
-సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం ఎవరికీ లేదు -అందుకే దేశంలోని నలుగురు పహిల్వాన్లతో ప్రచారం -తీగలను ముట్టుకో మోదీ.. కరంట్ ఉన్నదని తెలుస్తుది -ప్రాజెక్టులను అడ్డుకునే బాబుతో కాంగ్రెస్ పొత్తా? -కాంగ్రెస్‌కు టీడీపీని తోకపార్టీగా మార్చిన చంద్రబాబు -గడ్డం తీయని ఉత్తమ్.. సన్యాసుల్లో కలుసుడు ఖాయం -నాలుగేండ్ల అభివృద్ధిని చూసి టీఆర్ఎస్నే గెలిపించాలి -సిరిసిల్ల, వికారాబాద్ జిల్లా ప్రచారాల్లో కేటీఆర్ పిలుపు
మోదీ, సోనియా, రాహుల్, అమిత్‌షాలు రాజకీయ పర్యాటకులు. కేసీఆర్ ఒక్కరే పక్కా లోకల్. కూటమికి అధికారమిస్తే తెలంగాణలో మళ్లీ చీకటిరోజులు వస్తాయి. రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రద్దుచేస్తారు. కాంగ్రెసోళ్లు దేశముదుర్లు, పలు కండువాలు కప్పుకొని వచ్చి సొళ్లుమాటలు చెప్తారు. విని మోసపోయి ఆగమైతే భవిష్యత్ నాశనమవుతుందిఅని మంత్రి కేటీఆర్ హె చ్చరించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో ప్రజా ఆశ్వీరాదసభ, గంభీరావుపేటలో రోడ్‌షోలో, వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, మోమిన్‌పేట్‌లో రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే మోదీ, అమిత్ షా, చంద్రబాబు, మాయావతి వంటి పహిల్వాన్లను తీసుకొచ్చారని ఎద్దేవాచేశారు. కానీ సింహం లాంటి కేసీఆర్ సింగిల్‌గానే వస్తారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరంట్ లేదంటున్న మోదీ, తీగలను పట్టుకొని చూస్తే తెలుస్త దన్నారు. ప్రాజె క్టులను అడ్డుకొనే చంద్రబా బుతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకొన్నదని నిలదీశారు.

కాంగ్రెస్‌కు టీడీపీని చంద్ర బాబు తోకపార్టీగా మార్చార ని, గడ్డం తీయని ఉత్తమ్ నా లుగురోజుల తర్వాత సన్యా సుల్లో కలువడం ఖాయమని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ నాలుగేండ్ల పాలనను చూసి మళ్లీ గెలి పించాలని కోరారు.కాంట్రాక్టర్ల వల్ల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో ఆలస్యం జరిగిందని కేటీఆర్ తెలిపారు. ఖాళీస్థలాలు ఉన్నవారికి రూ.5 లక్షలతో ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. సమావేశాల్లో వికారాబాద్ అభ్యర్థి ఆనంద్, మంత్రి మహేం దర్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రా వు, సెస్ చైర్మన్ లకా్ష్మరెడ్డి పాల్గొన్నారు.

మోదీ, సోనియా, రాహుల్, అమిత్‌షాలు రాజకీయ పర్యాటకులు. కేసీఆర్ ఒక్కరే పక్కాలోకల్. కూటమికి అధికారమిస్తే తెలంగాణలో మళ్లీ చీకటిరోజులు వస్తాయి. రైతుల ప్రయోజనాల కోసం చేపట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలు రద్దుచేస్తారు. కాంగ్రెసోళ్లు దేశ ముదుర్లు, అన్ని పార్టీల కండువాలు కప్పుకొని వచ్చి సొల్లు మాటలు చెప్తారు. విని మోసపోయి ఆగమైతే భవిష్యత్ నాశనమవుతుంది. – మంత్రి కేటీఆర్