Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కూటమికి ఓటేస్తే ప్రాజెక్టులు మాయం

-కారు రావాలి.. కేసీఆర్ రావాలి
-మళ్లీ 60 ఏండ్ల దరిద్రాన్ని అంటగడుతారు
-రాష్ట్రంలో జోడెడ్ల బండిలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు
-ముస్తాబాద్ బహిరంగసభలో మంత్రి కేటీఆర్
-కాంగ్రెస్, టీడీపీలను తరిమికొట్టాలి: మంత్రి ఈటల

మాయకూటమికి ఓటేస్తే తెలంగాణలో నడుస్తున్న ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోతాయి. తమిళనాడు, కర్ణాటకలో రైతులకు ఏ సమస్యలొచ్చినా అన్ని పార్టీలూ ఒక్కతాటిపై నిలిచి పోరాడుతాయి. ఇక్కడ మాత్రం దరిద్రపుగొట్టు ప్రతిపక్షాలున్నాయి. ఎన్నో ఏండ్ల నుంచి రైతులు కంటున్న కలలను సాకారంచేసేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభు త్వం కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా దొంగ కేసులు పెట్టి అడ్డుకొంటున్నాయి అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి, సిరిసిల్ల అభ్యర్థి కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో వ్యవసాయానికి తొమ్మిది గంటల కరంట్ ఇస్తామన్న కాం గ్రెస్, టీడీపీ పాలకులు కనీసం రెండుగంటలైనా సరిగా ఇవ్వలేదని, పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించని ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటి ఆ రెండు పార్టీలు ఇప్పుడు ఎన్నికల కోసం కలిసివస్తున్నాయని, పొరపాటున వారికి ఓటేస్తే మన వేలితో మన కంటినే పొడుచుకొన్నట్టవుతుందని అన్నారు.

ఈ ఎన్నికలు ఆషామాషీవి కాదని, మన తలరాతలు మనమే రాసుకునే ఎన్నికలని చెప్పారు. దండంపెట్టి చెప్తున్నా.. కూటమికి ఓటేస్తే మనపైన పెత్తనంతో మళ్లీ 60 ఏండ్ల దరిద్రాన్ని అంటగడుతారు అని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం టీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగసభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్ ప్రసంగించారు. పల్లెల్లో రహదారుల నిర్మాణం కోసం కోటి రూపాయలు ఇవ్వాలని ఈటల, తాను కలిసి గత ప్రభుత్వాన్ని కోరితే అప్పటి మంత్రి జానారెడ్డి ఇవ్వలేదని, పైగా వారి ముఖ్యమం త్రి ఒక్కపైసా ఇవ్వను.. ఏమి చేసుకుంటారో చేసుకోండి అన్నారని, అలాగే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే కరంట్ కోతలతో తెలంగాణ చీకటిమయమవుతుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారని గుర్తుచేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ హయాంలో రాష్ట్రంలోని ప్రతిపల్లెలో రోడ్లువేసుకున్నామని, నాలుగున్నరేండ్ల నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెడ్ల బండిలా పరుగులు తీస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

పేదలు, కులవృత్తులు చేసుకునేవారికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. స్వరాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు. గత ప్రభుత్వాల పాలనలో కరంట్ కోసం రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేయాల్సివచ్చేదని గుర్తుచేస్తూ.. ఇప్పుడు విద్యుత్‌శాఖ అధికారులను అర్రలోవేసి నిర్బంధించిన ఘటనలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? రైతుకు పంటపెట్టబడి సాయం కింద ఎకరానికి ఏటా రూ.8 వేలు, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలు విద్యుత్ ఇచ్చే ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కడైనా ఉం దా? అని ప్రశ్నించారు. రైతుబిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటేనే అన్నదాతల సమస్యలు పరిష్కారమవుతాయని, కరంట్ అడిగితే కాల్చిచంపినోళ్లకు ఓటేస్తే మన వనరులన్నీ ఎత్తుకుపోతారని కేటీఆర్ చెప్పారు.

కాంగ్రెస్, టీడీపీలను తరిమికొట్టాలి: మంత్రి ఈటల
తోడుదొంగలైన కాంగ్రెస్, టీడీపీలను తరిమికొట్టాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. బతికిచెడ్డ తెలంగాణను బతికించుకోవాలన్న తపనతో సీఎం కేసీఆర్ అహర్నిశలూ శ్రమించి రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని చెప్పారు. దేశంలోనే రైతు ఆత్మహత్యలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. 60 ఏండ్ల అవినీతి పాలనకు సీఎం కేసీఆర్ నాలుగేండ్లలో చరమగీతం పాడారని, రైతు సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పథకాలను చూసి మహారాష్ట్రలోని 40 గ్రామపంచాయతీలను తెలంగాణలో కలుపాల్సిందిగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు కేసీఆర్‌ను కోరారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి కులం, మతం, పార్టీలతో సంబంధం లేదని, అన్ని సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరాలన్నదే లక్ష్యమని, ప్రతిపక్షనేత మహేందర్‌రెడ్డికి కూడా సంక్షేమ పథకాలు అందాయని స్పష్టంచేశారు.

సిరిసిల్ల సిరుల ఖిల్లా కావాలన్నదే కేటీఆర్ తపన అని, ఆయన ఎప్పుడూ సిరిసిల్ల నేతకార్మికులు, ప్రజల సంక్షేమం గురించే మాట్లాడేవారని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిక్కాల రామారావు, చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, టీఆర్‌ఎస్ నాయకులు గోపాలరావు, బాపురావు, చక్రధర్‌రెడ్డి, కొమ్ము బాలయ్య, జెడ్పీటీసీ శరత్‌రావు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.