Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

లైంగికదాడి నిందితులను కఠినంగా శిక్షిస్తాం

-ఇప్పటికే ముగ్గురు నిందితుల అరెస్టు -రామక్కపేటలో మంత్రి హరీశ్ రావు వెల్లడి

Harish Rao

గిరిజన బాలికపై లైంగిక దాడి, అడ్డుకున్న తల్లిపై లైంగికదాడికి యత్నం సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. దుబ్బాక మండలం రామక్కపేటలో బాధిత గిరిజన కుటుంబాన్ని సోమవారం మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గిరిజన బాలికపై, ఆమె తల్లిపై లైంగిక దాడి సంఘటనలో నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. దుబ్బాక మండలం రామక్కపేటలో గిరిజన బాలిక, ఆమె తల్లి పై లైంగిక వేధింపుల సంఘటనలో బాధిత కుటుంబాన్ని సోమవారం మంత్రి తన్నీరు హరీశ్ రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. జరిగిన సంఘటన ఎంత మాత్రం సహించరానిదని, ఈ సంఘటనలో ఫిర్యాదు ప్రకారం ముగ్గురు నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారన్నారు. నిందితులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడి, ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. సంఘటనకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వంలో మంత్రిగా తాను తక్షణమే స్పందించానన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తీవ్రంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిధిలో తక్షణ సాయంగా రూ.1,20,000/- నగదు సాయం అందిస్తున్నామన్నారు.

అంతే కాకుండా బాధితురాలి వయసు 17 సంవత్సరాలే ఉన్నందున ఆమెకు మైనార్టీ తీరేంత వరకు వేచి ఉండి, 18 సంవత్సరాల వయసు రాగానే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. అలా కాని పక్షంలో కుటుంబానికి ప్రతి నెలా రూ.3000/- చొప్పున ప్రభుత్వం నుంచి పింఛన్ గానీ, మూడు ఎకరాల వ్యవసాయ భూమి గానీ ప్రభుత్వం కొని ఇస్తుందన్నారు. వీటిలో ఏది ఇష్టపడినా దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇవే కాకుండా మరే సాయం కావాలన్నా చేసేందుకు తాను సిధ్ధంగా ఉన్నానన్నారు. ఇంకా సమస్యలేమైనా ఉంటే స్థానిక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి ఫోన్‌లో సమాచారం ఇచ్చినా, తాము తక్షణమే స్పందిస్తామన్నారు. సిద్దిపేట తహసీల్దార్ ఎన్‌వై గిరికి చెప్పినా, ఆయన ద్వారా తనకు సమాచారం అందుతుందన్నారు. ఈ సంఘటన విషయంలో ఎలాంటి అపోహలు అక్కర్లేదని ఆయన బాధిత కుటుంబానికి సూచించారు. ప్రస్తుతం అందించిన నగదు సాయం రూ.1,20,000/- కు తోడు మరి కొన్ని రోజుల్లో మరో 1,20,000/- నగదు సాయం అందిస్తామన్నారు. ఇవే కాకుండా సంఘటన విషయం తెలిసిన రోజున తాను స్వయంగా రూ. 25,000/- నగదు సాయాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డి ద్వారా పంపించానని వారికి గుర్తు చేసారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఎల్లవేళలా తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్న విషయాన్ని చేతల్లోనే చూపిస్తామన్నారు. అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఆదివారం రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి ఏదో తెల్ల కాగితం పై సంతకం చేయించుకెళ్లారని బాధితురాలి తాత మంత్రి హరీశ్ రావుకు ఫిర్యాదు చేశారు. వెంటనే మంత్రి విషయం ఆరా తీయగా, సంబంధిత సీఐ రామకృష్ణారెడ్డి బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డు చేసుకునేందుకు వచ్చామని, పెట్రోలింగ్ సమయంలో వచ్చి, సంతకం తీసుకున్నామని మంత్రికి చెప్పబోయారు. దీంతో ఆగ్రహించిన మంత్రి హరీశ్‌రావు అంత రాత్రి పూట స్టేట్‌మెంట్ రికార్డు కోసం రావాల్సిన అవసరం ఏముందని, ఉదయం పూట రికార్డు చేసుకోలేక పోయారా ? అని ప్రశ్నించారు. ఇక ముందు రాత్రి వేళ బాధితుల ఇంటికి రావొద్దని ఆయన పోలీసులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డి, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఎంపీపీ ర్యాకం పద్మ శ్రీరాములు, రామక్కపేట సర్పంచ్ కామాజి భాస్కర్, ఎంపీటీసీ సభ్యురాలు డి.విజయ శ్రీనివాస్ గౌడ్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జీడిపల్లి రవి, నాయకులు శ్రీరాం రవీందర్, ఏల్పుల మహేశ్, భీమసేన, ఆస స్వామి, శ్రీరాం రామకృష్ణ ప్రభు, ఏకలవ్య సంఘం నాయకులు వనం రమేశ్, వనం కనకయ్య, వై.ప్రసాద్, శ్రీనివాస్, మల్లారెడ్డి, రామక్కపేట మాజీ సర్పంచ్ ఆర్.మైసరాజు, సిధిరాములు గౌడ్, నగరం కిషన్ తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.