-కొనసాగుతున్న సభ్యత్వ నమోదు -స్వచ్ఛందంగా ముందుకువస్తున్న ప్రజలు

సభ్యత్వ నమోదులో టీఆర్ఎస్ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఒక్కో నియోజకవర్గంలో 5వేల క్రియాశీలక, 25వేల సాధారణ సభ్యత్వాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా అనుకున్నదానికంటే దాదాపు రెండింతలు ఎక్కువ చేసిన పార్టీ శ్రేణులు రికార్డు సృష్టించారు. 20వ తేదీనే సభ్యత్వ నమోదుకు గడువు ముగిసప్పటికీ పార్టీ అధినేత వాటి కంప్యూటరీకరణకు గడువు ఈనెల 28 వరకు పెంచడంతో సభ్యత్వ నమోదు ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తుండటంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా సభ్యత్వాలు అందజేస్తున్నారు. మరోవైపు కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా ఊపందుకుంది.
తిరుగులేని శక్తిగా గులాబీ దండు గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ తిరుగు లేని శక్తిగా ఎదుగుతున్నది. కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రేటర్లో ఇతర దేశ, రాష్ర్టాల నుంచి వచ్చి నివాసముంటున్న ప్రజలు సైతం టీఆర్ఎస్ సభ్యత్వాలను స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీలాంటి ప్రాంతాల్లో సభ్యత్వం జోరుగా సాగుతున్నది. ఇంటిలో నుంచి వీధుల్లోకి రాని మైనార్టీ మహిళాలు సైతం టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. గ్రేటర్ ఇన్చార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డి, కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు, నాయకులు బొంతు రామ్మోహన్, నేవూరి ధర్మేందర్‌రెడ్డి సభ్యత్వ నమోదును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
సోమవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యదర్శి శ్రీనివాసరాజు క్రియాశీల సభ్యత్వం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ సభ్యులంతా సైనికుల్లా వ్యవహరిస్తే క్రియాశీల సభ్యులు కమాండర్లుగా పార్టీ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో సోమవారం జిల్లా పరిశీలకుడు రూప్సింగ్ సమక్షంలో 100 మంది టేకేదార్లు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరంతా క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 4.51 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. బోధన్, నిజామాబాద్ అర్బన్, బాల్కొండ నియోజకవర్గాల్లో అప్లోడ్ ప్రక్రియ 80 శాతం పూర్తికాగా.. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో 50 శాతం ప్రక్రియ పూర్తయ్యింది. నల్లగొండ జిల్లాకు 3.60 లక్షల టార్గెట్ ఉండగా ప్రస్తుతం 5 లక్షల పైచిలుకు సభ్యత్వాలను నమోదు చేయించారు. సోమవారం దేవరకొండ పట్టణంలో జెడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బాలునాయక్, స్థానిక శ్రేణులతో కలిసి పెద్ద సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించారు.
హుజూర్‌నగర్‌లోని కోర్టు ఆవరణలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసోజు శంకరమ్మ న్యాయవాదులకు సభ్యత్వాలు అందజేశారు. హుజూర్నగర్ మండలం మర్రిగూడెంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అల్లం ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. మఠంపల్లి పట్టణంలో కాసోజు శంకరమ్మ, కోదాడ పట్టణంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. దిలాబాద్ జిల్లాలో ఇప్పటికే లక్ష్యాన్ని మించి సభ్యత్వం నమోదు కాగా, దానిని రెట్టింపు చేసేందుకు నేతలు ముందుకు సాగుతున్నారు. సోమవారం నాటికి ఐదు లక్షల మార్కును దాటిన సభ్యత్వ నమోదు మరో లక్ష చేయించే దిశగా సాగుతున్నది. సోమవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బెల్లంపలి ఏరియాలోని అన్ని గనులు, కార్యాలయపై చేపట్టిన సభ్యత్వ నమోదుకు అపూర్వ ఆదరణ లభించింది. ఇప్పటి వరకు 4.80 లక్షలు సభ్యత్వం ఆన్లైన్లో ఎంట్రీ చేయించారు.