగారెడ్డిజిల్లాలో ఏర్పాటుకానుందని చెప్పారు. దీంతో ప్రత్యక్షంగా లక్షమందికి, పరోక్షంగా నాలుగులక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భవిష్యత్తులో శివారు ప్రాంతాల్లో భూములు బంగారం కంటే విలువైనవిగా మారనున్నాయని, రైతు లు తమ భూములను అమ్ముకోవద్దని సూచించారు.
భారీ మెజార్టీతో కిషన్‌రెడ్డి గెలుపుఖాయం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రగతినివేదన సభ స్ఫూర్తిగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే జనవరిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీచేసేవారంతా ఎమ్మెల్యే ఎన్నికలను సవాల్‌గా తీసుకుని కిషన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కిషన్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలువటం ఖాయమని అన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దానం నాగేందర్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లకా్ష్మరెడ్డి, ఎం పీపీలు జయమ్మ, రజితనాయక్, మంజుల, మున్సిపల్ చైర్పర్సన్లు భరత్‌కుమార్, ధనలక్ష్మి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సత్తు వెంకటరమణారెడ్డి, అంజిరెడ్డి, జెడ్పీటీసీలు రమేశ్‌గౌడ్, తావు నర్సింహ, నేతలు డబ్బికార్ శ్రీనివాస్, శ్రీనివాస్‌రావు, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, జగదీశ్‌యాదవ్, కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
